మన అపార పారావార తుల్యమైన సాహితీ భాండారంలో ఎన్ని అనర్ఘరత్నాలు ఉన్నాయో నేనివాళ కొత్తగా వివరించ నక్కర లేదు...నేనెరిగినవాటిని మిత్రులతో పంచుకునే ప్రయత్నంలో ఈ రోజు మీకోసం ఓఅందమయిన పద్యం....
హరిని హరి బట్టి మ్రింగెను
హరి దౌడుం జూచి బెదరి హరి చెట్టెక్కెన్
హరి పలుకులు హరి మెచ్చెను
హరి వాహన మగుపడంగ హరి గర్జించెన్ !
కప్పను పట్టుకుని పాము మ్రింగి వేసిందిట!
గుర్రం పరిగెత్తడం చూసి, బెదిరి పోయి , కోతి చెట్టెక్కిందిట!
చిలుక పలుకులు విని శ్రీ హరి మెచ్చు కున్నాడుట!
యముని వాహనం దున్న పోతుని చూసి సింహం గర్జించిందిట!
నానార్ధ పద నిఘంటువు చూసి, హరికి ఎన్ని అర్ధాలున్నాయో ఓ సారిచూడండి ...
ఆ నానార్ధాల వల్లనే మీది పద్యంలో హరిని హరి తినేసాడనీ, హరిని చూసిహరి పరిగెత్తి పారి పోయేడనీ, హరి మాటలను హరే మెచ్చు కున్నాడనీ, హరి వాహనానాన్ని చూసి హరి గర్జించాడనీ బయటకి కనిపించేఅసంగతార్ధం తొలిగి పోయి వాస్తవార్ధం గోచరిస్తుంది ...
బాగుంది కదూ ?!
1 కామెంట్:
పద్యం బాగుందండీ.
మీరు యూనీకోడ్ వాడుతున్నట్లయితే R టైప్ చేసి u టైప్ చెయ్యండి. ఋ ఒత్తు వస్తుంది.
ఉదాహరణకి కృషి రాయాలంటే
యూనీకోడ్ లో ... kRuShi ( కృషి )వస్తుంది.
ఏ అక్షరమైనా సరే కొట్టి పక్కన capital R పక్కల u type చేస్తే ఋత్వం వస్తుంది.
ఒక చిన్నపాటి రచయిత్రిగా మీ పరిచయం కలిగినందుకు సంతోషంగా ఉంది.
నేను కూడా కవితలు, రెక్కలు,అప్పుడప్పుడు కథలు రాస్తుంటాను.
అభినందనలతో
http://telugukala.blogspot.com
తెలుగుకళ-పద్మకళ
కామెంట్‌ను పోస్ట్ చేయండి