6, జనవరి 2010, బుధవారం
మా చదువుల తల్లి ...
విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన సత్రం. ఇక్కడ అన్న ప్రసాదాన్ని తిని చదువుకున్నాను.
విజయ నగరం . ప్రభుత్వ మహా రాజా వారి ప్రాచ్య భాషా కళాశాల. ఇక్కడే
నా భాషా ప్రవీణ చదువు అక్కడ 1969 - 1972 వరకూ జరిగింది.
శ్రీ మానాప్రగడ శేష సాయి గారు కళాశాల అధ్యక్షులు.
గోపాల రావు గారు, గోవిందాచార్యులు గారు, కస్తూరి గారు, సాంబ శివ రావు గారు, భాష్యకారాచార్యులు గారు, బుద్ధరాజు రామ రాజు గారు, శఠకోపాచార్యులు గారు , సుబ్బమ్మ గారు, కల్యాణి గారు, రంగా చారి గారు, రాష్ర్టపతి అవార్డు గ్రహీత పేరి సూర్య నారాయణ గారు... మా గురు దేవులు ...
ఇక మా మిత్రులు ... స్వర్గీయ దువ్వూరి పేరయ్య పోమయాజులు, మంగి పూడి వెంకట రమణ మూర్తి, (హరి కథకులు) పి.వి.బి. శ్రీరామ మూర్తి ( కథా రచయిత) చింతా రామక్రిష్ణ, (కవి), బగ్గాం రామ జోగారావు (నటులు), బుడితి బలరామునాయుడు (సీర పాణి - డమరు ధ్వని కావ్య రచయిత)
కె.యన్.వై.పతంజలి ( ప్రముఖ హాస్య వ్యంగ్య రచయిత, పాత్రికేయులు) రాజా వారి కళాశాల విద్యార్ధి.
1 కామెంట్:
అలనాటి తీపి గురుతులు
కలబోసిన చిత్రములను కనుగొంటి.ననా
విల భావ గరిమఁ గొలువై
నిలిచిరి మది మన గురువులు.నిర్మల మూర్తీ!
గోపాలరావు గారిని
గోపాలాచార్యులనుట గుర్తింపఁ దగున్.
గోపాలురె యాచార్యుల
శ్రీ పథమున కనెద మిపుడు.చెదరక నిలిచెన్.
భక్తి భావము నీలోన ప్రబలుచుండ
రావు నాచార్యులంటివి రమ్య మూర్తి.
యుక్తి యుక్తము నీ మాట. శక్తి యుతము.
ధన్య వాదము తెలిపెద దార్శనికుడ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి