12, డిసెంబర్ 2009, శనివారం

అయ్యో, రామ !!



నీయాశా, అడియాశా ....
రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ
యిత్థం విచింతయతి కోన గతే ద్విరేఫే
హా ! హంత హంత ! నళినీం గజవుజ్జహార !


మిత్రులారా ! ఈ శ్లోకం ఎంత అందంగా ఉందో గమనించండి ...

ఓ తుమ్మెద తామర పువ్వులో దూరి మకరందం గ్రోలుతోంది. ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రయింది. పద్మం ముడుచుకు పోయింది ! తుమ్మెద అందులో బందీ అయి పోయింది... సరేలే, ఎలాగూ తెల్లారుతుంది, సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. అప్పుడు బయట పడదాం అనుకుంది తుమ్మెద.
అంత లోనే వో మదించిన ఏనుగు వచ్చి, ఆ సరోవరంలో దిగి, తామరలనన్నింటినీ పెకిలించి వేసిందిట ! మిగతా పువ్వులతో పాటూ తుమ్మెద బందీగా ఉన్న పద్మాన్ని కూడా పెకిలించి వేసింది.
బయట పడదాం అనుకున్న మన తుమ్మెద ఆశ ఎలా అడియాస అయిందో చూసారు కదూ ?
మంద భాగ్యుల కథల ముగింపు యిలాగే ఉంటుందేమో, కదూ !!

ఇది చదివేక, తెలుగులో ఓ మంద భాగ్యుని గురించిన పద్యం ఒకటి గుర్తుకొస్తోంది కదూ !!!
అదేమిటో గుర్తుకు తెచ్చుకుని రాయండేం?

చిన్న క్లూ యిస్తాను ... పద్యం చివర్లో ...పోవుంగదా యాపదల్ ! అని ఉంటుంది
మిత్రుడు చింతా రామ క్రిష్ణారావు చూపిన మార్గంలో నాకు తెలిసిన కొన్ని చమత్కార శ్లోకాలూ , పద్యాలూ సరదాగా మీతో ఇక మీద పంచుకోవాలనుంది. ... మీరు సరే నంటే !

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

ప్రియ మిత్రులు జోగారావుగారికి కృతజ్ఞతలు.
చక్కని శ్లోకాన్ని చదువరులకందించారు. చాలా సంతోషం.
మీరుంచిన శ్లోకానికి నా అనువాదం గమనించండి.

రాతిరి ఆయెను, చిక్కితి,
పూతలుపులు మూసుకొనగ.పూజ్యుడు సూర్యుం
డేతరి వచ్చెడు నని, యలి,
వేతుననెను. రాత్రి పీకివేసెను గజమున్.

రాతిరి గడచును, ఉదయము
భాతిని రవి యొసగు, పూవు భాసిలు. దనుకన్
వేతునని యుండె తుమ్మెద.
రాతిరె దంతి పెకలింప, ప్రాణము వీడెన్.

ధర ఖర్వాటుడొకండు పద్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తింపఁజేసారు.

ఇలాగే నిత్యం చక్కని అంశాల్ని పాఠక లోకానికందిస్తారని ఆశిస్తున్నాను.
చింతా రామ కృష్ణా రావు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి