కథా మంజరి
23, నవంబర్ 2020, సోమవారం
నవ రస(జ్ఞ) భరితం: కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం
నవ రస(జ్ఞ) భరితం: కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం: ఈ పేరు తలుచుకుంటేనే ఏదో క్రొత్త ఉత్సాహం. సాధారణంగా నేను వ్రాయబోయే టపాల శీర్షికలు ముందుగా చెప్పను. కానీ దీని గురించి ఇంతకు ముందే చెప్...
28, జనవరి 2020, మంగళవారం
చెప్తే వినాలి
చెప్తే వినాలి
సంతస్తాయసి సంస్థితస్య
పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ
పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య
పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ
జుషా మేవం విధా వృత్తయ :
నీరము తప్త లోహమున నిల్చి
యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ
దళ సంస్థితమై తనర్చు ,
నా
నీరమె శుక్తిలోఁబడి
మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ
మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్
బాగా కాలిన లోహం
మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా
మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.
అలాగే, మనం
అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని
సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.
దుర్జనులు ఎప్పుడూ
పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని
ఆదరించం కదా ?
27, జనవరి 2020, సోమవారం
ఇచ్చుటలో ఉన్న హాయీ..
ఇచ్చుటలో ఉన్న హాయీ..
ప్రియ:ప్రజానాం దాతైవ న
పునర్ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై
ర్వారిదో నతు వారిధి :
మబ్బు ఎప్పుడూ నీటినే
యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !
ఎంత మంచి శ్లోకమో
చూసారు కదూ ?
ఇవ్వడంలోని గొప్పతనం
అలాంటిది మరి...
ఇవ్వడంలోని
ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపై కపోల
తటిపైఁబాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు
గ్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !
వామన చరితంలోని ఈ పద్యం
బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన
పద్య రత్నాలలో యిదొకటి !
లేబుళ్లు:
మంచి పలుకు
26, జనవరి 2020, ఆదివారం
రాజు రాజే, బంటు బంటే 02
రాజు రాజే, బంటు
బంటే 02
నిన్నసింహం ధీరత్వం చూసాం.
మరి, ఇవాళ కుక్క
హీనత్వం చూదాం ...
లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర
దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే
గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు
శతైశ్చ భుక్తే
వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు
క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని
కట్టెదుటన్ శునకంబు, భద్ర
శుం
డాలము శాలితండులగుడంబులు
చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ
యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్
యజమాని పడేసే ఎంగిలి కూడు
కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే కదా ?
యజమాని ఎదుట తోక
ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని
వికార పోకడలయినా, పోతుంది.
దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.
సింహం సింహమే ! ఏనుగు
ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!
లేబుళ్లు:
మంచి పలుకు
25, జనవరి 2020, శనివారం
రాజు రాజే, బంటు బంటే 01
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ
విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం
తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ
గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను
ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత
గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి
జీర్ణ తృణంబు మేయునే?
తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని
చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు. సింహం గొప్పతనం చూసాం కదా ; రేపు కుక్క నైచ్యం
ఎలాంటిదో చూదాం.
లేబుళ్లు:
మంచి పలుకు
24, జనవరి 2020, శుక్రవారం
పలుకే బంగారం 13
పలుకే బంగారం 13
చక్కగా మాట్లాడటం
వ్యక్తికి అలంకారమని చెప్పేరు.
మాట్లాడకుండా ఉండడం కూడా
కొండొకచో శోభిస్తుంది సుమా !
ఎలాగంటే ....
మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం
వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో
యావత్కించిన్నభాషతే.
మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు
లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే .....
నోరు విప్పనంత వరకూ !!
స్వస్తి.
రేపటి నుడి మరో మంచి శీర్షికతో కలుద్దాం.
లేబుళ్లు:
మంచి పలుకు
22, జనవరి 2020, బుధవారం
పలుకే బంగారం 12
పలుకే బంగారం 12
మంచి మాటల గురించి సుమతీ
శతకంలోంచి ఓ మంచి మాట ...
మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి
ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు
సిద్ధము సుమతీ !
మాటకి సత్యాన్ని పలకడమే
ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి
కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం
వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...
లేబుళ్లు:
మంచి పలుకు
21, జనవరి 2020, మంగళవారం
పలుకే బంగారం 11
పలుకే బంగారం 11
మంచి వాడు ఎప్పుడూ మంచి
మాటలే పలుకుతాడు. కఠినంగా మాట్లాడడు. ఒక వేళ ఎప్పుడినా అతను కఠినంగా పలికినా మేలే
జరుగుతుంది తప్ప - కీడు కాదు. చూడండి భాస్కర శతకంలో కవి ...
పలుమరు సజ్జనుండు ప్రియ
భాషలె పల్కు , కఠోర
వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి
పల్కినఁగీడునుఁగాదు ; నిక్కమే
చలువకు వచ్చి
మేఘుఁడొకజాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు ! వేగిరమె
శీతల నీరముఁగాక భాస్కరా !
సజ్జనుడు సదా మంచి మాటలే
పలుకుతాడు. ఎప్పుడూ కఠినంగా పలుకడు. ఒక వేళ ఎప్పుడయినా అతని నోటి వెంట కఠినోక్తులు
వచ్చినా , దాని
వలన మనకి కీడు కలుగదు. మంచే జరుగుతుంది.
ఎలాగంటే, లోకానికి చల్లదనాన్ని
ఇవ్వడం కోసం మేఘుడు వచ్చి, వర్షం
కురిపిస్తాడు. ఒక్కోసారి వడగళ్ళూ కురిపిస్తాడు. అయితే అవి రాళ్ళలాగా ఉండి పోతాయా ? వెంటే చల్లని నీటిగా
కరిగి పోదూ ?
లేబుళ్లు:
మంచి పలుకు
20, జనవరి 2020, సోమవారం
పలుకే బంగారం 10
మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం అని పోతన గారు భాగవతంలో చెప్పిన పద్యం చూడండి...
బ్రతుక వచ్చు గాక బహు
బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక
!
జీవ ధనము లైన చెడు గాక
పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు
!
కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ
మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....
లేబుళ్లు:
మంచి పలుకు
18, జనవరి 2020, శనివారం
పలుకే బంగారం 08
పలుకే బంగారం 08
నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు
ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి
చౌడప్పా !
నీతి మాటలు చెప్పడాని కేముందిలే... బూతు మాట్లాడక పోతే
సభాసదులు నవ్వరు. నీతులూ, బూతలూ లోక ఖ్యాతులు అంటాడు చౌడప్ప. జానపదుల కన్నా, మన రాజకీయ సన్నాసులు ఈ మాటను
బాగా ఒంటబట్టించు కున్నట్టుది కదూ?
లేబుళ్లు:
మంచి పలుకు
17, జనవరి 2020, శుక్రవారం
పలుకే బంగారం 07
పలుకే బంగారం 07
సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి
మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...
పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !
సభారంజకగా మాట్లాడాలంటే ఓ పది నీతులూ, ఓ పది బూతులూ ప్రసంగంలో ఉండాలని
చెబుతున్నాడు.
సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.
లేబుళ్లు:
మంచి పలుకు
16, జనవరి 2020, గురువారం
పలుకే బంగారం 06
పలుకే బంగారం 06
ప్రియ భాషణల గురించి పోతన గారి పద్యం చూడండి...
అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్
పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన
పద్యమిది.
కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని
కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి
అలంకారాలు ...
లేబుళ్లు:
మంచి పలుకు
13, జనవరి 2020, సోమవారం
పలుకే బంగారం o5
పలుకే బంగారం 05
తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ
పాపహేతువేనని నన్నయ గారు ...
తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును,
సత్యము
సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.
తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ,
సత్యము
పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు
...
లేబుళ్లు:
మంచి పలుకు
12, జనవరి 2020, ఆదివారం
పలుకే బంగారం 04
లేబుళ్లు:
మంచి పలుకు
11, జనవరి 2020, శనివారం
పలుకే బంగారం 03
పలుకే బంగారం 03
భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...
బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్
బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి.
చెబితే వినరు.
ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప
లేం.
ఇక ఇతరులంటారా,
వారికి
చెప్పినా అర్ధం కాదు.
అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు
దాటి బయటకి రావడం లేదు.
దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి
...
బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.
లేబుళ్లు:
మంచి పలుకు
10, జనవరి 2020, శుక్రవారం
పలుకే బంగారం 02
పలుకే బంగారం 02
బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు
బాధించకుండా మాటలాడ దగునని చెప్పాడు
.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి.
ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్యవహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.
అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని
చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక,
కాస్త
సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...
లేబుళ్లు:
మంచి పలుకు
9, జనవరి 2020, గురువారం
పలుకే బంగారం 01
పలుకే బంగారం 01
సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే
అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.
ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా
వివరించాడో చూడండి ...
కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము
కలిమిన్ !
పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు
కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా,
కోకిల
- అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ?
దాని
గొంతువిని మెచ్చుకుంటావు ?
మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట
పడుతున్నావు ?
అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల
అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....
లేబుళ్లు:
మంచి పలుకు