22, డిసెంబర్ 2009, మంగళవారం

చుక్కలూ, చిక్కులూ ....

ఒక తమాషా పద్యాన్ని మీతో పంచుకుంటాను ...

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బట్టి, నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్ !!


ఇందులో చమత్కారమంతా కవి గారు కొన్ని నక్షత్రాల పేర్లను ఉపయోగించు కోవడంలోనే ఉంది.

ఆ నక్షత్రాలు యివీ : . ఉత్తర .భరణి . మూల హస్త

వీటి ఆధారంగా పద్యంలోని కవి చమత్కారాన్ని కనుక్కోండి చూద్దాం !!

ఇది పద్మ వ్యూహ ఘట్టానికి చెందిన సందర్భం. ఈ చిన్న క్లూతో మీ శోధన మొదలెట్టండి ...








చుక్కల చిక్కుల పేరిట
చిక్కని పద్యము నొసగఁగ చింతా వారూ !
చక్కగ వివరించిరి కద !
మిక్కిలిగా నాదరింతు మదిలో మిమ్మున్. !

2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

ఉత్తర భరణిని చేఁ గొని,
యత్తఱి యభిమన్యుఁ బిలిచె నాశగ తనతో
నెత్తఱి మూలకు రమ్మని
మత్తుగ చెయి వేసి పైన. మహనీయుండా!

నక్షత్ర ప్రభుడు = అభిజిత్ = అభిమన్యుడు.
చాలా చక్కని చమత్కార కందాన్నందంగా అందించారు.
ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు. జోగా రావు గారు. చాలా చక్కని పద్యం చెప్పారు.ఇప్పుడే మీ కధా మంజరి లొ అన్నీ చదువుతున్నాను.ఎంత బాగున్నాయో .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి