25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఏ ఆవురా బావా !!


చిన్న కంద పద్యంలో కవి గారు, ఒకాయన తన బహు భాషా నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో చెప్తున్నారు. చూడండి ...

బావయు మరిదినిగని, యీ
యావులలో నొకటి బేరమాడుమనఁగ ‘‘నే
యావ’’ని యడిగిన వాక్యము
గావలయుంభాషలైదుగా నొక పదమున్.


బావా మరుదులిద్దరూ సంత కెళ్ళారు. మంచి ఆవు నొకదానిని బేరం చెయ్యడానికి. బావ గారు అక్కడున్న ఆవులలో ఒక దానిని చూసి, బేరమాడమన్నాడు. మరిది గారికి అక్కడున్న వాటిలో ఒక్కటీ నచ్చినట్టు లేదు. ‘‘ పదరా, బావా పోదాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు....ఒక భాషలో చెబితే చాలదన్నట్టు మొత్తం ఐదు భాషలలో పోదాం పద రమ్మన్నాడు...
పద్యంలో ఉన్న దాన్ని ‘‘ ఏ ఆవురా బావా’’ అని మారిస్తే ఆ భాషా పదాలు కనిపిస్తాయి...అన్నింటికీ రమ్మనే అర్ధం !!


ఏ - మరాఠీ
ఆవు - ఉర్దూ
రా - తెలుగు
బా - కన్నడం
వా - తమిళం

2 కామెంట్‌లు:

budugoy చెప్పారు...

read this in childhood.. somehow this phrase never quit my mind. nice one.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

మిత్రమా!
ఇందులో మరో తమాషా కూడా ఉంది.
ఐదు భాషల పదా లుండడమే కాదు. ఆ ఐదు భాషల పదాలకీ కూడా అర్థం కూడా ఒక్కటే (ఇలా రా---అని) అవడం మరో విశేషం మనకు కనిపిస్తోంది కదూ? చూడండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి