26, జులై 2012, గురువారం
మా మంచి తెలుగు పద్యం...
15, జులై 2012, ఆదివారం
అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు! ... ఎవరికి తెలియనిదయ్యా, నీ వరస ? ...
10, జులై 2012, మంగళవారం
అయ్యో, చచ్చి పోయింది...
కష్టే ఫలే ... శర్మ కాలక్షేపం కబుర్లు బ్లాగులో అమ్మయ్య బతికేడు టపా చదివాక ఇది రాస్తున్నాను.
గుండెలు పిండేసే ఆ టపా ఇక్కడ చూడ వచ్చును. వారి టపాకి కామెంటుగా ఈ మాటలు రాయడం కన్నా, నేరుగా ఒక టపాగా ఉంచితే మరింత మందికి అందుబాటులో ఉంటుందని తలచి, ఇది రాస్తున్నాను.
ఆ టపా నన్ను అమితంగా కదిలించి వేసింది.. ఎలాగయితే నేం ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగేరు. ఆ భాగ్యం వారికి కలిగింది. నా బాల్యంలో, అంటే, నాకు పదేళ్ళు ఉండే రోజులలో నేనూ, నా మిత్రులూ కూడా కళ్ళారా చూస్తూనే ఒక మరణాన్ని నివారించ లేక పోయాం. ఆ సంఘటన తలచుకొని ఇప్పటికీ మేమంతా విచారిస్తూ ఉంటాం.
వివరాలలోకి వెళ్తే ...
మా బాల్యంలో నేనూ, నామిత్రులూ కలిసి రైల్వే కట్ట ప్రక్కగా నడుస్తూ, ఊరికి దూరంగా ఓ చోట ఏడు కానాలు అని పిలువబడే ఒక చిన్న కానా గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం కానా అంటే రైల్వే పట్టాలకి అడ్డంగా కట్టిన చిన్న బ్రిడ్జి. ఓ రోజు అలా చాలా సేపు గడిపేక చీకట్లు అలుము కుంటున్న వేళ ఇంటికి పోదాం అని అందరం లేచాం. సరిగ్గా అదే సమయంలో గూడ్సు ట్రయిన్ ఏదో , ఒక వేపునుండి రావడం గమనించాం. అదే సమయంలో రైలు పట్టాల మీద నెత్తి మీద మూటతో పట్టాల నడుమ నుండి నడుచుకు పోతున్న ఒకావిడ మా కంట పడింది. వెనుక నుండి వస్తున్న రైలు శబ్దం విన బడ లేదో, పరాకుగా ఉందో తెలియదు. అలా పట్టాల నడుమ నుండి నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడం మా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక దురలవాటుగా అందరికీ ఉండేది. కారణం, మా వెనుక బడిన ప్రాంతంలో రోజులో మూడో నాలుగో రానీ తరుచుగా పాసింజరు ట్రయిన్లు కానీ, గూడ్సు బళ్ళు కానీ వచ్చేవి కావు.
సరే, అదే ధీమాతో పరాకుగా పట్టాల నడుమ నడుచు కుంటూ పోతున్న ఆమెను హెచ్చరించడానికి గాభరాగా అందరం ఒకేసారి ప్రయత్నించాం. ఆ భయాందోళనల వల్ల అనుకుంటాము, మాలో ఒక్కరికి గొంతు పెగల లేదు. ఎంత ప్రయత్నించినా, మా నోట శబ్ధం రాలేదు.ఒకే సారి అందరకీ గొంతులు పూడ్చుకు పోయాయి. ఇంతలో జరుగ వలసిన ఘోరం జరిగి పోయింది. మా కళ్ళెదుటే ఆమెను గూడ్సు బండి చాలా దూరం ఈడ్చుకొని పోయింది. కొంత దూరంలో బండి ఆగింది. మా దుఃఖం అంతా ఇంతా కాదు. పరుగు పరుగున అక్కడకి చేరు కున్నాం. రైలు పట్టాల మధ్య తునాతునకలై పడి ఉన్న ఆ శరీరాన్ని చూసి వణికి పోయాం.
చాలా రోజులు, కాదు, చాలా ఏళ్ళ పాటు ఆ బీభత్స దృశ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉండేది.
ఇప్పుడు చెప్పండి, వారు తమ ఉద్యోగిని కాపాడు కోవడంలోనూ, మేము ఆమెను కాపాడ లేక పోవడంలోనూ మన ప్రమేయం ఏమైనా ఉందంటారా ? అదే దైవేచ్ఛ అంటే అనుకుంటాను. కదూ
3, జులై 2012, మంగళవారం
గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ ... ఆడియో కూడా ...
గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ చదవండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక 1980 లో ప్రచురణ.
ఈ కథ ఆడియో ఇక్కడ వినండి ....
25, జూన్ 2012, సోమవారం
ఇబ్బంది కాదూ ?!
మనుసులను అంచనా వేయడంలో పొరబడటం వల్ల మనం ఒక్కోసారి మంచి వారినీ , సహృదయులనూ దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కథాంశంతో వ్రాసిన ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురణ.
కథ ఆడియో ఇక్కడ వినండి :
ఇక్కడ కథ చదవండి ....
23, జూన్ 2012, శనివారం
ఎక్కడున్నావు, గొంగళీ ... ?
ఇటీవల శరత్ ‘కాలమ్’ లో అవినీతిని చట్ట బద్ధం చెయ్యాలి అంటూ ఒక మంచి టపా పెట్టారు. ఇక్కడ నొక్కి ఆ టపా చూడ వచ్చును. అది సంగతమూ, జరిగే పనీ కాక పోయినా ఆ విధంగా రచయితలు తమ ఆవేదన వెళ్ళగ్రక్కుతూ ఉండడం పరిపాటి. అదొక విషాద వినోదం.
శరత్ గారు అవినీతిని చట్టబద్ధం చెయ్యమని భావిస్తే, నేను మన ఎన్నికల విధానం పూర్తిగా రద్ధు చేసి నాయకుల ఎన్నిక టెండరు విధానంలో జరిగితే బావుండునని తే 3 - 2 -1991 దీ ఈనాడు ఆదివారం వారపత్రిక లో ఎక్కడున్నావు గొంగళీ ?! అని ఒక కథ ప్రచురించాను. ఆ కథ మీరు ఈ టపాలో చదువ వచ్చును.
దిగజారుడు వ్వవస్థ మీద జనాల ఉక్రోషమే ఏదో ఒకనాడు తిరుగుబాటుగా పరిణమించడం చారిత్రక సత్యమే కదా !
ఇక, కథ చదవండి ...
శరత్ ‘ కాలమ్ ’
శరత్ గారు అవినీతిని చట్టబద్ధం చెయ్యమని భావిస్తే, నేను మన ఎన్నికల విధానం పూర్తిగా రద్ధు చేసి నాయకుల ఎన్నిక టెండరు విధానంలో జరిగితే బావుండునని తే 3 - 2 -1991 దీ ఈనాడు ఆదివారం వారపత్రిక లో ఎక్కడున్నావు గొంగళీ ?! అని ఒక కథ ప్రచురించాను. ఆ కథ మీరు ఈ టపాలో చదువ వచ్చును.
దిగజారుడు వ్వవస్థ మీద జనాల ఉక్రోషమే ఏదో ఒకనాడు తిరుగుబాటుగా పరిణమించడం చారిత్రక సత్యమే కదా !
ఇక, కథ చదవండి ...
శరత్ ‘ కాలమ్ ’
Open publication - Free publishing - More jogh
22, జూన్ 2012, శుక్రవారం
ఎంచక్కని కల !
ఎంచక్కని
కల!
నేరమయ ప్రపంచంలో
ఎన్ని జైళ్ళూ చాలడం లేదు.
నేరమయ ప్రపంచంలో
ఎన్ని జైళ్ళూ చాలడం లేదు.
- - -
క్షణ
కాలంలో
లోకంలో
ఇళ్ళన్నీ జైళ్ళు గానూ,
జైళ్ళన్నీ
ఇళ్ళగానూ
మారి
పోయినట్టు
గమ్మత్తయిన
కల !
అప్పుడు –
ఇళ్ళగా మారిన జైళ్ళన్నీ,
పసి పిల్లల
నవ్వులతో
కళకళలాడి
పోయినట్టు,
ఎంచక్కని
కల !
19, జూన్ 2012, మంగళవారం
అమ్మకానికి కాదు సుమా !
పోయినవి పోగా, మిగిలిన మా పుస్తకాల జాబితా ఇది ... మా పర హస్త గత మయిన పుస్తకాలు ..రావి శాస్త్రి మొత్తం పుస్తకాల సెట్టు, అలాగే ముళ్ళపూడి వారి రచనలు, సాక్షి వ్యాసాలు, భారతి సంచికలు, ఇంకా చాలా ... చాలా ...
లేబుళ్లు:
మంచి పుస్తకాలు
17, జూన్ 2012, ఆదివారం
కొడితే కొట్టాలిరా ...!
నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 - 12 -2011 దీ సంచికలో ప్రచురణ.
లేబుళ్లు:
తెలుగు పద్యం
14, జూన్ 2012, గురువారం
బాల్య చేష్టా విలసితమ్ !
( నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 4 - 1 -2012 దీ సంచికలో ప్రచురణ )
లేబుళ్లు:
తెలుగు పద్యం
11, జూన్ 2012, సోమవారం
ఎవడు బతికేడు మూడు యాభైలు ...
నవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 -3 -2012 దీ సంచికలో ప్రచురణ.
5, జూన్ 2012, మంగళవారం
మంచి పద్యాలు మరోసారి ....
కాటూరి వేంకటేశ్వర రావు గారి పౌలస్త్య హృదయం చక్కని ఖండ కావ్యం దాని పూర్తి పాఠం ఇక్కడ ఉంచుతున్నాను.
లోగడ ఈ పుస్తకం మీద ఓ టపా రాసేను. అందులో పుస్తక సారాంశాన్ని వచనంలో రాస్తూ, అక్క డక్కడ మాత్రమే కొన్ని పద్యాలను ఉదాహరించడం జరిగింది. ఓ మిత్రుడు ఇటీవల ఆ టపా ( ఆ టపా చూడాలంటే, ఇక్కడ నొక్కండి ) చదివి మొత్తం పద్యాలు పెడితే బావుండును కదా అన్నాడు. మంచి పద్యాలు నలుగురితో పంచు కోవడం కన్నా వేరే ఆనందం ఏముంటుంది కనుక ?అందుకే ఆ కావ్యఖండికను ఇక్కడ ఉంచుతున్నాను. చదివి ఆనందించండి ...
2, జూన్ 2012, శనివారం
చల్లనయ్యని చూడరో ...
ఈ కృత్రిమ మంచు శివ లింగం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో ఆర్మీ ప్రాంతంలో శివాలయంలో ఉంది. ఆర్మీ వారి అనుమతితో సివిలియన్స్ వెళ్ళి చూడ వచ్చును. ఆ ప్రాంతమంతా ఎంతో ప్రశాంతంగా , పరి శుభ్రంగా చూడ చక్కగా ఉంటుంది. శివరాత్రి నాడు జన సందోహంతో కళకళలాడి పోతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న చిన్న గుహలాంటి దానిలో దీనిని ఏర్పాటు చేశారు. నిత్యం మంద్ర స్వరంలో ఓంకారం వినిపిస్తూ ఉంటుంది.








