28, ఆగస్టు 2013, బుధవారం

చొ ... చొ ... చ్చొ ...చ్చొ చ్చొ .. అను .. ఒక రాంగ్ షో కథ !


‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.

4 కామెంట్‌లు:

www.apuroopam.blogspot.com చెప్పారు...

సరదాగా ఉంది కానీండి, కవిహృదయం అర్థం కాలేదు.కాస్త విడమరచి చెబుదురూ.

అజ్ఞాత చెప్పారు...

తీసుకున్న నిర్ణయం రాగ్ షో లాటిదే! తెలంగాణా కాని రాయల తెలంగాణా కాని అని కవి హృదయమనుకుంటా. తెలంగాణా ఇవ్వడం లో తప్పులేదు కాని ఇచ్చిన విధానమే బాగోలేదు.

కథా మంజరి చెప్పారు...

కష్టే ఫలే గారూ, గోపాల కృష్ణారావుగారూ ధన్యవాదాలండీ ...
ఇక, కవిహృదయమంటారా?

???????? !!!!!!!!!?????

అజ్ఞాత చెప్పారు...

inka telangaana ela ivvali......hyderabad mottam seemandra ku rasi telangaana ivvamantara.....vizag vijayawada tirupati asalu devolop leavantara.......ila ivvadam bagaleadu ani andaru cheppevalle....ela ivvalo suchinchandi...congress vallaku ea nirnayam theaskunna ok anna mee mee seemandhra rajakeeeya nayakula pani pattandi first.... aa tharuvatha vigrahalu pagala kottandi.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి