ఒక చమత్కార శ్లోకం చూడండి ...
అంబలి ద్వేషిణం వందే
చింతకాయ శుభ ప్రదమ్
కూరగాయ కృత త్రాసం
పాలనేతి గవాం ప్రియమ్
తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసేరా ? కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?
అంబలిని ద్వేషించే వాడికి వందనమట. చింతకాయ చాలా శుభ దాయకమట. కూరగాయ భయోత్పాతకమట. ఆవు పాల నేయి ప్రియమైనదట. ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?
అం , బలి = బలిని అణచి వేసిన వాడు
చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు
కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు
పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )
వందే = నమస్కరించుచున్నాను.
ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.
8 కామెంట్‌లు:
:):)
చాలా బాగుంది.
మరిన్ని ఇలాంటి వెన్న ముద్దలు తినిపించండి.
Nice One sir.
లోతు తెలిసిన..
తెలిసి ఈదిన..
మధనమౌనది.
లోతుల్ని తాకింది..
థాంక్స్...
ఇంకేఁ..లేవా ఇలాంటివి?
మీ కిచిడి శ్లోకం చదివాను.చమత్కారం వివరిస్తె తప్ప తెలియలేదు.బాగుంది.2అతిధి సత్కారం గురించి;ఒకప్పుడు ఆర్థిక కారణాలవల్ల ఇష్టపడెవాళ్ళు కాదు. కాని ఇప్పుడు న్యూసన్సు ,అక్కరలెని లంపటం అని చికాకు పడుతున్నారు.3సీతాపతిగారి /పుష్పవేదన/బాగుంది. కరుణస్రీ పుష్పవిలాపం కి విరుద్ధంగా వున్నా లాజికల్గా వుంది .ఒకె అంసం మీద రెండు అభిప్రాయాలు వుండవచ్హును కదా.పద్యాలు మాత్రం చక్కగా వున్నాయి.అభినందనలతో ;రమణారావు..ముద్దు

కామెంట్‌ను పోస్ట్ చేయండి