11, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

హిత ‘ వచనమ్’ . కామ్ లో భారతేతి హాసంలో చెప్ప బడిన హిత వచనాలను ఒక చోట క్రోడీకరించి వచనంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కదా ? ఆ క్రమం లో , ఇది, శ్రీమదాంధ్ర మహా భారతం, నన్నయ కృతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం నుండి ....

జనమే జయునితో సరమ పలికిన పలుకులు:

ఓ రాజా ! ఈ పని తగినది. ఈ పని తగనిది అని మనస్సులో ఆలోచించుకుని చేయాలి. అలా కాకుండా బీద వారికీ, అశక్తులకీ , మంచి వారికీ కావాలని అపకారాలు చేసే నీతి రహితులకు అకారణంగానే ఆపదలు వస్తూ ఉంటాయి

ఉదంకోపాఖ్యానం లోని ‘ నిండు మనంబు నవ్య నవనీత సమానము ...’’ అనే పద్యం చాల ప్రసిద్ధమైనది. పౌష్య మహా రాజు శాపమిచ్చిన పిదప ఉదంకునితో పలికిన పలుకులు ...

ఓ మహా మునీ ! అప్పుడే తీసిన వెన్నలా మిక్కిలి మృదువుగా ఉంటుంది బ్రాహ్మణులు మనసు. మరి వారి మాట మాత్రం భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. ఇది నిజం. మనసూ, మాట రాజులలో దీనికి విరుద్ధంగా ఉంటాయి. అంటే, రాజులలో మనసు వజ్రతుల్యంగా ఉంటుంది. మాట నవనీత సమానంగా ఉంటుంది. కనుక, బ్రాహ్మణుడు శాపమిస్తే, తరిగి ఉపసంహరించ గలుగుతాడు. రాజు ఎంత శాంత స్వభావం కలవాడయినా, యిచ్చిన శాపాన్ని ఉపసంహరించ లేడు సుమా !

భృగు మహర్షి తో అగ్ని దేవుడు పలికినది ...

తనకు తెలిసిన విషయాన్ని ఇతరు డెవరయినా ‘ఇది ఎలా జరిగిందో చెప్పు ’ అని అడిగితే చెప్పడానికి నిరాకరించే వాడు ఘోరమయిన నరక కూపంలో పడతాడు. అలాగే, సత్యం చెప్పని వాడు కూడ నరకానబడతాడు.


మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో ...

స్వస్తి.


5 కామెంట్‌లు:

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

http://sreemadaandhramahaabharatam.blogspot.com/search/label/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81
దయతో పైలింకునోసారి చూడగలరు.

Wit Real చెప్పారు...

సరమ ఒక కుక్క. ఆ కుక్క పిల్ల ని జనమేజేయుని తమ్ముళ్ళు అదలగొడతారు.

ఈ పద్యాన్ని కుక్క చేత రాజుకి చెప్పించడంలో, "చీమకైనా అపకారం తలపెట్టకూడదు" అనే మంచి భావాన్ని చెప్పించారు భారత కర్త.

మంచి పద్యాన్ని గుర్తు చేసినందుకు, మళ్ళీ ధన్యవాదాలు

పంతుల జోగారావు చెప్పారు...

ధన్యవాదాలండీ. కేవలం సరళ వచనంలో హిత వచనాలు రాయాలనే ఉద్దేశంతో కథా సందర్భాల జోలికి వెళ్ళడం లేదు. అందుకే నా ఇది వరకటి టపాలలో లాగా ఇందులో ఎంత నచ్చినదయినా, ఒక్క పద్యాన్ని కూడా కోట్ చేయడం లేదు నేను. గమనించే ఉంటారు. మరో మారు ధన్యవాదాలు.

కమనీయం చెప్పారు...

Andaalakandapadyapu chandammu kanti memu sagimpumu nee vindagu kavitaa rachananamandaanandammu nosagu maakika Krishnaa Vaadyammulalo veenayu khaadyammlo jilebi kadu madhurammai madyammulalo winunu padyammulalona kandapadyamu ghanamou. please convey theese poems to Gopalakrishna.

కమనీయం చెప్పారు...

dearJogarao,Kumaravyasa bharatakathamanjari isa greatKannada kavyam.That is why Iam seeing alot of info.about it whenever Iopen your blog.Same my kamaneeyam as thereare lot of letters about afamous film song ;kalyanamkamaneeyam.

కామెంట్‌ను పోస్ట్ చేయండి