తెలుగు పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2015, సోమవారం

వో పాలేటయినాదంటే ....!పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------

విక్కడ మీకో డౌటు సందేయం రావాల ! వొరే కదా మంజరి బ్లాగరోడా, ఆల్లని పల్లెటూరి బయితులన్నావూ, తఁవరేదో పట్న పోల్ల నాగా ఆల్లని ఎక  సెక్కాలాడేవూ ! ఏటిదంతా. తప్పు కాదా ! కల్లు పోవా ! పైన దేవుడు సూడ్డా !అంతారు. కద ?

నిజిఁవే.  కానయితే ఆల్ల కత ఆల్ల మాటల్లోనే పెపితే ఎలాగుంతాదో సూద్దాఁవని పెయత్నం సేసినానంతే.

మన ముకం ! ఆల్ల నాగా సొచ్చంగా మాటాడ్డం, సొచ్చంగా బతకడం మన తరఁవా !

ఆల్ల బాస ఆల్ల బొడ్డు కాడినుండి వొస్తాది. మన్దో ?  బుర్ర నోంచి వోస్తాది. అదీ తేడా.


26, జులై 2013, శుక్రవారం

తెలుగు పద్యం చిరంజీవికవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అంటూ లోగడ ఓ బ్లాగు టపా రాసేను. దానిని  ఇక్కడ నొక్కి చదవొచ్చును. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ పద్యం మీద ఓ రెండు పద్యాలు చూడండి ...

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?

పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?

పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !

పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !

ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?


( కడిమెళ్ళ వర ప్రసాద్ )

పద్యం మీద మరో పద్యం చూడండి ...

పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.

( వద్దిపర్తి పద్మాకర్ )

                                              తెలుగు పద్యం చిరంజీవి..


18, మార్చి 2013, సోమవారం

తేనె లొలికే తెలుగు పద్యం ...

ఆంధ్ర భూమి సచిత్ర మాస పత్రిక, ఫిబ్రవరి నెలలో తేనె లొలికే తెలుగు పద్యం శీర్షికన ప్రచురణ.


17, జూన్ 2012, ఆదివారం

కొడితే కొట్టాలిరా ...!
నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 - 12 -2011 దీ సంచికలో ప్రచురణ.

14, జూన్ 2012, గురువారం

బాల్య చేష్టా విలసితమ్ !
( నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 4 - 1 -2012 దీ సంచికలో ప్రచురణ )
11, జూన్ 2012, సోమవారం

ఎవడు బతికేడు మూడు యాభైలు ...


నవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 14 -3 -2012 దీ సంచికలో ప్రచురణ.


5, జూన్ 2012, మంగళవారం

మంచి పద్యాలు మరోసారి ....కాటూరి వేంకటేశ్వర రావు గారి పౌలస్త్య హృదయం  చక్కని ఖండ కావ్యం దాని పూర్తి పాఠం ఇక్కడ ఉంచుతున్నాను.
లోగడ ఈ పుస్తకం మీద ఓ టపా రాసేను. అందులో పుస్తక సారాంశాన్ని వచనంలో రాస్తూ, అక్క డక్కడ మాత్రమే కొన్ని పద్యాలను ఉదాహరించడం జరిగింది. ఓ మిత్రుడు ఇటీవల ఆ టపా  ( ఆ టపా చూడాలంటే, ఇక్కడ నొక్కండి ) చదివి మొత్తం పద్యాలు పెడితే బావుండును కదా అన్నాడు.  మంచి పద్యాలు నలుగురితో పంచు కోవడం కన్నా వేరే ఆనందం ఏముంటుంది కనుక ?

అందుకే ఆ కావ్యఖండికను ఇక్కడ ఉంచుతున్నాను. చదివి ఆనందించండి ...


30, మే 2012, బుధవారం

ముచ్చట పడి కొనుక్కొన్న ముక్కు పద్యం !

(  నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికలో తే23-11-2011 దీ సంచికలో ప్రచురణ. )

8, మే 2012, మంగళవారం

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కమనీయం బ్లాగరు కోరిన కమనీయ పద్యంకమనీయం బ్లాగరు డా.ముద్దు వెంకట రమణారావు గారు నా అర్ధరాత్రి వరకూ అరవ చాకిరీ టపా చూసి, ( ఆటపా ఇక్కడ చూడవచ్చును) శ్రీకృష్ణ దేవరాయల వారి ఆముక్త మాల్యదలో మరో రెండు చక్కని పద్యాల గురించి ప్రస్తావించారు. వాటిలో ఒక దానిని ఇక్కడ పెడుతున్నాను. మరొకటి మరోసారి పెడతాను.
ఇది తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 31-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది.

కమనీయం బ్లాగు కోసం ఆ లింక్ ఇక్కడచూడవచ్చును.


అర్ధ రాత్రి వరకూ అరవ చాకిరీ ...

నవ్య వార పత్రికలో తే 12-10-2011దీ సంచికలో ప్రచురణ.


3, ఫిబ్రవరి 2012, శుక్రవారం