
ఈ క్రింది చిత్రాల ఆధారంగా ఓ ఆరు పదాలకు నానార్ధాలు చెప్పండి చూద్దాం !
1. ఒక్కో పదానికీ రెండేసి నానార్ధాలు చెప్పాలి. కొండొకచో అంత కంటె ఎక్కువ పదాలు కూడా.
2. ఎప్పటి లాగే చిత్రాలు ఒక క్రమంలో ఉంచడం లేదు.
3. చిత్రాలు పూర్తిగా కానీ, చిత్రం లోని కొంత భాగాన్ని కానీ ఆధారంగా తీసుకోవాలి.
4. ఒక పదానికి రెండు కాని అంత కంటె ఎక్కువ కానీ అర్ధాలు కలిగిఉంటే వాటిని నానార్ధాలని అంటారని తెలిసినదే కదా.
ఆరు పదాలూ, వాటికి నానార్ధాలూ చెప్పి అందుకోండి వీరతాడు !
ఇదేం బాగు లేదయ్యా నస బ్లాగరూ ! అంటారా ? సరే, ఇక మానేద్దాం.
ప్రకటన : తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర అతి త్వరలో విడుదల !
ఒక సుళువు: ముందుగా ఈ చిత్రాల లోని సూర్యుడు, ఆకాశం, పద్మం, చెయ్యి, విష్ణువు, తోడేలు ... ఈ పదాలకు పర్యాయ పదాలు చూడండి. అప్పుడు ఆ పదాలకు ఉన్న నానార్ధాలు చెప్పండి చాలు. అంతే. ఎంత వీజీవో కదా !
3 కామెంట్‌లు:
వజ్రాయుధము : అశని, హ్రాదిని, దంభోళి
కలువ : కుముదము,రాజీవము,పద్మము, కువలయము,చెందొవ
మేఘము : మొయలు,అంభోదము, ముదిరము,మబ్బు
ఏనుగు : కరి, ఇభము,గజము
కోతి : మర్కటము, లంగూరము, పింగలి, అగచరము,గోపుచ్ఛము,వానరము
కాకి : వాయసము,కరటము,
కుక్క : శునకము,జాగిలము,శ్వానము
నక్క : క్రోష్టువు,జంబుకము, ఫేరవము,సగ్గారి,
ragamanjari గారూ, క్షమించాలి. నేను టపాలో చెప్పండి చూద్దాం అని ఇచ్చిన చిత్ర సమస్య నానార్ధాలకి చెందినది. మీరు పర్యాయ పదాలు వ్రాసారు.
ఈ సారి నానార్ధాలు ప్రయత్నించండి. ధన్యవాదాలు.
మబ్బు = మేఘము, మొద్దు (సరిగ్గా ఆలోచించలేకపోతే మబ్బు అంటారు)
కప్ప = ఒక ఉభయచరము, పన్ను
కుక్క = ఒక జంతువు, కుక్కడం
సూర్యుడు = భస్కరుడు, వీరుడు
నేత = బట్టలు నేయడము, అధిపతి
చేయి = కరము (శరీరములో ఒక భాగము), పని చేయడం
కామెంట్‌ను పోస్ట్ చేయండి