ఈ రోజు టపా ఏం పెడదామా ? అని ఆలోచిస్తూ, ఒక చక్కని మధుర సంగీతాన్ని మిత్రులతో పంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అయితే, బ్లాగులో అందరూ ఆడియోని ఎలా పెడుతున్నారో తెలిసింది కాదు. DivShare ప్రయత్నించాను. సంగీతాన్ని up load చేయడం వరకూ చేయ గలిగాను. తర్వాత దానిని నా బ్లాగులో ఎలా పెట్టాలో అర్ధం కాక, జ్యోతి గారిని అడిగాను. ఆమె చెప్పిన విధంగా చేసాను. ఆమెకి ధన్యవాదాలు చెబుతూ ....
సరే, యిదంతా సొంత ఘోష. దాన్నలా ఉంచి మీరూ ఈ మధుర నాద స్వరాన్ని ఆస్వాదించండి.
సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తన ద్వయం
ఏక మాపాత మధరం , అన్యదాలోచనామృతమ్
అని పెద్దలు చెప్పారు కదా. సాహితీ సంబంధమయిన నా బ్లాగులో నా ముచ్చట కొద్దీ తొలిసారిగా చక్కని సంగీతాన్ని అందించే ప్రయత్నమిది ....
1 కామెంట్:
సార సరస రస శేఖర!
శ్రీ రహి రమణీయభావ చిద్రూపముగా
గారవమొప్పగ నొప్పెను.
శ్రీ రహినాదముగ చేర్చి చెలగితె! జోగా!
(ఛురికా బంధము)
స శ్రీ నుప్పెనొ గప్పమొ వర
సారసశేఖ ర మణీయభావచిద్రూపము గా
స హినాదముగచేర్చిచెలగితె జో
మిత్రమా! అభినందనలు. ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి