16, జులై 2010, శుక్రవారం

తిరగ బడు ! ( విప్లవం కాదు).

ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.

2 కామెంట్‌లు:

sudharani65 చెప్పారు...

శ్లోకంలో మంచి చమత్కారం ఉంది. మీ వివరణ బాగుంది.

కృష్ణశ్రీ చెప్పారు...

జోగారావుగారూ!

విపరీతాన్ని చమత్కారం గా చెప్పిన ఈ శ్లోకం నేనూ యెప్పుడో చదివినా, మీరు సందర్భ శుధ్ధిగా ప్రచురిస్తున్నారు.

చాలా సంతోషం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి