ఈ శ్లోకం
చూడండి:
పన్నగధారి
కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ
శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.
ఈశ్లోకంలో
కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ
వచ్చేలా రచించాడు.
ముందుగా
శివ పరమయిన అర్ధం చూదాం.
శివ పరంగా
అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:
పన్నగధారి,
కరాగ్ర:, గంగా, ఉమా లక్షిత:, గదా,
అగ్ర భుజ:, శశి ఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:,
అనాది:, ముహు:, త్వామ్ , అవతు.
అన్వయ
క్రమం ఇలా ఉంటుంది:
పన్నగధారి:,
గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:,
త్వామ్ అవతు !
భావం:
చేతిలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతుల ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని
బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన
వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అయిన
పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !
కవి ఈ
శ్లోకంలో శివుడికి ఈ విశేషాణాలు వేసాడు.
పన్నగధారి = పామును
ధరించిన వాడు
గంగో మా
లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత: = గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర
భుజ: = భుజాల
మీద బాహుపురులు,
స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ
శేఖర:
= చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా
పరిగ్రహ:
= పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది: = పుట్టుక లేని వాడు
మహు:,
త్వామ్ అవతు = సదా
మిమ్ము కాపాడు గాక !
ఇక, శ్లోకం
లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన
విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !
విశేషణాలలోని
తొలి అక్షరాలు తొలిగిస్తే, పదచ్ఛేదం ఇలా
ఉంటుంది:
నగధారి,
కరాగ్ర: , గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:,
శిఖండ శేఖర:, మా, పరిగ్రహ: , అనాది: ,
ముహు:, త్వామ్ , అవతు.
అన్వయ
క్రమం ఇలా ఉంటుంది:
కరాగ్ర:,
నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: ,
త్వామ్, ముహు:, అవతు.
కరాగ్ర:
నగధారి = గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో = ఆవుల చేత,
మా = లక్ష్మీదేవి
చేత
లక్షిత: = కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ
దేవికి ప్రభువు
అయిన వాడు
)
గద: అగ్ర
భుజ: = భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ
శేఖర: = శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా =
లక్షీ దేవిని
పరిగ్రహ: = భార్యగా స్వీకరించిన వాడు
అనాది: = ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన
అర్ధమగు) విష్ణువు
పుట్టుక
లేని వాడు అయిన విష్ణువు
ముహు: ,
త్వామ్, అవతు = సదా మిమ్ము కాపాడు గాక
!
భావం: గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ, గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ,
తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన
శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
స్వస్తి.
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి