28, డిసెంబర్ 2009, సోమవారం

పారవశ్యం



ఒక మంచి, అందమైన శ్లోకం చూదాం.ప్రణయ పారవశ్యాన్ని ఎంత మనోహరంగా కవి వర్ణించాడో చూడండి.
రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా
ధా
మం మా కలయతి దధి రిక్త భాండే
తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి:
దేవో అపి దోహన ధియా
వృషభం నిరుంధన్







ఇక శ్లోకార్ధం ... నల్లనయ్య మీద లగ్న చిత్తయై రాధ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోందిట!
ఆమె వక్షోజ విన్యాసాలు చూస్తూ మైమరిచి పోయిన గోపాలుడు పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధాలువేస్తున్నాడుట !!

ప్రేమ పారవశ్యం అంటే ఇదే కదా?

2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా
మంధాన మా కలయతి దధి రిక్త భాండే
తస్యా: స్తనస్తబక చంచల లోల ద్రుష్టి:
దేవో అపి దోహన ధియా వ్రుషభం నిరుంధన్

అంకితమైన చిత్తమున నచ్యుతు గాంచుచు రిత్త కుండలో
నుంకెడు కవ్వముం జిలుకు నొప్పుగ రాధ.తదంగ శొభలన్
జంకును వేడి చూచు హరి చక్కగ బందము నెద్దు కాళ్ళకున్
గొంకక వైచె గోవనుచు,గోముగ చూచుచు రాధ వంకనే.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

జంకును వేడి కాదు జంకును వీడి.

అంకితమైన చిత్తమున నచ్యుతు గాంచుచు రిత్త కుండలో
నుంకెడు కవ్వముం జిలుకు నొప్పుగ రాధ.తదంగ శొభలన్
జంకును వీడి చూచు హరి చక్కగ బందము నెద్దు కాళ్ళకున్
గొంకక వైచె గోవనుచు,గోముగ చూచుచు రాధ వంకనే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి