గుడి కూలును, నుయి పూడును వడి నీటను చెఱువు తెగును, వనమును ఖిలమౌ చెడనిది పద్యమె సుమ్మీ కుడి యెడమల నరసి చూడ గువ్వల చెన్నా !!

గురువారం 12 జనవరి 2012

నేను, చా.సో, మా విజయ నగరం ... ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం !


విజయ నగరం మడి కట్టుకొన్న పెద్ద ముత్తయిదువులా ఉంటుంది.

కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించే అమ్మలా ఉంటుంది.

చిటికెన వేలు పట్టుకుని బజారు వీధుల్లో వింతలు చూపించే నాన్నలా ఉంటుంది.

ఆ ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం ఎలా ఉంటుందంటే,

నేను,చా.సో, మా విజయ నగరం అనే జగన్నాథ శర్మ గారి వ్యాసంలా ఉంటుంది.

ఆ వ్యాసం మీ కోసం. చూడండి:







నవ్య వార పత్రిక సంపాదకులు ఎ.ఎన్. జగన్నాథ శర్మ ఈ నెల 17 వ తేదీన విజయ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన చా.సో స్ఫూర్తి అవార్డు స్వీకరించ బోతున్నారు. ఆ సందర్భంగా జగన్నాథ శర్మ ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో తెలుగు కథకు తూర్పు దిక్కు శ్రీ చాగంటి సోమయాజులు ( చా.సో) గారితో తన చిన్ననాటి అనుభవాలూ, ఙ్ఞాపకాలూ హృదయంగమంగా కలబోసుకున్నారు. ఆ వ్యాసమే యిది.

వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ మరింత చక్కగా చదవొచ్చును :

అవార్డు కార్యక్రమం గురించిన ఇతర వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.


Posted by Picasa

2 వ్యాఖ్యలు:

shyam చెప్పారు...

బాగుంది.చాసోగారి గురించి బాగా రాసేరు.శర్మగారికి శుభాకంక్షలు. ఆ అనుభవాలేసంవత్సరాలవో కూడా రాస్తే బాగుండేది.మీరూ రాస్తే బాగుంటుంది.

శ్యాం

ఆ.సౌమ్య చెప్పారు...

అవును మన ఇజినారాన్ని మన ఇజీనారంతోనే పోల్చగలం. ఆనందంతో, ఆవేశంతో కళ్ళు చెమర్చాయండీ ఆ వ్యాసం చదివాక. చాసో స్ఫూర్తి అవార్డ్ శర్మగారికి ఇస్తున్నారని మొన్ననే తెలిసింది. చాలా సంతోషం. ఈ వ్యాసంతో ఒక్కసారి నాదైన ప్రపంచానికి తీసుకుని వెళ్ళారు. ఇది ఇక్కడ పెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు!