10, మార్చి 2010, బుధవారం

ఇచ్చుటలో ఉన్న హాయీ ....

ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:

అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :

మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !

ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?

ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...

ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ

బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !

వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన

పద్య రత్నాలలో యిదొకటి !

2 కామెంట్‌లు:

Wit Real చెప్పారు...

చాలా మంచి పద్యాలు!

ఈ పద్యం, భాగవతంలోనిది.
ఇది, బలి చక్రవర్తి శుక్రాచార్యులతో అన్న సందర్భంలోనిది.

పంతుల జోగారావు చెప్పారు...

Wit Real గారూ, నిజమే, ఈ పద్యం భాగవతంలో బలి చక్రవర్తి శుక్రాచార్యునితో అన్న సందర్భం లోనిదే.
భాషా ప్రవీణ చదువుకుని, సీనియర్ తెలుగు పండితునిగా 36 సంవత్సరాలు ఉద్యోగం చేసిన నేను తెలిసి కూడ పొరపాటు పడ్డాను. ఇది తెలియక చేసింది కాదు.కొంత అజాగ్రత్త వలన జరిగింది. ఏమయినా, ఇప్పుడు సరి చేసాను. మీకు నా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి