కాకుల గురించి కాకి గోల ( ఇక్కడ నొక్కి ఆ కాకి గోల భరించండి) అనే టపా రాస్తూ త్వరలో గాడిదల గురించి కూడా
ఓ టపా పెడతానని చెప్పాను కదా.
ఇప్పుడు గాడిదల గురించి రాయడం మానుకుంటే ‘ మాట తప్పేడురా గాడిద కొడుకు ! ’ అని ఎవరు తిడతారో అనే భయంతో ఇది పెడుతున్నాను.
మా చిన్నప్పుడు ఆవకాయలు పెట్టే రోజున మామిడి టెంకలనూ,జీళ్ళనూ చేజిక్కించుకుని గోడలన్నీ ‘‘ దడిగాడు వాన సిరా’’ లాంటి వ్రాతలతో ఖరాబు చేసే వాళ్ళం. ‘‘ గోడలు పాడు చేసిన గాడిద ఎవర్రా ?! అని పెద్దాళ్ళతో తిట్లు తినే వాళ్ళం.
ఇప్పుడు పెద్దయ్యాక, ఖరీదయిన పెయింట్లు తిరిగి వేయించుకో లేక, చాపల్యం చావక కాబోలు, అలాంటి అడ్డమయిన రాతలూ బ్లాగుల్లోనూ, ముఖ పుస్తకాలలోనూ రాయడం మొదలు పెట్టాం.
సరే, మరి గాడిదల కథా కమామీషూ కాస్త చూడండి ...
మా చిన్నప్పుడు ఆవకాయలు పెట్టే రోజున మామిడి టెంకలనూ,జీళ్ళనూ చేజిక్కించుకుని గోడలన్నీ ‘‘ దడిగాడు వాన సిరా’’ లాంటి వ్రాతలతో ఖరాబు చేసే వాళ్ళం. ‘‘ గోడలు పాడు చేసిన గాడిద ఎవర్రా ?! అని పెద్దాళ్ళతో తిట్లు తినే వాళ్ళం.
ఇప్పుడు పెద్దయ్యాక, ఖరీదయిన పెయింట్లు తిరిగి వేయించుకో లేక, చాపల్యం చావక కాబోలు, అలాంటి అడ్డమయిన రాతలూ బ్లాగుల్లోనూ, ముఖ పుస్తకాలలోనూ రాయడం మొదలు పెట్టాం.
సరే, మరి గాడిదల కథా కమామీషూ కాస్త చూడండి ...
‘ ఖర’ నామ సంవత్సరం గురించి కథా మంజరి తెగ గర్విస్తోంది.
గాడిదకు చాలా పేర్లుఉన్నాయి. చక్రీవంతం,బాలేయం, రాసభం,గర్ధబం, గార్ధభం,గాడ్ద, ఖరం, గాలిగాడు ... ఇలా.
ఏ పేరుతో పిలిచినా ఓండ్ర పెడుతూ పలుకుతుంది కనుక అందరకీ తెలిసిన గాడిద అని పిలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది.
రామాయణంలో
ఖర దూషణలు అనే ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు. ఇద్దరూ అన్న దమ్ములు.
రావణుని చెల్లెలు శూర్ఫణఖ దండకారణ్యంలో ఉన్న శ్రీరాముని మీద మనసు రాక్షసంగా
పారేసుకుంది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులూ కోసి తరిమేసాడు. అది వెళ్ళి ఈ
అన్నదమ్ములిద్దరికీ తన గోడు చెప్పుకుంది. ఈ అడ్డగాడిద లిద్దరూ రామునిపైకి
దండెత్తి, అతని చేతిలో చచ్చారు.
భాగవతంలో గార్ధభాసురుడు అనే వాడు కనిపిస్తాడు. వీడూ రాక్షసుడే. వీడు బలరాముని చేతిలో హతుడయ్యాడు.
ఇక,
దేవకీ వసు దేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుడితే , కసంసుడిపాల
బడకుండా వసు దేవుడు ఆ పసివాడిని గంపలో పెట్టుకొని యమునానది దాటి
వ్రేపల్లెకు చేరి యశోదమ్మ ప్రక్కన ఉంచి ఆమె కన్న ఆడశిశువును తనతో
నిరాటంకంగా తెచ్చుకొన్నాడు. విష్ణుమాయ చేత ఆ పనిలో అతనికి ఎలాంటి ఆటంకాలూ
ఎదురు కాలేదు. కానీ
దారిలో ఒక గాడిద మాత్రం రహస్య భేదనం జరిగేలా ఓండ్ర పెట్టింది. ఓండ్ర శబ్దంలో ఓం కారం ఉంది కనుక తన అరుపు
ఓంకారనాదం అనుకుందేమో పిచ్చి ముండ ! శాంతం పాపం ! శాంతం పాపం!
ఇహ లాభం లేదని, వసు దేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకో వలసి వచ్చింది.
గాడిద ముఖం కలిగిన దేవుళ్ళూ, దేవగణాల వాళ్ళూ ఉన్నారంటే ఈ చతుష్పాది ఎంత మహిమ కలదో వేరే చెప్ప నక్కర లేదు.
ఇవి గాడిదల ప్రస్తావన ఉన్న పురాణ కథలు కాగా, గాడిదల గురించిన నీతి కథలు అనేకం ఉన్నాయి.
అందరికీ తెలిసిన ప్రముఖమైన కథ ఇది:
ఒక
చాకలి ఇంట కుక్క గాడిద ఉండేవి. కుక్క అతని ఇంటిని కాపలా కాస్తూ ఉంటే,
గాడిద బరువులు మోసేది. తనెంత విశ్వాసంగా ఉన్నా ఇంటి యజమాని తనని సరిగా
చూడడం లేదని కుక్కకి కోపం వచ్చింది. ఇక వాడి పట్ల విశ్వాసంగా ఉండ కూడదని భౌ
భౌ తీర్మానం ఒకటి ఆత్మగతంగా చేసుకొంది. ఓ రాత్రి యజమాని ఇంట దొంగలు
పడ్డారు. సహాయ నిరాకరణకు పూనుకొన్న కుక్క దొంగను చూసి కూడా
మొరగడంమానేసింది. గాడిద కంగారు పడి కుక్కను హెచ్చరించింది. కుక్క ససేమిరా
అని మొరగడానికి నిరాకరించింది. అయ్యో యజమాని, పాపం, అనుకుంటూ
దొంగలొచ్చారని యజమానికి తెలియ జేయడం కోసం గాడిద ఓండ్ర పెట్టింది. చాకలి
లేచాడు. నిద్రాభంగమయినందుకు కోపంతో దుడ్డు కర్రతో గాడిదను చావ మోదాడు !
ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకో కూడదని చెప్పే నీతి కథ ఇది.
గాడిదల గురించి కొన్ని జాతీయాలూ, సామెతలూ కూడా చూదాం:
గాడిద గత్తర
గాడిద పిల్ల కోమలం
గాడిద పుండుకి బూడిద మందు
గాడిద కేం తెలుసు గంధం వాసన
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
పనీ పాటా లేని అడ్డ గాడిద
యజమానికి ఎదుటా, గాడిదకు వెనుకా ఉండ రాదు.
గాడిద గుడ్డు
గాడిద గుడ్డూ గరుడ స్తంభం
గాడిదతో చెలిమి కాలి తాపులకే
గాడిదల మోత, గుర్రాల మేత
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పడితే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛ పోయిందిట !
అందానికి లొటిపిటా, పాటకి గాడిదా అంటూ కన్యా శుల్కంలో ఉత్తరం చదివే ఘట్టంలోమధుర వాణి విరగబడి నవ్వడం గుర్తుందా ?
అందానికి లొటిపిటా, పాటకి గాడిదా అంటూ కన్యా శుల్కంలో ఉత్తరం చదివే ఘట్టంలోమధుర వాణి విరగబడి నవ్వడం గుర్తుందా ?
పూర్వం
యుద్ధాలలో గజ సైన్యం, ఆశ్విక సేన వగైరాలు ఉండేవి. గాడిదల సేనలు ఉండేవో
లేదో తెలియదు. రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసే రాజులే ఎలాగూ గాడిదలు కనుక
వేరే గాడిదల సేన ఉండే అవసరం లేక పోయి ఉండ వచ్చును.
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులూ, లుబ్ధావధానులూ పరస్పరం త్వం శుంఠా అంటే త్వం శుంఠా ! అనీ,
గాడిదా ! అంటే అడ్డగాడిదా !అనీ ఒకరినొకరు ముచ్చటగా తిట్టుకునే వారు.
మరి గాడిద ప్రస్తావన గల కొన్ని పద్యాలు కూడా చూదామా ?
గాడిదల గురించిన చక్కని చాటువు చూడండి:
రేరే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిమ్ ?
రాజా శ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ !
సర్వా పుచ్ఛవతో హయమితి వదంత్య త్రాధికారే ప్థితౌ
రాజా తై రుపదిష్టమేవ మనుతేన్ సత్యం తటస్థాపరే:
దీని
అర్ధం : ఓ గాడిదా ! బట్టలు మోస్తూ గ్రామాలు తిరుగుతూ శ్రమ పడతావెందుకు ?
హాయిగా రాజు గారి గుర్రాల శాలకు పోయి అక్కడ గుర్రాలతో పాటు గుగ్గిళ్ళు
తింటూ గడుపు. తోక లున్నవన్నీ గుర్రాలే నని అక్కడి అధికారు లంటారులే. రాజు
కూడా గుడ్డిగా ఆ మాట నమ్ముతాడు !
చవట గాడిదలన తగిన రాజుల గురించీ, అధికారుల గురించీ ఈ సంస్కృత చాటువు వివరిస్తే, శ్రీనాథుని తెలుగు చాటువు కూడా చూడండి మరి:
బూడిద బంగలై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్ల నై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారల ’’ చొచ్చొచో ‘‘ యనన్
గోడల గొందులం దొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిద ! నీవునుం దొదిగి కవివి కావు కదా ! యనుమాన మయ్యెడున్ !
బూడిద
రంగులో ఒళ్ళంతా కళావిహీనమై, పాలి పోయిన ముఖంతో, వీధీ వీధీ తిరుగుతూ, వచ్చీ
పోయే వారు అదిలిస్తూ ఉంటే గోడల వెనుకా. సందుగొందలలోనూ ఒదిగి పోతూ ఓండ్ర
పెడుతూ ఉంటావు. ఓ గాడిదా ! నాకు అనుమానం కలుగుతోంది. ఈ కొండవీటిలో నువ్వు
కూడా ఒక కవివి కాదు కదా !
గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనను నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ !
గంగి
గోవు పాలు చిన్న గరిటెడు చాలు. కడివెడు గాడిద పాలు ఎందుకని వేమన
సభక్తికంగా పెట్టే అన్నం ఏ కొద్దిపాటి అయినా చాలును అని చెప్పడానికి మధ్యన
పాపం గాడిదను లాక్కుని వచ్చాడు. గాడిద పాలకి ఉన్న విలువ గురించి సైన్సు చెప్పని రోజులవి.
కవి చౌడప్ప గాడిదనూ వదల లేదు. అతడివే మూడు పద్యాలు చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా.
కవిత్వాన్ని మెచ్చు కుంటూ ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ అవహేళన చేస్తూ, అవమాన పరిచే తుంటరి వాడు గాడిద.
ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడు కంచు తిట్టగా విని మదిలో
వీడా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా.
పలికిన మాటను మరిచే అబద్ధాలకోరును గాడిదా అని ఒక తండ్రి ఎవడో తిడితే, ఇలాంటి వాడా నా కొడుకు ! ఛీ ! అని గాడిద కూడా ఏడిచిందిట.
గాడీపాలకి గలగిన
వాడయితేనేమి కవుల వంచించిన యా
గాడిద కొడుకును దిట్టగ
గాదా మరి కుంద వరపు కవి చౌడప్పా.
పెద్ద
పెద్ద వాహనాలు, పల్లకీలు ఉంటే మాత్రం ఏం ? కవులను మోసగించే వాడు గాడిద
కొడుకు ! వాడిని తిడితే ఏం తప్పు కనుక ? పిరదౌసిని మోసగించిన సుల్తాను
ప్రభువు గాడిదే కదా ?
వెనుకటి
రోజులలో సార్ధవాహులు తమ ప్రయాణాలలో ఎడ్లబళ్ళూ, గుర్రాలూ , మూటలూ అవీ
మోయడానికి గాడిదలనూ వినియోగించే వారన్నది తెలిసిన విషయమే కదా.
గోపాల కృష్ణ రావు గారు చెప్పిన సాలూరి గాడిదల మీది పద్యం కూడా చూడండి మరి ..
గాడిద సాలూరు విడచి
ఏడకొ పోయేనటంచు నెంచకు బ్రదరూ
ఏడకు పోలే దదియును
ఈడనె పాల్టిక్సులోన ఎదిగెను మంత్రై!!
వొకప్పుడు సాలూరులో గాడిదలు ఎక్కువగా ఉండేవిట.అవన్నీ ఎక్కడకి పోయాయి చెప్మా ! అని బెంగ పడే పని లేదుట. అవన్నీ మంత్రులై భాగ్య నగరానికి పోయేయిట.
అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.
గోపాల కృష్ణ రావు గారు చెప్పిన సాలూరి గాడిదల మీది పద్యం కూడా చూడండి మరి ..
గాడిద సాలూరు విడచి
ఏడకొ పోయేనటంచు నెంచకు బ్రదరూ
ఏడకు పోలే దదియును
ఈడనె పాల్టిక్సులోన ఎదిగెను మంత్రై!!
వొకప్పుడు సాలూరులో గాడిదలు ఎక్కువగా ఉండేవిట.అవన్నీ ఎక్కడకి పోయాయి చెప్మా ! అని బెంగ పడే పని లేదుట. అవన్నీ మంత్రులై భాగ్య నగరానికి పోయేయిట.
అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.
ముట్నూరు కృష్ణారావు పంతులు గారి మనుమరాలు వోసారి తాత గారితో ముచ్చటలాడుతూ ‘‘ తాతా ! మీ బందరులో గాడిదలు ఎక్కవే సుమండీ !’’ అందిట. దానికాయన‘‘ అవునమ్మ, ఇక్కడి గాడిదలు చాల వన్నట్టు పొరుగూరి గాడిదలు కూడా వచ్చి పోతుంటాయి !’’ అని వో చురక వేసారుట !
అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు కాంతం కథలలో కాంపోజిషను పుస్తకాల దొంతర పట్టు కెళుతున్న మేష్టరు గారితో ‘‘ ఏమిటి మాష్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారూ ?!’’ అని పరాచికాలాడ బోయేడుట. దానికాయన వెంటనే ‘‘ అబ్బీ !ఇవి 40 గాడిదల బరువురా !’’ అని చురక వేసి నోరు మూయించేరుట. డవాలా బంట్రోతులకి మల్లె పాపం, మేష్టర్లకీ, కోర్టు కాగితాల కవిలె కట్టలు మోసుకెళ్ళే లాయర్లకీ ... యిలా .. కొన్ని వృత్తుల వారికి ఈ గాడిద బరువులు మోయడం విధాయకమే మరి. కదా !
అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు కాంతం కథలలో కాంపోజిషను పుస్తకాల దొంతర పట్టు కెళుతున్న మేష్టరు గారితో ‘‘ ఏమిటి మాష్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారూ ?!’’ అని పరాచికాలాడ బోయేడుట. దానికాయన వెంటనే ‘‘ అబ్బీ !ఇవి 40 గాడిదల బరువురా !’’ అని చురక వేసి నోరు మూయించేరుట. డవాలా బంట్రోతులకి మల్లె పాపం, మేష్టర్లకీ, కోర్టు కాగితాల కవిలె కట్టలు మోసుకెళ్ళే లాయర్లకీ ... యిలా .. కొన్ని వృత్తుల వారికి ఈ గాడిద బరువులు మోయడం విధాయకమే మరి. కదా !
కవి
సమ్మేళనాలలో పాత మాటల మూటలతో నానా చెత్తా మోసుకొని వచ్చి ఆహూతులను
చచ్చినట్టు వినేలా చేసే కవులూ , ప్రజానీకాన్ని అడ్డగాడిదల్లా అడ్డంగా
మోసగించి, దొరికినంతా దోచుకు తినే రాజకీయ ఖరనాయకులూ, వారికి కొమ్ము కాచే
కొన్ని పత్రికల వాళ్ళూ, , టీవీల వాళ్ళూ , కుక్కలనీ, పిల్లులనీ, గాడిదలనీ
నానా చెత్తా కుమ్మరించే కథా మంజరి బ్లాగరూ, తన చుట్టూ జరిగే అన్న్యాయాన్ని
ఎదిరించే సత్తా లేని వాళ్ళూ, ఆడవాళ్ళను కాల్చుకు తినే వాళ్ళూ ,లంచాలు మేసే వాళ్ళూ... వీళ్ళంతా
గాడిదలు ... కాదేమో, అడ్డ గాడిదలు. కదా మరి.
ఈ
టపా తమ మీద పెట్టిన కథా మంజరి బ్లాగరుకి గాడిదలు అంతర్జాతీయ గార్ధభ మహా
సభ పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానించి ’’ దడిగాడువానసిరా ’ అనే బిరుదు
ప్రదానం చేయ బోతున్నాయని ఒక (అ) విశ్వసనీయమైన సమాచారం వల్ల తెలుస్తోంది.
పిల్లుల గురించి మరోసారి. ఇక శలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి