7, డిసెంబర్ 2011, బుధవారం

చెప్పుకోండి చూద్దాం !




ఇక్కడ ఉంచిన చిత్రాల ఆధారంగా ఆలోచిస్తే ఒక చక్కని పద్యం స్ఫురించే వీలు ఉంది. కనుక్కోండి చూదాం !

చిత్రాలకు ముందు వెనుకల కొన్ని అక్షరాలో, పదాలో, పదబంధాలో చేర్చు కోవాలి.

వీటి ఆధారంగా స్ఫురించే పద్యం, దానిని రచించిన కవి పేరూ, గ్రంథం పేరూ కూడా చెప్పాలి.


ఏ చిత్రాన్నయినా, అవసర మయితే ఒకటి కంటె ఎక్కువ సార్లు ఉపయోగించు కోవచ్చును.

చిత్రాలన్నీ పద్యాన్ని అనుసరించి ఒక క్రమంలో మాత్రం ఉండవు. పద్యం లోనిఆయా పదాలను గుర్తుకు తేవడంలో ఏవేనా చిత్రాలు అంతగా సరిపోకపోతే మీరే సర్దుకు పోవాలిమరి.

ఇంతకీ ఇదంతా కేవలం సరదా కోసమే సుమండీ !












ఈ చిక్కు ముడి విడాలంటే ఏదేనా క్లూ ఇమ్మని బ్లాగు మిత్రులు కోరుతున్నారు.

సరే, ఈ పద్య కవికీ కోకట గ్రామానికీ సంబంధం ఉంది ! ఇంత కంటె తేలికయిన క్లూ మరొకటి ఉండదేమో కదూ !

15 కామెంట్‌లు:

పంతుల సీతాపతి రావు చెప్పారు...

ఎంత..చించినా స్పురించలేదు
భక్తి ఫోటో సామవేదం షణ్ముఖ శర్మదా?
ఏమో బాబూ, ఈ పేజీలు ఇప్పలేను

ఆ.సౌమ్య చెప్పారు...

కొంచం సులువైన పద్యం ఇవ్వొచ్చు కదండీ....కాఈ ఈ ఆట భలే తమాషాగా ఉంది.

కథా మంజరి చెప్పారు...

సీతాపతి గారూ ధన్యవాదాలు. సౌమ్య గారూ
చిత్రాల ఎంపికలో నేను మరింత నేర్పు చూపించి ఉంటే ఆ ప్రసిద్ధమైన పద్యం సుళువుగా మీరు గ్రహించి ఉండే వారు. ఆ వైఫల్యం నాదే కానీ మీది కాదు. ఏమయినా ప్రయత్నించండి.

జ్యోతి చెప్పారు...

కోకట గ్రామకవి అంటే అల్లసాని పెద్దన. పద్యం... అటజని కాంచె... ఇదేనా?? కాదనే అనుకుంటా.. పెద్దన అనగానే మనుచరిత్ర, వరూధని ప్రవరాఖ్యులు గుర్తొచ్చారు..:)

కథా మంజరి చెప్పారు...

జ్యోతి గారూ. నా బ్లాగు గురువులైన మీరు ఈ టపాకి స్పందించడం నాకు చాలా సంతోషంగా ఉంది !

స్వతహాగా పద్యప్రియులైన మీరు మరి కొంచెం ప్రయత్నించరూ ?

జ్యోతి చెప్పారు...

నేను చెప్పిన కవి పేరు రైటేనా?? కాదంటే ఇంకో క్లూ ఇవ్వాల్సిందే. లేదా మీ చిత్రాలను మార్చి కాస్త మాకు పద్యం స్పురించేలా ఇవ్వండి..

రవి చెప్పారు...

చక్కటి ప్రయత్నం మాస్టారు గారు. అమ్మాయి కన్నులు చూస్తే "ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ!" అనిపించింది. :)

మీ క్లూలు వరుసలో లేవనుకుంటాను. వరుసలో అమర్చి, కఠినమైన పద్యమే ఇవ్వండి. అప్పుడు ఆట మరింత పసందుగా ఉంటుంది.

కథా మంజరి చెప్పారు...

రవి గారూ, ధన్యవాదాలు. చిత్రాలు కావాలనే చిందర వందర చేసాను. మీ సూచన కూడా పాటించ దగినదే. ఐతే, మీరు సరైన జవాబు కోసం మరో సారి చిత్రాలు చూడండి

Sudha Rani Pantula చెప్పారు...

ఆఆ...తెలిసిపోయింది...బాబాయిగారూ..దొరికిపోయారు.
ఆ అమ్మాయి కళ్ళ బొమ్మ...ఇంతలు కన్నులుడ
భూసురేంద్ర.....ఆ బ్రాహ్మడి బొమ్మ
ఏకాంతమునందునున్న...బీచ్ ఒడ్డున ఉన్న అబ్బాయి బొమ్మ
జవరాండ్రు...ఆడపిల్లలబొమ్మ
నెపంబిడి పల్కరించడం..పిల్లలు మాట్లాడుకుంటున్న బొమ్మ
నీవెరుగవే - ప్రశ్న బొమ్మ
మునువచ్చిన త్రోవ...ఆ పజిల్ బొమ్మ...దారి కనుక్కునేది
మాటలేటికిన్....బహుశ టెలిఫోన్ బొమ్మ అయి ఉండాలి.
మీకోసం పద్యం కూడా ఇస్తున్నా.
" ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌"
కవిపేరు తెలిసినదేగా... అల్లసాని పెద్దన, మనుచరిత్ర(వరూధినీ ప్రవరాఖ్య)
అల్లప్పుడెప్పుడో..ఓ వీరతాడు వేస్తానని అన్నారు...వేస్తారా మరి??

రవి చెప్పారు...

ఇంతటి కన్నులుండ - కన్నులు
తెరువు = అడ్రసు బొమ్మ (ఇంటి తోవ)
భూసురేంద్ర = పురోహితుని బొమ్మ
ఏకాంతము = నదిఒడ్డున కూర్చున్న వాని బొమ్మ
జవరాంద్ర = అమ్మాయిల బొమ్మ
నీవెరుగవే = ప్రశ్న మార్కు
పల్కరించు = టెలిఫోను బొమ్మ

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

కథా మంజరి చెప్పారు...

సుధ గారూ, రవి గారూ అందుకోండి వీరతాళ్ళు ! ఇద్దరకీ నా అభినందనలు.

నేను సరైన చిత్రాలు పెట్ట లేక పోయినా,పద్యం పట్టకున్నారు.

అందరికీ అభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఈ పోటీ భలే చమత్కారంగా కొత్తరకంగా చాలా బాగుంది.
పోటీ పెట్టిన జోగారావు పంతులు గారికీ, గెలిచిన సుధ, రవి గార్లకు అభినందనలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

మీరిచ్చిన క్లూ లేకుండా పద్యాన్ని కనుక్కోవడం అసాధ్యం.ఊరికే గెస్ చేయాలంతే. మీ ఆలోచన బాగుంది. ఇలాంటివే ఇస్తూ ఉండండి. కాని ఒక చిన్న క్లూకూడా ఇవ్వండి. లేకపోతే విసుగొచ్చి ప్రయత్నించడం మానేస్తారు.

Sudha Rani Pantula చెప్పారు...

బాబాయిగారు, వీరతాడు భలే బావుంది. ఇంకా ఇలాంటివి ఇవ్వండి మరి....మెదడు పదునెక్కించుకోవడానికి. మందాకిని గారు, ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ------?
మ.చ.(పెద్దన)
ఔనా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి