16, డిసెంబర్ 2009, బుధవారం

దశావతార వర్ణన


మన కవులు ప్రతిభావంతమైనవిచిత్ర కల్పనలు చాలా చేసారు.
ఈ క్రింది పద్యంలో కవి దశావతార వర్ణన ఎంత గొప్పగా చేసాడు. చూడండి :

సలిల విహారులిద్దరును, సంతత కానన చారులిద్దరున్
వెలయగ విప్రులిద్దరును, వీర పరాక్రమశాలులిద్దరున్
పొలతుక డాయు వాడొకడు, భూమి చరించెడు వాడు నొక్కడున్
చెలువుగ మీ కభీష్టములు సిద్ధి ఘటించురనంత కాలమున్.

వివరణ మీ సౌకర్యం కోసం ఈ క్రింద పొందు పరిచి ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేయండి. కాదంటే క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి.

సలిల విహారులు = మత్స్య,కూర్మావతారాలు
కానన చారులు = వరాహ, నారసింహావతారాలు
విప్రులు = వామన, పరశురామావతారాలు
పరాక్రమశాలురు = శ్రీరామ, క్రిష్ణులు
పొలతుక డాయు వాడు = బుద్ధుడు
భూమి చరించు వాడు = కల్కి అవతారం

3 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

chaalaa mamchi padyam choopaaru maaster gaaru .dhanyavaadamulu

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

చక్కని పద్యాలు మళ్ళీ గుర్తుకుతెస్తున్నందుకు కృతజ్ఞతలు.

కొత్త పాళీ చెప్పారు...

పద్యం చమత్కారం బావుంది కానీ మాష్టారూ, శ్లేష అంటే, ఒక పదానికి ఒకటికంటే ఎక్కువ అర్ధాలు ఉంటే, ఆ అర్ధాలన్నీ అన్వయించేట్టుగా చమత్కరించడం అని చదువుకున్నట్టు గుర్తు. పదో తరగతిలో బట్టీ కొట్టిన ఉదహారణ "రాజు కువలయానందకరుడు". ప్రభువు భూమండలానికి ఆనందం కలగజేసే వాడు, చంద్రుడు కలువకి ఆనందం కలజేసేవాడు అని రెండు అర్ధాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి