8, ఆగస్టు 2010, ఆదివారం

బావా బావా పన్నీరు ! బావని పట్టుకు తన్నేరు !!


ఓ మరదలు పిల్ల చదువు కున్నదే కాక, కవిత్వం కూడా చెబుతుంది. బావ గారు సాహిత్య గంధ శూన్యులు. నామీద కవిత్వం చెప్పవూ ? అని మరదలుని బ్రతిమలాడేడు. బావ గారి ముచ్చట తీర్చడం కోసం ఆ కొంటె పిల్ల ఏం చెప్పిందంటే ...

అందమున చూడ రాము బంటైన వాడు
నాగరికతను జము వాహనమునకీడు
శుచికి హేమాక్షుఁజంపిన శూరు జోదు
వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

మా బావ అందంలో రామ బంటుతొ సమానం. ( కోతి)
నాగరికతలో యముని వాహనంతో సమానం ( దున్న పోతు)
శుభ్రతలో హిరణ్యాక్షుని చంపిన వాడితో సమానం ( వరాహావతారం. పంది)

మా బావలాంటి వాడు లోకం లోనే లేడు !
మరదలు చెప్పిన పద్యం విని ఆ బావ గారు మురిసి పోయి ఉంటారు ...

3 కామెంట్‌లు:

jaggampeta చెప్పారు...

maradalu ante alaa undali

కథా మంజరి చెప్పారు...

ధన్యవాదాలండీ

పరుచూరి వంశీ కృష్ణ . చెప్పారు...

భలే ఉందండీ పద్యం ...కాస్త మరదలి మీద రాసిన పద్యం ఉంటె కొంచెం చూడండి ..నేను వాడుకుంటాను :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి