17, జనవరి 2010, ఆదివారం

గంజాయి మీద పద్యం ...


కాశీ కృష్ణమాచార్యులు గంజాయి మీద చెప్పిన సీస పద్యం ...

తన్నుఁబట్టిన వారిఁదాఁబట్టి నవ్వించు
పచ్చి
బోగము లంజ పాడు గంజ
తనుఁద్రావు వారి నందరి నటేశులఁజేసి
యాడింపఁగల
లంజ పాడు గంజ
తుది మొదల్లేని యున్మదపు పల్కుల పంట
పండ
బారిన గింజ సాడు గంజ
పలు తావులకుఁబారు బైరాగులను మంద
పసుల గట్టెడు గుంజ పాడు గంజ

త్రావు వారికి గుడ గుడ ధ్వనులఁదనదు
జాడ సూచింప గల రుంజ పాడు గంజ
తప్పద్రావిన వారల తలల మిత్తి
పాదు కొల్పిన కుడియంజ పాడు గంజ !!

గంజాయి ప్రభావం ఎలాంటిదో చూడండి ...అది సేవిస్తే ఒకటే నవ్వడం ! నవ్వే నవ్వు ! పిచ్చి నవ్వు !!
ఇక వారి తైతక్కలకి అంతే ఉండదు.
పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటారు.
బైరాగులయితే, ఒక చోట చేరి గంజాయి దమ్ము సేవిస్తూ గడుపుతూ ఉంటారు. గుడ గుడ ధ్వనులతో తనని పట్టిచ్చేపాడు గంజాయి సేవించడం దేనికి ? ప్రాణం మీదకి తెచ్చు కోవడం దేనికి ?!

3 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

చక్కని సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు, చాటువులు అందించి పాఠకులకు హృదయానందం కలిగిస్తున్నారు. ధన్యవాదములు.

ప్రేరణ... చెప్పారు...

చాలా బాగుంది.

సృజన చెప్పారు...

ఏంలేదండి....ఏదో అనుభవించి తెలుసుకోవాలనేమో!

కామెంట్‌ను పోస్ట్ చేయండి