5, మే 2010, బుధవారం

చిత్రం ! భళారే విచిత్రం !!










పద్యం ఇదీ:

ఎన్నడు చూడబోయినను యించుక మాయని హాస రేఖ నీ
కన్నుల కానుపించునది కమ్మగ, యిమ్ముగ వెన్నెలంబలెన్ !
మిన్నగు నీదు వర్తనము మెచ్చఁగ హెచ్చగు శక్తి కావలెన్
మన్సన చేసి , నన్నెపుడు మానసమందిడు రామ కృష్ణుఁడా !


ఈ ఫొటో దాదాపు నలభై ఏళ్ళ క్రిందటిది. విజయనగరం వీనస్ ఫోటో స్టూడియోలో మేం సరదాగా తీయించుకున్నది. ( తే 21-11-1971 దీన) అంటే, అప్పుడు మేం విజయనగరం మహా రాజా
సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ మూడో సంవత్సరం చదువుతున్నాం.

ఫొటోలో ఎడమ చేతి వేపు ఉన్నది నేను .

కుడి చేతి వేపు ఉన్నది ఎవరో తెలుసా?

ఆంధ్రామృతం బ్లాగు ద్వారా అందరికీ చక్కని పద్య రచనలతో చిర పరిచితుడైన శ్రీ చింతా రామ కృష్ణా రావు.

క్రింద ఉన్న పద్యం అతని గురించి 21-11-1971 దీన నేను రాసిన పద్యం. నా దగ్గర ఈ ఫొటో లేదు, నేను రాసిన ఆ పద్యమూ లేదు. కాని సహృదయుడైన నా మిత్రుడు రామకృష్ణా రావు వీటిని ఇంత కాలం తన దగ్గర భద్ర పరచి, ఇటీవలే నాకు పంపించేడు.

ఆంధ్రామృతం బ్లాగుని అభిమానించే బ్లాగర్లకందరికీ ఈ ఫొటో సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను...

3 కామెంట్‌లు:

మిరియప్పొడి చెప్పారు...

బలెగుంధె పాత ఫొతొ

కంది శంకరయ్య చెప్పారు...

ఆంధ్రామృతం బ్లాగుని అభిమానించే బ్లాగర్లకందరికీ ఈ ఫొటో సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను...
అప్పటి ఫోటో, అప్పటి మీ పద్యం నిజంగానే సంతోషాన్ని కలిగించింది.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

అలనాటి అనుబంధాన్ని
తిలకించి పులకించాను.
మధుర స్మృతు లెదలోతుల్లో
పదిలమ్ముగ వెలువడుతున్నై.
కనరానిది గడిచిన కాలం.
మనసైనది మరువని భావం.
అలనాటిది అద్భుతముగ నే
డిలపై కన గలిగితినికదా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి