క్షుత్షామో2పి ,జరాకృశో2పి, శిధాలం ప్రాయో2పి, కష్టా ధశా
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ
గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి జీర్ణ తృణంబు మేయునే?
తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు.
మరి, కుక్క సంగతి చూడండి ...
లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుక్తే
వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్ర శుం
డాలము శాలితండులగుడంబులు చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్
యజమాని పడేసే ఎంగిలి కూడు కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే
కదా ?
యజమాని ఎదుట తోక ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల
కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని వికార పోకడలయినా, పోతుంది. దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.
సింహం సింహమే ! ఏనుగు ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!
6 కామెంట్‌లు:
సోదరా! అకార ప్రశ్లేష వ్రాసేటప్పుడు దానికి గుర్తుగా உ ను వ్రాయడం సముచితం. కానినాడు ఆంగ్లంలో Z వాడడం తత్తుల్యంగా ఉంటుందని అనిపిస్తోంది.
సేవ్ చేసుకో. ( உ )
ఇది కాపీ చేసి పేష్ట్ చెయ్యి అవసరమైన చోట.
సోదరా! అకార ప్రశ్లేష వ్రాసేటప్పుడు దానికి గుర్తుగా உ ను వ్రాయడం సముచితం. కానినాడు ఆంగ్లంలో Z వాడడం తత్తుల్యంగా ఉంటుందని అనిపిస్తోంది.
సేవ్ చేసుకో. ( உ )
ఇది కాపీ చేసి పేష్ట్ చెయ్యి అవసరమైన చోట.
"సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహాగ్రేసర భాసమానమగు" - మంచి సమాసం వేశారు స్వామీ! ఇందులో "భాసమానమగు" కి, "సాగ్రహాగ్రేసర" కి మధ్య సంబంధం నా మట్టిబుర్రకి అర్థం కాలేదు. దయచేసి వివరించగలరు.
"లాంగూల చాలనం" అన్నది భర్తృహరిసుభాషితం కదా? ఆయన పేరు కూడా బ్లాగులో చెప్తే మా బోటి పిల్లకాయలు తెలుసుకుంటారు. చాలా చక్కని అనువాదం వ్రాశారు!
మిత్రమా౧ నీ యీ ఏనుగు ఏనుగే పీనుగు పీనుగే అనే టపాను చూచిన నాకొకటి గుర్తొచ్చింది.
నేను 1974లో గ్రేడ్ వన్ తెలుగు పండిట్ గా జాయినయినక్రొత్తలోనే ఆకడి ఓక తెలుఉ మాష్టారు నన్ను గూర్చి కొంచెం తక్కువగా మాటాడారని తెలిసి టెన్తువాళ్ళకు ఛందస్సు చెప్పుతూ ఒక పద్యం వ్రాసాను.
గీ:-
ఏనుగెప్పుడు యేనుగే యెంచి చూడ.
పీనుగెప్పుడు పీనుగే. పిచ్చిగాను
ఏనుగును నేను ఏనుగే పీనుగంచు
ఏనుగన్నంత మాత్రాన పీనుగగునె?
అనిబోర్డ్ పై వ్రాసాను.
అక్కడున్న విద్యార్థులికి; ఆ తెలుగు మాష్టారికీ కూడ అర్థమైంది నేనదెందుకు వ్రాసానో. అంతే అప్పటినుంచీ నాకు శత్రుబాధ తగ్గింది.
చక్కని శ్లోకాలతో అద్భుతంగా వ్రాస్తున్న నిన్ను మనసారా అభినందిస్తున్నాను.
చక్కని తెలుగు బ్లాగు ఇన్‌బాక్స్ X
జవాబివ్వు
Sandeep P కి నాకు
వివరాలను చూపించు 11:39 pm (19 గంటల క్రితం)
చూచితి నేడీదినమున
మాచక్కని బ్లాగు వొకటి, మచ్చుకు మీకున్
ఈ చిటి యత్నము నిస్సం
కోచంబుగ నచ్చునండి, కోరి చదువుమా!
http://pantulajogarao.blogspot.com/
Sandeep
జవాబివ్వు
chinta vijaya కి Sandeep
వివరాలను చూపించు 12:36 am (18 గంటల క్రితం)
సందీప్!
నేడీదినమే. కావున
కూడదు నేడీ దినమన! గుర్తుగ కనుమా!
నేడన్నను సరిపోవును.
చూడగ కందంబు నీకు శోభను కూర్చెన్.
మంజీర నాదమె కథా
మంజరిలో వినగ నగును మధురాంశములన్!
రంజిలు నా మిత్రు డతఁడు
పం.జోగారావు .గొప్ప పండితుడయ్యా!
28 ఏప్రిల్ 2010 11:39 pm న, Sandeep P
చింతా.రామకృష్ణారావు.
http://andhraamrutham.blogspot.com/
కామెంట్‌ను పోస్ట్ చేయండి