బయటికి అన కూడదు కానీ, మా వారొట్టి
బడుద్ధాయ్. ఎవరితోనూ ఈ మాట అనబోకండి, కొంపలంటు కుంటాయ్, ఈ మాట నేను ఊరికే అనడం
లేదు. దానికి మా సాంసారిక జీవితంలో చాలా తార్కాణాలున్నాయి. (
నిజానికి ప్రతి బడుద్ధాయి మగ మహా రాజు విషయంలో
నూ సరిగ్గా యివే కాక పోయినా, ఇలాంటివే కొన్ని ఉదాహరణలు ఉంటాయని నా మనో నిఃశ్చయం. )
సరదాగా
వో చల్లని సాయంత్రం వేళ శ్రీ వారిని వెట బెట్టుకుని చీరల షాపుకి వెళ్తానా ! అక్కడ మొదలవుతుంది మా శ్రీ వారి నాగినీ డాన్సు.
ఆ షాపంతా చక్కా ఏ. సీ హాలే అయినా ,మా వారు ఊరికే చెమట్లు పట్టి పోతూ ఉంటారు.
నిముషానికోసారి అయిందా ? తొందరగా తెముల్చూ, యిక
వెళ్దాం ... అంటూ ఒకటే నస. ( మనం ఖాతరు చెయ్యమనుకోండి )
షాపు వాడు చూపించిన ప్రతి చీరా, ‘‘ ఇది చాలా బావుంది, కొనెయ్ ’’ అంటూ తెగ తొందర చేస్తూ ఉంటారు. (
మానవుడు పాపం, ఫీలవుతాడు కదా, అని ఓ చిరు నవ్వు పారేసి, ఆ చీరని చూపించిన వాడి
ముఖాన కొడతాం.)
‘‘ ఈ చీర చూసావూ, నీకిది బాగా నప్పుతుందే ... నువ్వు కడితే దీనందం రెట్టింపవుతుంది ! ’’ అని మనల్ని ఉబ్బేయడానికి ప్రయత్నిస్తారు.
వ అలాంటి వాటికి పడతామా మనం ! పోయినేడు మా మరిది పెళ్ళికి ఏ రంగు చీరలు మార్చి కట్టు కున్నానో టక్కున చెప్ప మనండి, చూదాం ! చెప్ప లేరు ! అలాంటిది నన్ను ఉబ్బేసి షాపింగు త్వరగా తెమల్చడానికి కాక పోతే, చీరల సెలక్షను ఈయనకేం తెలుసూ !
‘‘మొత్తానికి ఉండేవి ఏడు రంగులే కదా, ఏ రంగు ఎంచు కోవాలో తేల్చు కోడానికి ఇంత సేపా ! ’’ అంటూ విసుక్కు పోతారు.

ఏడిసినట్టుంది !
ఉన్న రంగులు ఏడే కానీ , వాటి కాంబి నేషను కోకొల్లలని ఈ పురుష సింహం ఎప్పుడు
తెలుసు కుంటుందో కదా !
‘‘ మా మగాళ్ళయితే క్షణంలో ఏం కావాలో ఇట్టే తేల్చేస్తాం. నా బట్టల సెలక్షనయితే అర నిముషం పట్టదు !’’ అంటారు, గర్వంగా
‘ ‘ అందుకే ఏడిసినట్టుంటాయి ’ స్వగతంలో అనుకుని,
‘‘ మీ కోసం అయితే ఫేంటూ , చొక్కా మీరే కానక్కర లేదు ... మన బుజ్జి ముండ కూడా అర క్షణంలో ఎంచి పారేస్తుంది ... ఎప్పుడూ ఆ ముదురు నీలం రంగు ఫేంటూ, ఆ చారల చొక్కా గుడ్డలే కదా ! ’’ అని నవ్వుతాం.
‘‘ సరి సరి ... తొందరగా కానీ ... చూడు, ఎన్ని చీరలు తీయించి ్ుప్ప వేయించావో ...’’ అని విసుక్కుంటారు.

ఏదీ ఇంకా చూపించాల్సిన చీరలు వాడి వెనకాల ఉన్న అరల్లో ఒకటీ
రెండూ మిగిలి పోయేయి కదా, అవి కూడా చూడొద్దూ ! వచ్చి ఇంకా రెండు గంటలేగా అయిందీ
?! ఈ పాయింటు అర్ధం చేసుకో లేక, సిగరెట్టు కంపు కొట్టే నోటిని
నా చెవి దగ్గర ఉంచి, ‘‘ అన్నీ తీయించి అక్కర లేదని
పడేస్తున్నావు ! వాడేమయినా అనుకుంటాడేమోనే’’
అంటూ తెగ ఫీలయి పోతూ ఉంటారు. జాలి గుండె
మనిషి పాపం.
మనం వారి ఎత్తులకీ ,
జిత్తులకీ లొంగక పోయే సరికి, ‘‘ చంటిది నిద్ర లేచి అమ్మని ఏం ఇబ్బంది పెడుతోందో , ఏమో !’’ అని ఓ కొత్త పల్లవి ఎత్తుకుని బెదిరింపులకు దిగుతారు ! మనం ఏమన్నా తక్కువ తిన్నామా ! ‘‘ లేవదు గాక లేవదు! లేచినా ఇంతో టి మీ
అమ్మ గారేమీ కంది పోరు లెండి. ఆపాటి మనవరాలిని చూసుకో లేరూ ! మరీ అంత సుకుమారి రాజ
కుమారా ఆవిడా?!’’ అంటూ, దీర్ఘాలు తీస్తూ హాశ్చర్యం నటిస్తాం. అంతే ! దాంతో వారి నోరు మరి పెగలదు.
ఇవ్విధంబున దశ విధాలా, కొండొకచో మరి కొన్ని విధాలా మా బడుద్ధాయి గారిని నాన బెట్టి, ఉతికి ,
ఆరవేసి, ఇస్త్రీ చేశాక కనికరించి ఉన్న
వాటిలో ఖరీదయిన చీరలు ఫదో , పాతికో
కొంటాం. అప్పటికే సగం కను గుడ్లు తేలేసిన శ్రీ వారు కిమ్మనకుండా బిల్లు పే ,స్తారు.
కొంటాం. అప్పటికే సగం కను గుడ్లు తేలేసిన శ్రీ వారు కిమ్మనకుండా బిల్లు పే ,స్తారు.
అప్పుడు మన కనిపిస్తుందీ,
అయ్యో ! ఇంత మంచి మనిషినా, పట్టుకుని బడుద్ధాయి అనీ అదనీ ఇదనీ వాగేను.
కళ్ళు పోవూ !
మా ఆయనంత మంచాయన
లోకంలో మళ్ళీ మా ఆయనే కదా !
ఇదండీ ...చీరల చిరు కథ. చీర
పద్యాలు పుస్తకానికి రెండో ముద్రణ జరిగేటప్పుడు
దీనిని నిరభ్యంతరంగా ముందు మాటగా కాక పోయినా, వెనుక మాటగా వేసుకోడానికి
నాకు ఎలాంటి అభ్యంతరమున్నూ లేదు. ( మనకి లేక పోయిననూ వారికి ఉండే ఉండ వచ్చునని ఎందుకో తోచు చున్నది.)
తాజా కలం : భార్యల దృష్టిలో బడుద్ధాయి కాని మగాడు ఉండేమో. !
‘‘ మీకేం తెలియదు ! మీరూరు కోండి !’’ అని ఒక్ఖ సారయినా పెళ్ళాం చేత అనిపించు కోని వారికిది వర్తించదని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాను .
. ( అలాంటి వారెవరయినా ఉంటే గింటే )

( ఈ టపాలో ఉపయోగించుకున్న కార్టూనులు గీసిన వ్యంగ్య చిత్రకారులకి ధన్యవాదాలు,)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి