6, జనవరి 2010, బుధవారం
లెక్క తేలడం లేదు !
పయస్వినీనాం ధేనూనాం
బ్రాహ్మణ: ప్రాప్య వింశతిమ్
తాభ్యోష్టాదశ విక్రీయ
గృహేత్వైకాం గృహం గత:
ఈ శ్లోకంలో కవి - ఒక బ్రాహ్మణుడు ఇరవై ఆవులను దానంగా తీసుకుని, అందులో పద్ధెనిమిది ఆవులను విపణి వీధిలోతన జీవిక కోసం అమ్మేసాడని చెబుతున్నాడు. పోనీ లెండి అన్ని ఆవులని అతడేం చేసుకుంటాడు చెప్పండి ? సరే, అలా ఆవులని విక్రయించి, యింటికి కేవలం ఒక్క ఆవుతో చేరాడుట! లెక్క ఎక్కడో తప్పలేదూ? 20 ఆవులని దానంగాతీసుకుని, 18 ఆవులని అమ్మేస్తే యింటికి రెండు (2) ఆవులతో తిరిగి రావాలి కదూ.?
మరేం లేదు ...
ఆ బాపడు దానం పట్టిన ఆవులు 20 కాదండీ ... 19 (పందొమ్మిది మాత్రమే) !
శ్లోకంలో ధేనూనామ్ అనే పదాన్ని ... ధేను: , ఊనామ్ అని చదువుకుంటే సరి ! అంటే, ఒకటి తక్కువ ఇరవై అని అర్ధం ! ఊనామ్ అంటే తక్కువ అని అర్ధం కదా?
ఇప్పుడు లెక్క సరి పోయిందోచ్ !
లేబుళ్లు:
మీ కోసం ఓ చమత్కార శ్లోకం ...
1 కామెంట్:
ఇన్నాళ్ళూ మీ బ్లాగును చూడలేదండీ. చక్కని పద్యాన్ని వివరించారు. మీరు ఇంకా ఇలాంటి టపలు అనేకం వ్రాయాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి