28, ఏప్రిల్ 2015, మంగళవారం

డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు ...


డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేరు !

విజ నగరానికి చెందిన ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకుడు, వక్త, బహు గ్రంధ కర్త డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి ఇక లేదు.

బహు ముఖీన మయిన వారి ప్రతిభ సాహితీ లోకం ఎరిగినదే. కన్యా శుల్కం - 19 వ శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలు  - తులనాత్మక పరిశీలన అనే వీరి బృహత్ గ్రంథం  వీరి ప్రతిభకు గీటురాయి. చర్వణ సాహిత్య సమాలోచన, చా.సో స్ఫూర్తి మొదలయిన సాహిత్య విమర్శనా గ్రంధాలు దాదాపు 25కి పైగా రచించారు.

విజయనగరం పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (యూఏ నరసింహమూర్తి)కి ప్రతిష్ఠాత్మకమైన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జాతీయ ఫెలోషిప్‌ లభించింది. ఈ ఫెలోషిప్‌ను అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖనుంచి పొందారు. ఫెలోషిప్‌కింద నెలకు రూ. 50 వేలు ఇస్తారు. ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల రచయితలకు మాత్రమే ఈ అత్యున్నత ఫెలోషిప్‌ లభిస్తుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆసియా ఖండపు ఇతిహాసాలు- సాంస్కృతిక అంశాలపై తులనాత్మక పరిశోధన చేసి పుస్తకంగా సమర్పించాల్సి ఉంటుంది.

నవ్య వార పత్రికలో ‘‘ మా గురువులు బోధిస్తే  గోడలకు కూడా పాఠాలు వస్తాయి !’’ అనే శీర్షికతో నేను చేసిన  ఇంటర్వ్యూ ఈ లింక్ లో లో చూడ వచ్చును.  
http://kathamanjari.blogspot.in/2013/03/blog-post_15.html
మేం యూైఏ ఎన్ గా పిలుచుకునే ఈ సాహితీ స్రష్ఠ మరి లేరనే వార్త తలచు కుంటేనే గుండె బరువెక్కి పోతోంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం .

1 కామెంట్‌:

జిడుగు రవీంద్రనాథ్ చెప్పారు...

నరసింహమూర్తి గారి గురించి వెతికితే కనపడే వ్యాసాలు తక్కువ. వారు ఎన్నో వేదికల మీద నుంచి ఉపన్యసించారు అవి యూట్యూబ్ లో ఎక్కడ కూడా కనపడటం లేదు. అటువంటి అపార మేధావి మాటలను స్వయంగా వినాలని , దాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాలని తెలుగువారికి పట్టకపోవడం దురదృష్టకరం

కామెంట్‌ను పోస్ట్ చేయండి