రజక కవాటముల్ రహి తప్పి యుండుట
కేమి వొ దాని నెఱుగ వలయు
ఇల్లును, పామును హీనమైయుండుట
కేమి హేతువొ నెఱుగ వలయు
పాలిచ్చు పశువును, పక్షియు హీనమై
యుండుట యేమియోఎఱుగ వలయు
సస్యంబు, కుమ్మరి సంతోష వర్జమై
యేమిటనుండునో యెఱుగ వలయు
దాని యర్ధంబు చెప్పిన దేశికులకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పు తోడ
ఈ కథా మంజరిం గాంచు మీకు నేను
విన్నవించెద కారణాలెన్నమనుచు !!
పద్యం నాలుగు చరణాలలోనూ వరుసగా నాలుగు ప్రశ్నలు కవి సంధించేడు ...
వాటికి జవాబులు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి !!
నాలుగు పాదాలలో కవి వేసిన ప్రశ్నలకి జవాబులు వరుసగా :
౧. ఉతక లేక
౨. కప్ప లేక
౩.చేప లేక
౪. వాన లేక
- ఉతక = అడ్డు గడియ
1 కామెంట్:
చక్కని పద్యాన్ని పాఠకునకందించావు మిత్రమా!
ఐతే సమాధానలను కామెంటుద్వారా నీవే పోష్ట్ చేస్తే ఈ లోగా వ్రాసే వారికి అవకాశమిచ్చినట్టౌతుంది కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి