దాదాపు మూడు నెలల క్రిందట రావు బాల సరస్వతి పాడిన ఒక పాట గురించి ఎవరికయినా తెలుస్తే చెప్ప గలరా ? అని బ్లాగు మిత్రులకు మెయిల్ చేసి, అడిగాను.
వెంటనే వలబోజు జ్యోతి, ఇనగంటి రవిచంద్ర, పరుచూరి శ్రీనివాస్, సౌమ్య, ఆది లక్ష్మి, స్వరం, తాడే పల్లి బాల సుబ్రహ్మణ్యం గారలు స్పందించారు.
జ్యోతి గారు పాట సాహిత్యాన్ని అందించగా, రవి చంద్ర, పరుచూరి గారలు ఆడియో లింక్ కూడా దయతో అందించి నాకు చాలా సంతోషం కలిగించారు.
శ్రీ పంతుల గోపాల కృష్ణా రావు గారు కూడా ఈ సాహిత్యం నాకు లభించేలా సహకరించారు.
వీరందరికీ నా హృదయ పూర్వకమయిన ధన్యవాదాలు తెల్పు కుంటున్నాను.
ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.
మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.
అందులో మా అమ్మ తరచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది.
రిటైరయ్యేక, అరవైయ్యవ యేట కంప్యూటరు నేర్చుకుని ... నెట్లో బాల సరస్వతి గురించి వెతికాను. చాలా ఉంది. కాని, నాకు కావలసిన ఈ పాట సాహిత్యం మాత్రం దొరక లేదు. ( లేదా, నేను ఓపికగా వెతక లేక పోయానో, యేమో )
అప్పుడు నాకీ పాట పూర్తి పాఠం కావాలని ఒక మెయిలు పెడితే, దయతో , మీద పేర్కొన్న వారు వెంటనే స్పందించారు.
మరో మారు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అరవయ్యవ యేట అందిపుచ్చుకున్న ఈ ఆధునిక సాంకేతిక విఙ్ఞాన ఫలితాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాను.
ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.
దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.
అందుకే, ఇదంతా టపాగా వ్రాయాలా , వద్దా అని, మూడు నాలుగు నెలలుగా తటపటాయించి, ఇక ఈ వేళ నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.
సాహిత్యం ఇది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II
చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
చుక్కల్ల రేడమ్మా ... సఖియా
మరుని శరముల చేత మనసు నిలువక నేను
మల్లె మొల్ల మొగలి మాలతి మందార
మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)
ఆడియో వినండి మరి ....
నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!
* * * *
అమ్మ పోయేక, వచ్చీ రాని రాతలతో నా పందొమ్మిదవ ఏట ఒక నవలిక రాసి పత్రికలో ప్రచురించాను. వీలుంటే, అది కూడా చూడండి. ఇక్కడ నొక్కండి.
మా ఉరవ కొండ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా.
స్వస్తి.
7 కామెంట్‌లు:
డా. ముద్దు వెంకట రమణా రావు జీ మెయిల్ లో ఈ టపా గురించి ఇలా వ్రాసారు:
Dear Jogarao, you have struck a poignant note in my heart.Itoo like that song very much.Chalam wrote about it. Parvathi akka had a sweet voice.We had that HMV GRAMOPHONE Kapilavayi,.Rajeswararao,.Balasaraswathi ,and old film songs were played.Once we travelled with BALASARASWATHI Ifeel very sad when I remember Parvathi. ramanarao.
Posted by ramaneeyam at 8:40 AM
అమ్మ జ్ఞాపకాలు అందరికీ మధురమైనవే. అవి ఆపాత మధురాలయిన అలనాటి పాటలతో జోడించినవయితే మరీ మరీ మధురం.అద్భుత మయిన అలనాటి పాటతో అమ్మని గుర్తు చేసావు. పాటలో మిస్ అయిన భాగం ఇది;
మాలికను వాని మెడలోనవైచినానే
మధురామూర్తి మేల్కొని మెందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే చెలియ
మది వెన్నెల చిలికెనే సఖియా
మెరపూలోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
అమ్మతో పాటు ఈ పాటా, రాజేశ్వర రావు గారి తుమ్మెదా ఒక,ారి, కపిలవాయి వారి బాలరసాలసాల పద్యం దాదాపు అరవై ఏళ్ళ తర్వాత ఇవాళ కూడా నన్ను మురిపిస్తాయి. ఇదేకాక నీవు అందిస్తున్న రసగుళికల నన్నీ తనివి తిరా ఆస్వాదిస్తున్న యీ అన్నయ్య అశీస్సులు నువ్వింకా ఎన్నెన్నో మరెన్నో ఇలాటివి అందించి అందరినీ అలరిస్తావవని నమ్ముతున్నాను.
-అమ్మ గుర్తుగా ఈ పద్యం--
అమ్మను మరువగ జాలను
కమ్మని ఆవిడ కబురులు కడుపును నింపున్
చెమ్మగు నామది వందుచు
ఎ మ్మెయి నీ బాధ పోవు నెరుగను తండ్రీ
----పంతుల గోపాల కృష్ణ---
amma gurinchi emani cheppanu...nenu appatiki chinnavadanu...kaani aa rupam aa gontu inkaa gurutu lone unnai. amma ane sabdam chalu manasu pulakinchi potundi evarikaina..amma gurinchi maro kotta vishayam ivala telisindi..maa amma kokila kudanata..ohh...enta bagundi..thanks a lot...
పొగ బండి కథల ఫేమ్ ఓలేటి శ్రీనివాస రావు భాను జీ మెయిల్ లో ఈ టపా గురించి ఇలా వ్రాసారు:
Nijamgaa yenta goppagaa raasaavanna. Chaduvutunnata seypu adeymito
dukham munchukocheysindi. Neellu aagaleydu. Mee amma Parvatamma to
paatu maa amma applanarasamma gurtukochindi. Maa amma ki jwaram
vacchinappudalla Ramaayanam dwipada paadeyseydi. Mannanna garaitey
Gajendra moksham padyalu paadeyseyvaru. Vudayanney gundey gudupatlu
kadilipoyaayi..Nijam..Saraswati todu..
అన్నయ్యా,
అమ్మకి స౦బ౦ధి౦చి ఓ మధురమైన ఙాపకాన్ని అ౦ది౦చావు.
ఇ౦తవరకు అమ్మ ఫొటొతో నే ప౦చుకున్నవే వు౦డేవి.
తొలిసారి, మని౦టి పెద్ద గది ము౦దరి వర౦డాలో గోడకి వెలిసిన ఫోటోలో
అమ్మని చూసాను. అప్పటికి నాకు పన్నె౦డేళ్ళు౦టాయేమో.
నా ఆన౦దాలు, నా ఆవేశాలూ, ఆ౦దోళనలూ అన్నీ ఫోటోలో అమ్మతో
చెప్తు౦టే, తనేమో. మోనలీసా చిత్ర౦ లాగా ఏవేవో భావాలని పలికి౦చేది.
ఆ తర్వాత, కదిలే అమ్మని తెచ్చిచ్చావు, వదిన రూప౦లో.
బతుకుబ౦డి లాగుతూ ఈ మజిలీ చేరేటప్పటికి మీ అ౦దరికీ దూర౦గా
వచ్చినా, అమ్మ పెరిగిన ఉరవకొ౦డ మాకు పొరుగూరేనన్న భావనే
నాకు రీఛార్జి నిస్తో౦ది.
ఇప్పుడు అమ్మని చూస్తున్నట్టే వు౦ద౦టూ నువ్వు అ౦ది౦చిన ఈ
ఙాపకాలు, అమ్మకి నచ్చిన, అమ్మ పాడుకునే పాట నా జీవిత౦లో
మధురానుభూతిగా నిలిచిపోతు౦ది. థా౦క్యూ వెరీమచ్.
వారణాసి సరస్వతి విశాఖపట్నం నుండి మెయిల్ లో ఈ సందేశం పంపించారు.
Very well written about Parvathi athia. Though I dont remember her at all,
Amma used to tell a lot about her.
ఈ ఉరుకుల పరుగుల జీవితం లో...ఒక్కోసారి ఏమి చేయలేకపోతున్నామన్న
నిరాశ నిస్పృహ అవరిస్తున్నపుడు
మీ బ్లాగ్ ఓ సారి చూస్తె ఉతేజం కలుగుతుంది.
నిజం...ఎంతో మందికి ఎన్నో సార్లు మీ బ్లాగ్ గురించి చెప్పాను
మీ సృజనాత్మకత..మీ ఆచరణ ..మాకు ఆదర్శం ...
ఇక ఈ వయసులో కూడా అంటూ వ్యర్తమయిన మాటలు అనను.. వయసు ..మనసుకు కాదని మీరు నిరూపిస్తుంటేను
...
ముక్యంగా..ఒక శూన్యత విరక్తిని కలుగ జేస్తున్నపుడు ..
అమ్మ జ్ఞాపకాలతో గుండె తడి అయినపుడు అమ్మ చిరునవ్వు మల్లీ స్పూర్తిని కలుగ జేస్తుంది
అమ్మను దరిష్మ్పజేసిన..మీ పలుకులు ..జ్ఞాపకాలు ..ఆ పాటా.. అమ్మ చిత్రం ...గుండె చెమ్మగిల్లింది
ఇక విజయవాడ లో నెల క్రితం కొని చదివిన గుండె తడి గురించి .ప్రతిస్పందనను తెలియజేయక పోవడం కూడా..నా అలసత్వమో పనుల వత్తిడో
గతం లో చదివిన కొన్ని కథలను మల్లీ ఒక్క దగ్గర చూడడం..కొత్త కదలను కొత్తగా చదవడం సంతోషం గ అనిపించింది
అక్షరాలు మీ దృశ్యాలు....సృజన మీ ధ్యాస .సాహిత్యం.శ్వాస..చిరయువులు మీ కృతములు...
అభినందనలు కాదు..అభివాదాలు...ప్రస్తుత సంకేతీక పట్ల మీ మీ అభిరుచికి..అభినివేశానికి..ఆసక్తికి ..అంకిత భావానికి .ఆచరణకు...
.సమ్మెట ఉమాదేవి
కామెంట్‌ను పోస్ట్ చేయండి