15, డిసెంబర్ 2009, మంగళవారం

కొంటె బొమ్మల బాపు




బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !!


తెలుగు రచయితలలో చాలా మందికి తమ కథలు పత్రికలలో ప్రచురించ బడేటప్పుడు దానికి శ్రీ బాపు గారు బొమ్మ వేస్తే బావుణ్ణని మహా ఉబలాటంగా ఉంటుంది.
నాకూ అలాంటి ఉబలాటమే. శ్రీరాముని దయ చేతను ఈ క్రింది కథల విషయంలో నా కోరిక తీరింది.

1. గోవు మా లచ్చిమికి కోటి దండాలు ... ఆంధ్ర జ్యోతి వార పత్రిక
2. అనాధలు కావలెను ... స్వాతి వార పత్రిక
3. గెలుపు ... ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలనూపు
ఓ కూనలమ్మా !
అన్న ఆరుద్ర గారి మాటలు తలుచుకుంటూ, మీకివే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

బాపూ బొమ్మలు వేసెనంట్రి. తమ యా ప్రఖ్యాతమౌ సత్కథల్
దీపించే వర పత్రికాళి తెలుపన్ దీప్యంబయెన్.కాని మా
కేపేజీ గన లభ్యమౌనొ? కనగా నేవారమందుండెనో?
కాపీలెట్లు కనంగ మాకు నగునో కాస్తంత సూచింపరే?

Valluri Sudhakar చెప్పారు...

ఆంధ్రుల పేటేంటు బాపుబొమ్మా. ఆ గీతలావణ్యల రూపకర్త బాపుగారికి జన్మదిన అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి