ఈ నెల ( మే 2011 ) పాల పిట్ట మాస పత్రిక చదివేరా?
అందులో కంట తడి పెట్టించిన కథల నామిని శీర్షికన ఖమ్మం నుండి శ్రీధర్ రాసిన ‘‘నామిని, నెంబర్ వన్
పుడుంగి ’’ పుస్తకం మీద ఒక సమీక్షా వ్యాసం ప్రచురించారు.
నిందా స్తుతి రూపంలో వచనంలో వచ్చిన ఇంత గొప్ప సమీక్షా వ్యాసం ఇటీవల నేను చదివి ఉండ లేదు.
అమ్మీ, పెబోవతీ ... అనే సంబోధనతో మొదలై
యెట్టా యేగుతున్నావమీ, ఈ నా బట్టగానితోని, పెద్ద పుస్తకం రాసి కాపరాన్ని దేశమంతా రచ్చ రచ్చ చేసినాడు
గదమ్మీ ... అనే వాక్యాలతో నామిని కొత్త పుస్తకం ’’ నామిని, నెంబర్ వన్ పుడుంగి‘‘ మీద రాసిన నిందా రూప స్తుతి చివరి అక్షం వరకూ ఉగ్గబెట్టి చదివిస్తుంది.
పచ్చ నాకు సాక్షిగా , సినబ్బకతలు, ముని కన్నడి సేద్యం, చదువులా ? చావులా? తో పాటు నామిని రాసిన ఈ కొత్త పుస్తకం ‘‘ నామిని, నెంబర్ వన్ పుడుంగి’’ వెంటనే కొనుక్కుని చదివేలా చేస్తుంది.
పుస్తకం చదివేక, నామిని పుడుంగి అవునో కాదో తేల్చు కోవలసినది మనమే.
పాలపిట్ట మాస పత్రిక వివరాలు:
పాలపిట్ట,
ప్లాట్ నె.3, ఎంఐ.జి - 2, బ్లాక్ -6,
ఏ.పి.హెచ్.బి. , బాగ్ లింగంపల్లి,
హైదరాబాద్ - 500 044
ఫోన్: 040 - 27678430
సెల్: 9848787294
మెయిల్: palapittabooks@gmail.com
3 కామెంట్లు:
ఒకే జిల్లా వాసిగా భాష అత్యంత అపురూపంగా..చెప్పిన విధం విశేషంగా ఎంజాయ్ చేసాను ఈ నవల చదివి!!
నామిని రచనలు చిత్తూరు మాండలికంలో సహజంగా వుటాయి.కాని అసభ్యపదజాలంతోనిండి ఉంటాయి.సహజత్వం కోసం అలారాయవచ్చునా అనినా సందేహం.-రమణారావు.ముద్దు
నామిని రచనలు చిత్తూరు మాండలికంలో సహజంగా వుటాయి.కాని అసభ్యపదజాలంతోనిండి ఉంటాయి.సహజత్వం కోసం అలారాయవచ్చునా అనినా సందేహం.-రమణారావు.ముద్దు
కామెంట్‌ను పోస్ట్ చేయండి