23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మసి బొగ్గులు


దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

ఈ చిన్న శ్లోకంలో ఎంత గొప్ప విషయం కవి చెప్పాడో చూడండి ...

చెడ్డ వాళ్ళు బొగ్గుల లాంటి వారుట ! వాళ్ళు శత్రుత్వంలో ( వేడిగా ఉన్నప్పుడు) మన చేతులు కాలుస్తారుట.

స్నేహంలో ఉన్నప్పుడు ( అంటే చల్లగా ఉన్నప్పుడు) మన చేతులని మసి చేస్తారుట !

మైత్రిలోనూ, వైరం లోనూ వాళ్ళు మనతో ఒక్కలాగే ప్రవర్తిస్తారన్న మాట.

అంచేత చెడ్డ వారితో స్నేహం వద్దు సుమా.

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

దుర్జనుని మైత్రి వైరము దుష్టములగు.
బుగ్గు పోలిక దుష్టులు. ఎగ్గు సేయు.
బొగ్గు నిప్పున్న కాల్చును. పూర్తిగాను
ఆరియున్నను మసిచేయు నరయ దగును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి