27, డిసెంబర్ 2009, ఆదివారం

రామ ! రామ !!



రాముడు హనుమంతుని చేత హత మైతే, సీత సంతోషించిందిట !
రాక్షసులు దు:ఖించారుట !! హవ్వ !! ఇదేం చోద్యం అనుకుంటున్నారా? శ్లోకం చూడండి మరి ...

హతో హనుమతో రామ
సీతా సా హర్షనిర్భరా
రుదంతి రాక్షసాస్సర్వే
హా హా రామ హతోహత:

హనుమతే , ఆరామ అని విరిచి చదువుకుంటే ఏ గొడవా లేదు ! లంకా పట్టణంలో హనుమచే నాశనమైన ఆరామాన్ని (వనాన్ని) చూసి సీత ఆనందించడంలోనూ, రక్కసులు విచారించడంలోనూ అసజం ఏమీ లేదు కదా?

మన పూర్వ కవులు యిలాంటి చమత్కార రచనలు చాలా చేసారు.

1 కామెంట్‌:

Sandeep చెప్పారు...

"హనుమతారామ" నా "హనుమతోరామ" నా? మీరన్న హనుమతే + ఆరామ సంధి కుదరట్లేదు కదా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి