చెప్పుల కథ చెప్పు కున్నాక, ఇక గొడుగుల కథ కూడాచెప్పు కోవడం సబవు. ఎందు కంటే గొడుగూ, చెప్పులూ కవల పిల్లల్లాంటివి. ఒకప్పుడు వీధిలోకి వెళ్ళే జనాలు, ముఖ్యంగా మగాళ్ళు చెప్పులు వేసుకుని గొడుగు పట్టుకుని, లేదా చంకలో పెటుకుని మరీ వెళ్ళే వారు. అయితే, గొడుగు పట్టు కోవడం నామోషీగా తలచే రోజు లొచ్చాక వీధుల్లో మనుషుల చేతుల్లో గొడుగులు అంతగా కనబడడం లేదు. ఎండా వానల నుండి కాపాడు కోవడం కోసం వాడే గొడుగులు, ఒకప్పడు అమ్మాయిలకు ఫేషన్ సింబల్ గా కూడా ఉపయోగ పడేవి.
చెప్పులకి ఉన్నంత కాక పోయినా, గొడుగులకి ఉన్న గొప్ప తనం గొడుగులకి ఉంది.
ఎవరి గొప్ప వారిది. అంచేత మనం గొడుగుల కథ చెప్పుకుందాం ...
వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు రంగుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే
తాటాకు గొడుగులూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో వీటిని గిడుగులంటారు. వీటినే ఏ ప్రాంతంలో అంటారో తెలియదు కానీ, జిడుగు అని కూడా అంటారని తెలుస్తోంది. మామ్మూలు గొడుగులకి ఉండేలా పట్టు కోవడానికి కర్ర లేక పోవడం వీటి ప్రత్యేకత, తాటాకుతో చేసే గిడుగులు తల మీద పెట్టుకుని కదలకుండా తాడుని బెల్టు లాగా మెడ క్రింద తగిలించు కుంటారు. పల్లెల్లో పొలాల్లో, తోటల్లో పని చేసే వారికి దీని ఉపయోగం జాస్తి. పట్టుకో నక్కర లేదు కదా ! ఒకప్పుడు తాటాకుతో పల్లెల్లో మాత్రమే వాడుకునే ఈ గిడుగులు విదేశీయులూ, వారిని అనుకరించాలని ఉబలాట పడే దేశీయులూ కూడా నెత్తిని పెట్టుకుని వీధుల్లో తిరగడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి చింపిరి జుట్టూ, అతుకుల పంట్లామూ అదనపు ఆకర్షణ కాబోలు. ఈ నవతరం గిడుగులు రంగు రంగుల్లో ఖరీదయిన గుడ్డలతో తయారవుతూ ఆకర్షణీయంగా కూడా ఉంటాయి.
ఇక పోతే చిన్న పిల్లలకి రంగుల పువ్వుల చిన్న గొడుగులు ప్రత్యేకం. నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.
దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు. సినిమా చిత్రీకరణ వేళ హీరోలకి గొడుగు పడుతూ అతని వెనుకే నీడలా తచ్చాడే వారుంటారు. వినాయకుడి బొమ్మ వెనుక మట్టి తోనో, రంగు కాగితాలతోనో చేసిన గొడుగు కొందరు భక్తులు పెడుతూ ఉంటారు. దేవుడికీ, పెద్ద వారికీ, నాయకులకూ గొడుగు పట్టడం ముక్తిదాయకం. లాభదాయకం.
రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే గొప్స దిలాసాగా ఉంటుంది కానీ, మన గుబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.
గొడుగు అనే అర్ధాన్ని ఇచ్చే పదాలు చాలానే ఉన్నాయి. చూదాం ..
ఆత పత్రం, ఆతప వారణం,ఆలవట్టము, ఉత్కూటము,ఉష్ణ వారణమ, ఎల్లి, కావారి, ఛత్రము, జనత్ర, తొంగలి, .. లాంటి పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి కానీ వాడుకలో కనిపించవు కనుక చెప్పు కోవడం కంఠశోష. వదిలేద్దాం,
గొడుగులో ఒక్కో భాగానికీ ఒక పేరుంది, గుడ్డ , కమాను, కమాను పుల్లలు లాంటి తెలుగు పదాల సంగతి తెలిసిందే ఇంగ్లీషు వాళ్ళేమంటున్నారో ఈ చిత్రం చూడండి ..
దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు. సినిమా చిత్రీకరణ వేళ హీరోలకి గొడుగు పడుతూ అతని వెనుకే నీడలా తచ్చాడే వారుంటారు. వినాయకుడి బొమ్మ వెనుక మట్టి తోనో, రంగు కాగితాలతోనో చేసిన గొడుగు కొందరు భక్తులు పెడుతూ ఉంటారు. దేవుడికీ, పెద్ద వారికీ, నాయకులకూ గొడుగు పట్టడం ముక్తిదాయకం. లాభదాయకం.
గొడుగు అనే అర్ధాన్ని ఇచ్చే పదాలు చాలానే ఉన్నాయి. చూదాం ..
ఆత పత్రం, ఆతప వారణం,ఆలవట్టము, ఉత్కూటము,ఉష్ణ వారణమ, ఎల్లి, కావారి, ఛత్రము, జనత్ర, తొంగలి, .. లాంటి పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి కానీ వాడుకలో కనిపించవు కనుక చెప్పు కోవడం కంఠశోష. వదిలేద్దాం,
గొడుగులో ఒక్కో భాగానికీ ఒక పేరుంది, గుడ్డ , కమాను, కమాను పుల్లలు లాంటి తెలుగు పదాల సంగతి తెలిసిందే ఇంగ్లీషు వాళ్ళేమంటున్నారో ఈ చిత్రం చూడండి ..
గొడుగు ప్రస్తావన వచ్చిన పద్యాలూ, శ్లోకాలూ కొన్ని చూదాం.
వెనుకటి రోజులలో అయ్య వారికి చాలు అయిదు వరహాలు, పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇంటికి వచ్చి, దసరా పద్యాలు చదివే పిల్లలు విధిగా చదివే పద్యం ఒకటుంది.
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై
సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై
వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా
భూమి సింహాసనం, ఆకాశం గొడుగూ, దేవతలు సేవకులూ, వేదాలు వందిమాగధులూ,బ్రహ్మాండమే ఆకారం,లక్ష్మీ దేవి భార్య, బ్రహ్మ కొడుకూ, గంగా దేవి కుమార్తె, అయి నరాయణుడు వర్ధిల్లు గాక అంటారు పిల్లలు.
శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని గొడుగులా ఎత్తి, గోగణాన్నీ, గోపాలురనూ కాపాడాడని పోతన భాగవతంలో చక్కని పద్యంలో వర్ణించాడు.
బాలుండాడుచు నాత పత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేలఁ దాల్చి, విపులచ్చత్రంబుగాఁ బట్టె నా
భీలాభ్రచ్చుత దుశ్శలా చకిత గోపీగోప గోపంక్తికిన్
అంటే, గోవర్ధన పర్వతాన్ని ఆడుతూ పాడుతూ పూల గుత్తిని గొడుగులా భావించి, బాలుడైన శ్రీకృష్ణుడు చిరు నవ్వుతో మీదకు ఎత్తాడు. దారుణ మైన ఆ జడివాన నుండి గోగణాన్నీ, గోపికలను, గోపాలకులనూ కాపాడడానికి ఆ కొండను ఒక పెద్ద గొడుగులా పట్టుకున్నాడు.
పోతన గారి పద్యమే, వామన చరిత్రలోనిది. వామనుడు బలిని అంతమొందించే పనిలో వటువుగా బలి వద్దకు వచ్చాడు.బలి ఆతిథ్య మిచ్చి ఏం కావాలని అడిగాడు. మూడడుగుల నేలనిమ్మని కోరాడు వామనుడు. ఓసింతేనా ! అని ఆశ్చర్య పోయాడు బలి చక్రవర్తి, అసలు కికిరీ తెలియక.
ఏమిటయ్యా, భూభాగాన్ని అడిగావా ? ఏనుగులూ గుర్రాలూ కావాలన్నావా ?జవరాండ్రను అడిగావా ?నువ్వు పసి వాడివి. అడగడం కూడా తెలియదు.నీ అదృష్టం అంతే కాబోలు అంటూ నవ్వేడు.
అప్పుడు వామనుడు అవన్నీ నాకెందుకయ్యా రాజా అంటూ ఇలా పలికాడు ...
గొడుగో, జన్నిదమో,కమండులవొ,నాకున్ ముంజియో, దండమో,
వడుగే నెక్కడ ? భూము లెక్కడ ? కరుల్. వామాక్సు, లశ్వంబు లె
క్కడ ? నిత్యోచిత కర్మ మెక్కడ ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
నువ్వు చెప్పిన భూములూ, ఏనుగులూ, గుర్రాలూ, ఆడువారూ నాకుంకయ్యా, నును వటువును. నాకు గొడుగో. జంద్యమో, కమండలమో. మొలత్రాడో కర్రో చాలును. నాకు మూడడుగుల నేలను ఇస్తే అదే నా పాలిట బ్రహ్మాండం
నిజంగానే మూడడుగుల నేలను దానం తీసుకుని బ్రహ్మాండాలన్నీ ఆక్రమించి బలిని పాతాళానికి త్రొక్కేసాడు వామనుడు.
అంతర్జాలంలో లభించిన గొడుగుల కథ (వారికి ధన్యవాదాలతో )పెడుతున్నాను చూడండి ..
వర్షాకాలం మొదలవగానే గొడుగుల దుమ్ముదులుపుతాం. నిజానికి, ఇవి ఎండాకాలం ఉపయోగించటానికే తయారయ్యాయి. అసలు గొడుగును ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ వీటిని 11వ శతాబ్దం నుంచే చైనాలో వాడిన దాఖలాలున్నాయి. ప్రాచీన ఈజిప్ట్, బాబిలోనియాల్లో గొడుగులు హోదాకు గుర్తుగా వాడేవాళ్లు.
ఐరోపాలో గ్రీకులు గొడుగును ఎండకు రక్షణగా ఉపయోగించేవాళ్లు. ఉన్నత వర్గాలు, రాజ కుటుంబీకులు మాత్రమే గొడుగులను నీడకోసం వాడేవాళ్లు. వీళ్లందరికీ విరుద్ధంగా గొడుగును వానకు తడకుండా ఉపయోగించే వాళ్లు.... ప్రాచీన రొమన్లు. 1680లో ఫ్రాన్స్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లో గొడుగు వాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటా వానకు రక్షగా గొడుగును వాడటం మొదలుపెట్టారు. ఇదీ గొడుగు కథ
పాదచారులకు చెట్టు నీడే గొడుగు. ఖర్వాటుల ఖర్మకి మనం చెయ్యగలిగేదేమీ లేదు.
పుట్ట గొడుగులు గొడుగులు కావు. ఒక రకం మొక్కల జాతికి చెందినవి.
పుట్ట గొడుగులు గొడుగులు కావు. ఒక రకం మొక్కల జాతికి చెందినవి.
వీటిలో కొన్ని రకాల పుట్ట గొడుగులను మహా ప్రీతిగా కూరొండుకు తింటారు కూడా. పతంజలి గారి రాజుగోరు నవలలో నాయురాలు అల్లుడు అప్పలనాయుడిని ఒక వంక తిడుతూనే, వాడికి పుట్ట గొడుగుల కూరంటే బెఁవత ... చేసి పెట్టమ్మా ! అని కూతురిని పురమాయిస్తుంది...
ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే సమయాను కూలంగా జంప్ జిలానీల మై పోవడం. లేదా, అందరి దగ్గరా వారికి నచ్చిన విధంగా నడచు కోవడం.
అన్నీ ఒక గొడుగు కిందకే తేవడం అంటే సింగిల్ విండో పధకం లాంటిదన్నమాట.
అప్పుల వాళ్ళ నుండి ముఖం చాటేయడానికి గొడుగు కన్నా సుఖమైన సాధనం మరొకటి లేదు.
దేనికదే చెప్తుపు కోవాలి. తుఫాను గాలిలో గొడుగులు విరిగి పోవడం తప్ప ఉపయోగ పడవు.
ప్రేమికు లిద్దరూ వర్షంలో ఒకే గొడుగు క్రింద నడవడం మంచి అనుభవమంటారు ప్రేమ పండితులు.
‘‘ చూసావే ... ఎప్పుడూ తిడుతూ ఉంటావు ... గొడుగు మరిచి పోతున్నానంటూ ...చూడు ... ఇవాళ మరిచి పోకుండా ఆఫీసు నుండి వస్తూ గొడుగు తీసుకొచ్చేను ..’’ అన్నాడు భర్త తన మతి మరుపును వెక్కిరించే భార్య నోరు మూయిద్దామని.
‘‘ అయ్యో ! మీరివాళ అసలు గొడుగే పట్టు కెళ్ళ లేదండీ !’’ అని నెత్తి కొట్టుకుంది భార్య.
ఒకే గొడుగు కింద పదిమంది వెళ్తూంటే వారిలో ఎందరు తడిసే అవకాశం ఉందంటూ అడిగాడు ఒక ఆసామీ. తన మిత్రులని.
ఇద్దరనీ, ముగ్గురనీ, ఐదుగురనీ, ఇలా తలొక్కరూ తలో జవాబూ చెప్పేరు.
‘‘ అసలు వానే పడనప్పుడు ఎవరూ తడిసే అవకాశమే లేదు కదా ! అని భళ్ళున నవ్వుతూ వెళ్ళి పోయాడు ఆ ఆసామీ.
ఇదండీ గొడుగుల కథ.
శలవ్.

1 కామెంట్:
చాల ఉంది గోడుగమ్మ కథ
కామెంట్‌ను పోస్ట్ చేయండి