7, జనవరి 2010, గురువారం

కర్ణుడి చావు ... కథ




భారత కర్ణుడి చావుకి కారణాలు ఆరు ...
నరవర
నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధరచే భార్గవు చేతను
నరయంగా కర్ణడీల్గె నార్వురి చేతన్


విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల బాల కర్ణుని చావుకి కారణాలను వెతుకుతూ ...
ఈ కథ190 జూన్ 24 వ తేదీ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురణ.





Posted by Picasa

6, జనవరి 2010, బుధవారం

లెక్క తేలడం లేదు !



పయస్వినీనాం ధేనూనాం
బ్రాహ్మణ: ప్రాప్య వింశతిమ్
తాభ్యోష్టాదశ విక్రీయ
గృహేత్వైకాం గృహం గత:



శ్లోకంలో కవి - ఒక బ్రాహ్మణుడు ఇరవై ఆవులను దానంగా తీసుకుని, అందులో పద్ధెనిమిది ఆవులను విపణి వీధిలోతన జీవిక కోసం అమ్మేసాడని చెబుతున్నాడు. పోనీ లెండి అన్ని ఆవులని అతడేం చేసుకుంటాడు చెప్పండి ? సరే, అలా ఆవులని విక్రయించి, యింటికి కేవలం ఒక్క ఆవుతో చేరాడుట! లెక్క ఎక్కడో తప్పలేదూ? 20 ఆవులని దానంగాతీసుకుని, 18 ఆవులని అమ్మేస్తే యింటికి రెండు (2) ఆవులతో తిరిగి రావాలి కదూ.?
మరేం లేదు ...
బాపడు దానం పట్టిన ఆవులు 20 కాదండీ ... 19 (పందొమ్మిది మాత్రమే) !
శ్లోకంలో ధేనూనామ్ అనే పదాన్ని ... ధేను: , ఊనామ్ అని చదువుకుంటే సరి ! అంటే, ఒకటి తక్కువ ఇరవై అని అర్ధం ! ఊనామ్ అంటే తక్కువ అని అర్ధం కదా?
ఇప్పుడు లెక్క సరి పోయిందోచ్ !

జీవిత సూత్రాలు

జీవిత సూత్రాలు

దు:ఖం
ఇది అధికార సూత్రం
అంతటా అనువర్తి వస్తుంది
అరుభవించు నరుడా !

ఆదర్శాల సూత్రాలు
అన్ని సమస్యలనూ పరిష్కరించ లేవు
సమత గ్రహణాన్ని
స్వార్ధం సర్వత్రా బాధిస్తోంది.

చూదామన్న బహుళ గ్రహణం చేత
నాయకుల వాగ్దానాల సూత్రంలో
కార్యాచరణ మాత్రం
నిఫేధంగా ప్రవర్తిస్తోంది.

సామాన్య సంసారి జీవితం
లాటరీలో ఏ లడాగమమో వస్తేకానీ
బాగు పడేలా లేదు.

కష్టాలు ఎప్పుడూ ఆగమంగానే వస్తాయి.
దరిద్రానికి రోగాలు
ఆమ్రేడితం
ఆకలి వేసేటప్పుడు
పస్తులతో సంధి నిత్యం!

జీతం అందిన మరునాడే
జేబులు స్వత్వ రూపం ధరిస్తాయి.
పైసలకి లోపం, నెత్తి మీద చుట్టాల సంశ్లేషం
ఒక్క సూత్రంలోనే విధించ బడ్డాయి.

ద్రుతం లాంటి విశ్వాసం
అందరి మీదా ఉండీ లేనట్టుంటుంది.

కార్యం తనదైతే మాత్రం - తప్పకుండా
మాయమై పోతుంది.

నా యిష్టం. ఇది నా కష్టం ! అనేవి
గ్రామ్య ప్రయోగాలు
అది
నీ లక్షణ విరుద్ధ మైన భాష !
తెలుసుకో
సామాన్య మానవుడా !
^ ^ ^

ఈ గేయంలో వాడిన సాంకేతిక పదాలు ... తెలుగు వ్యాకరణానికి చెందినవి. వ్యాకరణ పారిభాషికా పదాలతో పరిచయం ఉన్న వారందరికీ గేయం సుళువుగానే అర్ధం కాగలదు.

పతంజలి రచనలు ...

పతంజలి గారి రచనలు, సన్మానాలు, ఇతర ఫొటోలు. వీటిని నేను వెబ్ ఆల్బమ్ నుండి సేకరించాను. వారికి నా ధన్య వాదాలు. పతంజలి గారు నా కథల సంపుటి అపురూపం కి ముందు మాట రాసారు.









మా చదువుల తల్లి ...







































































విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన సత్రం. ఇక్కడ అన్న ప్రసాదాన్ని తిని చదువుకున్నాను.









విజయ నగరం . ప్రభుత్వ మహా రాజా వారి ప్రాచ్య భాషా కళాశాల. ఇక్కడే



నా భాషా ప్రవీణ చదువు అక్కడ 1969 - 1972 వరకూ జరిగింది.

శ్రీ మానాప్రగడ శేష సాయి గారు కళాశాల అధ్యక్షులు.

గోపాల రావు గారు, గోవిందాచార్యులు గారు, కస్తూరి గారు, సాంబ శివ రావు గారు, భాష్యకారాచార్యులు గారు, బుద్ధరాజు రామ రాజు గారు, శఠకోపాచార్యులు గారు ,
సుబ్బమ్మ గారు, కల్యాణి గారు, రంగా చారి గారు, రాష్ర్టపతి అవార్డు గ్రహీత పేరి సూర్య నారాయణ గారు... మా గురు దేవులు ...

ఇక మా మిత్రులు ... స్వర్గీయ దువ్వూరి పేరయ్య
పోమయాజులు, మంగి పూడి వెంకట రమణ మూర్తి, (హరి కథకులు) పి.వి.బి. శ్రీరామ మూర్తి ( కథా రచయిత) చింతా రామక్రిష్ణ, (కవి), బగ్గాం రామ జోగారావు (నటులు), బుడితి బలరామునాయుడు (సీర పాణి - డమరు ధ్వని కావ్య రచయిత)

కె.యన్.వై.పతంజలి ( ప్రముఖ హాస్య వ్యంగ్య రచయిత, పాత్రికేయులు) రాజా వారి కళాశాల విద్యార్ధి.





























































































































గోవు మా లచ్చిమికి కోటి దండాలు







ఈ కథ జనవరి రెండు 1981 ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితం. ఆ పత్రిక నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ.
Posted by Picasa

అపురూపం కథల సంపుటి





అపురూపం నా కథల సంపుటి.
కథా సంపుటానికి ముందు మాట శ్రీ కె.ఎన్.వై. పతంజలి గారు రాసారు. కథల సంపుటి 1998 లో ప్రచురించ బడింది.

ఇందులో కథలు : 1. గుండె తడి2. ఎక్కడున్నావు గొంగళీ గోవు మా లచ్చికి కోటి దండాలు ౪. మసి మరకలు. అపురూపం 6. తూర్పు వెళ్ళని రైలు 7. వరద 8. ఇబ్బందే9. మడత నలగని కోరిక 10. దారికట్టు 11. అమ్మా బళ్ళోకివెళ్ళనే 12.అనాధలు కావలెను. 13 కర్ణుడి చావు 14.క్షమించు నేస్తం 15. చింతలు తీరని చీకట్లు 16. సహనావవతు 17. పతనం 18.కనబడుట లేదు 19. గెలుపు 20. గోడ 21 ఇంటికి పోదాం 22. నరమేధం జరుగుతోంది. 23.విస్తరాకు 24. బొమ్మల చొక్కా 25. కొత్త జీవితానికో కొండ గుర్తు 26 .శిక్ష 27. అంచనా 28. వేడుక 29. పందెం 30. ఆ గూటి చిలుక
ఈ కథల సంపుటం ప్రోగ్రసివ్ కమ్యూనికేషన్స్ వారి ప్రచురణ.
ప్రచురణ కర్త : శ్రీ నామాల విశ్వేశ్వరరావు
అంకితం
అమ్మ : పార్వతమ్మకి, నాన్న : సత్య నారాయణ మూర్తి గార్లకి.

Posted by Picasa

4, జనవరి 2010, సోమవారం

ఆగండి, మీరూ కొంచెం ఆలోచించండి ...


మనం నిత్యం ఎదుర్కొనే ఒక యిబ్బంది గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా?
కిక్కిరిసిన సిటీ బస్ లో ప్రయాణం చేస్తున్నాం. ఒంటి కాలి మీద ఆపసోపాలు పడుతూ నిలబడి ఉన్నాం. బస్ ఎంతవరకూ వచ్చిందో తెలీదు. కండక్టరు అరచి చెప్పడు. చెప్పినా, గోలలో వినబడదు. అంతా కంగారు కంగారుగాఉంటుంది.బస్ లో బయటకి సందు చేసుకుని చూస్తాం. నగరం మీకు పాతదే అయినా, ఏరియా మీకు కొత్త. ఎంత వరకూ వచ్చారో తెలీదు. బోర్డూ ఉండదు. ఎంతకని పక్క వాళ్ళని అడిగి విసిగిస్తాం చెప్పండి.

పరిష్కారం : రోడ్డు ప్రక్క ఉన్న ప్రతి బోర్డు మీదా వాళ్ళ షాపుల పేర్లూ గట్రా రాసుకోవడంతో పాటు ... షాపున్నఏరియా పేరు విధిగా రాయాలని కట్టడి చేయడం. ఏరియా పేరు లేని బోర్డునీ ఉంచడానికి నగర పాలక సంస్థఅంగీకరించక పోవడం. నిర్బంధంగా, బోర్డుల సైజులని బట్టి, అక్షరాల సైజులు ఉండేలా తెలుగు, ఇంగ్లీషు భాషలలోరాసేలా నిబంధనలు పెట్టడం.
బస్ షెల్టర్ల మీద కూడా ఏవో ప్రకటనలే తప్ప ఏరియా పేరు కనిపించక పోడం ఘోరం కదూ?

ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరుండే పోలీస్ సిగ్నల్ ఉండే చోట బంక్ ల మీద కూడా ఏరియా పేరు కనిపించదు. గమనించేరా?

నగరంలో అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే ఏ రియా పేరు ఏ కొందరో తమ సైన్ బోర్డుల మీద రాసేరు.( ఆ పుణ్యాత్ములకి శత కోటి వందనాలు)

బస్ లో వెళ్ళే వారికే కాదు, నడిచి వెళ్ళే వారికీ, ఇతర వాహనాల మీద వెళ్ళే వరికీ కూడా యిబ్బంది ఎప్పుడూఎదురవుతూనే ఉంటుంది... ఓ సారి ఓ స్కూటరిస్ట్ నా పక్కకి వచ్చి బండి ఆపి. ‘ ఫలానా ఏరియా ఏదండీ’ అనడిగేడు. ‘అయ్యో, మీరు దాన్ని దాటి చాలా దూరం వచ్చేసారే ! మళ్ళీ వెనక్కి వెళ్ళండి .. ఆరు కిలో మీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ అడగండి.‘ అని చెప్పాను ... బిక్క ముఖం వేసుకుని,యీసురోమంటూ బండిని వెనక్కి తిప్పడం కోసం ముందుకి మరో అర కిలోమీటరు వెళ్ళి ... అతను పడ్డ అవస్థ గురించి యిప్పుడెందుకు లెండి ... ... వాహన చోదకులకి , వాహనాల మీద పయనించే వారికీ, పాద చారులకి, యీ యిబ్బంది తొలిగి పోవాలంటే మార్గమే లేదా?
తెలిసిన వాళ్ళకి ఫరవా లేదు. కొత్త వారికి మాత్రం నరక యాతనే కదూ?
చదువుకునీ, చదువు రాని వాళ్ళలా కొత్త చోట్ల వెర్రి మొహాలు వేయ వలసి రావడం ఎంత దారుణమో ఆలోచించండి ...
మీకు తోచిన మరిన్ని మంచి పరిష్కారాలని సూచించండి ...

2, జనవరి 2010, శనివారం

పద్య భ్రమరుకం ... పాద భ్రమరుకం !

వేసవి కాలం. మధ్యాహ్నం ఎండ ఫెడీల్మని పేల్చేస్తూ ఉంటే, ఇంట్లో అమ్మో, నాన్నమ్మో, అత్తమ్మో, పెద్దమ్మో, అమ్మమ్మో ... ఎవరో ఒకరు మామిడి కాయలు ఊరగాయ కోసం తరుగుతూ ఉంటే ...



ఒకటో, రెండో ముక్కలు లాక్కుని, ఉప్పూ కారం నంచుకుని తింటూ ఉంటే...

వాహ్ ! ఆ రోజులు ఎంత భలేగా ఉండేవో ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి...

అంతే కాదు, ఆ తరిగిన ముక్కల పక్కన పెద్దాళ్ళు పారేదామని ఉంచిన మావిడి జీడి కుప్పలోనుండి ఒకటో,రెండో తీసుకుని ... గోడల మీద కొక్కిరిబిక్కిరిగా ...
‘‘ దడిగాడు వాన సిరా’’ అని రాయడం గుర్తుకొస్తోందా?

ఎటు చదివినా ఒకే మాదిరిగా ఉండే ఈ వాక్యానికి మన తెలిగింటి మట్టి గోడలు గొప్ప ప్రాచుర్యాన్ని యిచ్చాయి కదూ!


మన కవులు కూడ యిలాంటి తమాషా పద్యాలు చాల రాసేరు. వాటిని పాద భ్రమకాలనీ, పద్యభ్రమకాలనీ అనొచ్చు.
ముందుగా పాద భ్రమకం. పద్యంలో ప్రతీ పాదమూ ఎటుచదివినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత! చూడండి ...

ధీర శయనీయశరధీ
మార విభాను మత మమత మనుభావి రమా
సార సవన నవసరసా
దారదసమతార తార తామ సదరదా !


ఇప్పుడు పద్య భ్రమకాన్ని చూద్దామా? పద్యం మామూలుగా మొదటి నుండి చదివినా, చివరి అక్షరం నుండి వెనక్కి చదివినా ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.

రాధా నాధా తరళిత
సాధకరధతావర సుత సరసనిధానా
నాధాని సరసత సురవ
తాధర కథసా తళిరత ధానాధారా !


ఆగండాగండి, యతి ప్రాసలూ గణాలూ తెలిస్తే, ఎటునుంచెటు చదివినా ఒకేలా ఉండే అక్షరాలను మేమూ పేర్చ గలం అని అనుకో వద్దు సుమా ! ... ఎందుకంటే, యివి రెండూ పూర్తిగా అర్ధవంతాలయిన పద్యాలు....
వీటి అర్ధాలను తెలిసిన వారు ప్రయత్నించి చెప్పమని కోరుతున్నాను ...

వీటి అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా, ఈ పద్యాలను కథామంజరి బ్లాగులో ... దడిగాడు వాన సిరా.




Posted by Picasa

పాల పిట్ట కథలు - మన చిన్నారుల కోసం ఓ మంచి పుస్తకం !

Posted by Picasa మన చిన్నారులకి మనం యిచ్చే మంచి బహుమానం ఓ కొత్త బొమ్మ, ఓ బొమ్మల చొక్కా, ఓ పువ్వుల గౌను, ఓ రంగు రంగుల బెలూను, ఓ మంచి పెన్ను, కలర్ పెన్సిల్స్ ... ... ఇలాంటివే కదా?

కాదు ... కాదు ... వీటితో పాటు ... ఓ మంచి రంగు రంగుల పిల్లల పుస్తకం ! పెద్దక్షరాల పిల్లల పుస్తకం ! ... అందులో రాక్షసులూ , మాంత్రికులూ, మాట్లాడే చెట్లూ, పలకరించే గాలులూ, తమతో పాటు ఆడుకునే పక్షులూ, పిట్టలూ. జంతువులూ, ఎగిరి పోవడాలూ , మాయమైపోవడాలూ, ప్రత్యక్షమవడాలూ ... యింకా చాలా చాలా ... ఉండాలి ... ఉంటాయి కూడానూ ...
అప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో మెరుపు !
అప్పుడు చూడాలి వాళ్ళ ముఖంలో ఆనందతాండవం !
అప్పుడు చూడాలి వాళ్ళ పెదాల మీద వెన్నెల విరజిమ్మినట్టు చిరు నవ్వు ...

చిన్నారి చేతులతో వాటిని అందుకుంటూ, థాంక్యూ మమ్మీ, థాంక్యూ డాడీ ... అంటూ పలికే ఆ చిన్నారుల చిలుక పలుకులని విని పరవశించి పోవాలని మనకుండదూ?

ఈ కొత్త సంవత్సరం మొదలవుతూనే, మన పిల్లలకి అపురూప బహుమతిగా యివ్వ తగిన ఒక చక్కని పుస్తకం పాల పిట్ట ప్రపంచ జానపద కథలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కొత్తగా వెలువరించారు!

కొత్త సంవత్సరం ( 1 - 1 - 2010 ) రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి ఈ పాల పిట్ట పిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఎ.ఎన్.జగన్నాధ శర్మ 27 ప్రపంచ ప్రసిద్ధ జానపద కథలను అందమైన , సరళమైన శైలిలో, పిల్లను అమితంగా ఆకట్టుకునే రీతిలో, చక్కని బొమ్మలతో వెలువరించిన పిల్లల పుస్తకం - పాల పిట్ట.

పత్రికా రచయిత, నవ్య వార పత్రిక సంపాదకులు, నవలా కథా రచయిత, టి.వి, సినిమా రచయితగా ప్రసిద్ధులైన శ్రీ జగన్నాధ శర్మ బాల సాహిత్యం మీద ఎనలేని మక్కువతో ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను పాఠకులకు అందించారు.
ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించిన ఈ పాల పిట్ట పిల్ల పుస్తకం రూ. 90 లకే లభ్యమైతోంది.
‘‘ ఈ పాల పిట్టలోకి అడుగు పెట్టడమంటే, మనం మరిచి పోయిన దేశంలోకి, కొత్తగా అడుగు పెట్టడమే ! కొత్త రుతువులకి రెప రెపలాడే కిటికీలను తెరవడమే!’’ ... అంటున్నారు రమణ జీవి.

‘‘ ఈ కథల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళి పోతారు. అమ్మమ్మలూ, నాన్నమ్మలూ చెప్పిన జానపద కథల్లోని మాయాప్రపంచంలో విహరిస్తారు పరుగుల ప్రపంచపు బాధలనుంచి కాస్త ఉపశమనం పొందుతారు ...’’ అంటున్నారు సుంకోజి దేవేంద్రాచారి.

‘‘ నా బాల్యంలో పెద్దలెవరయినా నాకు మంచి మంచి పిల్లల కథలు చెప్తే బావుండునని అనుకునే వాడిని.... కాని, మా కుటుంబ నేపథ్యం కారణంగా ఆ కోరిక సాంతం నెరవేర లేదు ... ఆ కోరిక యిప్పుడిలా తీర్చుకుంటున్నాను! ...
మా చిన్నారి మనవరాలు చిరంజీవి లాహిరికి ఎన్నో మంచి మంచి , గొప్ప గొప్ప పిల్లలల అద్భత కథలు చెప్పాలి. నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి ... అందుకే ఈ పాల పిట్ట కథలు రాసాను ...’’ అని రచయిత ఆవిష్కరణ సభలో ఒకింత ఉద్వేగానికి లోనవుతూ చెప్పారు ...


మరి, యింత మంచి పుస్తకాన్ని మనమూ మన పిల్లలకి బహుమతిగా కొని యిద్దామా?






















నత్తలుండవూ?!


అల్పులు ఎప్పుడూ తక్కువ ఆలోచనలేచేస్తూ ఉంటారు. ఉన్నతమయినఆలోచనలు వారికి రావు, మరి ! పద్యంచూడండి ...
నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్

చూసారు కదూ? అందుకే కదా అన్నారు, ‘‘ పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? అని !
రకమయిన అల్పత్వాన్నే ప్రదర్శించిన బకరాజు వృత్తాంతం చూడండిదిగో ...

















ఎవ్వడవీవు? కాళ్ళు మొగ మెఱ్ఱన?’ ‘హంసను’. ‘ఎందునుందువో?’
దవ్వుల మానసంబునను’ ‘దాన విశేషములేమి తెల్పుమా?’
మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ గలవందు ’ ‘నత్తలో?!’
అవ్వి ఎరుంగమన్న నహహాయని నవ్వె బకంబులన్నియున్.














రాయంచ మానస సరోవరం నుండి ఎలా వచ్చిందో, కొంగలుండే కొలను దగ్గరికి వచ్చింది దానిని చిత్రంగా చూసాయి, అక్కడున్న కొంగలన్నీ. కుతూహలంగా హంసను అడిగాయి : ‘‘ భలే ! నీ కాళ్ళూ, ముఖం ఎర్రగా ఉన్నాయి...నీ ఊరేది? ఎక్కడుంటావు? అక్కడి విశేషాలు చెప్పు .’’ అని.
రాయంచ బదులిచ్చింది : ‘‘ నేను హంసను. నా నివాసం మానస సరోవరం. అబ్బో అదిక్కడికి చాలా దూరం లెండి ...’’
‘‘ అలాగా ! మరక్కడ విశేషాలో?’’
రాయంచ పొంగి పోతూ తమ ప్రాంతం విశేషాలను గొప్పగా చెప్పింది : ‘‘ వాహ్ ! అక్కడ బంగారు పద్మాలూ, మంచిముత్యాలూ ఉంటాయి తెలుసా ?! ’’ అని..
కొంగలు చప్పున అడిగేయి : ‘‘ చాల్లే, సంబడం ! ... ఇంతకీ, అక్కడ నత్తలుంటాయా? అది చెబుదూ ముందు ... ’’
రాయంచ తెల్లబోయింది. అమాయికంగా బదులిచ్చింది : ‘‘ నత్తలా ! వాటి సంగతి మాకు తెలీదే ! ’’ అని.
దాంతో కొంగలన్నీ పక పకా ( బక బకా అని అందామా?) నవ్వి, రాయంచనిఓసి వెర్రి మొహఁవాఅన్నట్టుగా చూసివెక్కిరించాయిట !

ఇలాంటి బడుద్ధాయిలను చూసే కదా, మన ప్రజాకవి వేమన ...
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
విశ్వదాభిరామ ! వినుర వేమ !
అని చెప్ప లేదూ !

ఎలాగూ హంసల గురించీ , కొంగల గురించీ వచ్చింది కనుక, బాతుల గురించి కూడా చెప్పుకుందాం...
శ్రీకృ ష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో చక్కని పద్యాన్ని గుర్తు చేసుకుందాం ...














తలబక్షచ్చటగ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్నాతప్రయాతద్విజా
నలిపిండీకృత శాటులన్సవిధతద్వాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబారు వాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.


ఎంత అపురూపమైన వర్ణనో చూడండి ...
తెల్ల వారు ఝూమునే లేచి, నదీ తీరానికి పోయి, బ్రాహ్మణులు స్నానాదులాచరిస్తారు కదా? అయితే, వాళ్ళు ఒక్కో సారిఅక్కడ తమ బట్టల పిడుచలు మరిచి పోయి యిళ్ళకి వెళ్ళి పోతూ ఉండం కద్దు. రోజు, నది ఒడ్డున రెక్కలలో తలలుదూర్చుకుని, నిద్ర పోతున్న బాతుల్ని చూసి, అవి బాపనయ్యల బట్టలనుకుని, వాటిని వారికి తిరిగి యిచ్చేద్దాం అని, ఆరెకులు దగ్గరగా వెళ్ళారు. వాళ్ళు దగ్గరకి రావడంతో, చప్పుడికి బాతులు నిద్రలేచి,టపటపా ఈదుకుంటూ వెళ్ళిపోయాయిట! తతంగాన్ని చూసి, అక్కడున్న పైరు కాపరి యువతులు విరగబడి నవ్వారుట !
ఇంత మనోహరంగా వర్ణించడం రాయల వారికే చెల్లింది కదూ !

31, డిసెంబర్ 2009, గురువారం

గుండె తడి



తడి ఆరిన మనసులను చూస్తూ ఉంటే భయం వెయ్యదూ?

ఆర్ద్రత లోపించిన మనస్తత్వాలు ...
లోపిస్తున్న మానవీయ విలువలు ...
భయం వెయ్యడం లేదూ?


ఉండాల్సిందేదో కోల్పోతూ ఎక్కడికి పరుగులు పెడుతున్నాం?


ఒక కన్నీటి చుక్క ... ఒక తడియారని గుండె చప్పుడు ...
ఒక ఆత్మీయమైన పిలుపు, పలకరింపు, బుజ్జగింపు ...


ఇవీ కావాలి. ఇవే కావాలి ...

ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక 6 -6-1990 దీ సంచికలో ప్రచురణ.
ఒక తడి గుండె చప్పుడు మీతో పంచుకోవాలని ...
















Posted by Picasa

శ్లోకానికి పేరడీ !

మన కవులు శ్లోకాలలో, పద్యాలలో అన్య భాషా పద విన్యాసాలతోచాలా తమాషాలు చేసారు. నేను సేకరించిన వాటిలో కొన్నింటినిఇక్కడ ఉంచుతున్నాను.








ముందుగా మూల శ్లోకాన్ని చూదాం ...
క్షుధాతురాణాం నరుచిర్న పక్వ:
అర్ధాతురాణాం నగురుర్నబంధు:
నిద్రాతురాణాం సుఖం శయ్యా
కామాతురాణాం నభయం లజ్జా

దీనికి మరొ కవి గారి పేరడీ చూడండి ...

క్షుధాతురాణాం నవుడికర్నవుడక:
అర్ధాతురాణాం చెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం మెట్టర్నపల్లం
కామాతురాణాం నముసిలిర్న పిల్ల:

అలాగే, ఒక కవి గారు తన దరిద్రాన్ని గురించి వాపోతూ ...

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు నసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి.
ఇందులో అశ్లీల పదం బాధాకరమే, అయినా, దరిద్రం అలా కవి చేత అనిపించింది కాబోలు.

పెద్ది భట్టు మురికి బట్టలు వేసుకుని రాజదర్శనానికి వెళ్తూ తన పాండిత్యమే తనకి తోడు అని చెప్పినది ...

కిం వాససా చీకిరి బాకిరేణ?
కిం దారుణా వంకరటింకరేణ?

దీనికి పెద్ది భట్టు సమాధానం ...

శ్రీసింగభూపాల విలోకనార్ధం
వైదుష్యమేకం విదుషా సహాయ:



కవులు నిరంకుశులు కదా? గొప్ప ఆత్మాభిమానధనులు కూడ...
‘‘ రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు ..... ’’ అనినా, ‘‘ కావ్య కన్యకన్ కూళులకిచ్చి యప్పడుపు కూడు ....‘‘ తిననొల్లనని ఖండితంగా చెప్ప గలిగినా వారికే చెల్లింది. ‘‘ యుగం నాది ’’ అని సగర్వంగా ప్రకటించుకో గల ధీమంతులుకూడ వారే కదా !