పక్షులు
మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.
మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల
దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?
సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు
దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని
తెలిసిందే
కదా ?
పావురాల వేటతో పడరాని పాట్లు పడిన
సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ...
పక్షుల
గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్రస్తుతానికి మన టపా పక్షులలో ఒక్క కాకికి
మాత్రమే పరిమితం చేసుకుందాం.
పక్షులలో కాకికి మాత్రం కొంత చిన్న స్థానం ఉన్నట్టు తోస్తోంది. ఆబ్దీకాలప్పుడు కాకులను
కొంత మర్యాదగా చూడడం జరిగినా, వాటి పట్ల ఎవరికీ అంత సదభిప్రయం ఉన్నట్టు
తోచదు. కాకులలో మాల కాకి, బొంత కాకి ,
నీరుకాకి ..ఇలా చాలా రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకులు కోకిల గుడ్లను
పొదిగి పెద్ద చేస్తాయిట. కనుక కోకిలకు కాకి పెంపుడు అని పేరు ఉంది. ఉచ్ఛిష్ఠం
తినే కాకి పితరుడెట్టౌనురా అని ఈసడించు కున్న వారూ లేక పో లేదు. కాకమ్మ
కబుర్లు , కాకి పిల్ల కాకికి ముద్దు , పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ కాకి మూక,
కాకిలా కలకాలం బతికే కంటే, హంసలా బతకడం
మేలు ...కాకీ, కోకిలా రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వసతం కాలం వచ్చే సరికి ఏది కాకో,
ఏది కోకిలో తెలిసి పోతుంది , కాకి గోల ఏకాకి,, లోకులు పలుగాకులు,... ...లాంటి సామెతలు,
మాటలు, శ్లోకాలూ కూడా వాటిని ఈసడంచేవే
కదా.
మా చిన్నప్పుడు బడిలో ఒక అను ప్రాసకి ఉదాహరణగా కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక
కేకికా ? అని చెప్పు కునే వాళ్ళం
మా చిన్నప్పుడు బడిలో ఒక అను ప్రాసకి ఉదాహరణగా కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక
కేకికా ? అని చెప్పు కునే వాళ్ళం
కాకుల ప్రవర్తన
కూడా అటాగే ఉండడం వల్ల కాబోలు వాటి పట్ల మన
నిరాదరణకు కారణం కానోపు.
కాకి
బంగారానికీ కాకులకీ సంబంధం లేదు. అలాగే చికాకులకీ కాకులకీ సంబంధం అంటగ్గ కూడదు.
కాకితో
కబురు చేస్తే రానా ? అనే మాటను బట్టి కాకులు కూడా కొరియర్ సర్వీసు చేస్తాయేమో అను
కోవాలి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని మన వాళ్ళు అను కోవడం కద్దు.
అదలా
ఉంచితే కాకుల మీద కలిగిన అపార మయిన సానుభూతితో వాటితో ఇంటర్వ్యూ చేదామనిపించింది.
ఇటీవల మేము యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్ళి నప్పుడు అక్కడి కాకులతో కొంత
సంభాషించేను. నేనడిగిన ప్రశ్నలకు చక్కని
సమాధానా లిచ్చేయి. మా సంభాషణ జరిగిన తీరు వివరించే ముందు, కాస్త యాగంటి గురించి చెబుతాను.
ఈ పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లి మండలం లోని ఎర్ర మల కొండల్లో ఉంది. ఉమా మహేశ్వరులు ఏక శిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు చేస్తూ వచ్చి, ఇక్కడి అందాలకు పరవశించి పోయి , ఇక్కడ వేంకేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలను కున్నాడుట. తీరా ఆ విగ్రహానికి కుడి కాలి బొటన వేలు విరిగి పోవడంతో విగ్రహ ప్రతిష్ఠకు ఆటంకం కలిగిం.ది. దాంతో దానిని అక్కడే ఒక గుహలో ఉంచి, ముని తపస్సు చేసాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ముని కోరిక మేరకు అక్కడ ఏక శిలా రూపంలో వెలిసారుట. అప్పుడు ముని, వారిని చూసిన ఆనందందలో యేన్ గంటిన్ ... యేన్ నేను కంటిన్... చూసాను అన్నాడుట. అదే కాల క్రమంలో యాగంటిగా మారిందిట. యాగంటి తప్పకుండా చూడ వలసిన ప్రదేశం. అన్ని అందాలు ఒక్క చోట చూసి పరవశించి పోతాం. . సహజ సిద్ధంగా ఉన్న గుహలు, కోనేరులు చాలా బావుంటాయి ...

ఇంతటి అందమైన చోట, పవిత్రమైన చోట కాకులతో నా సంభాషణా క్రమం బెట్టి దనినిన
...
నేను : ఆకాశాన్నంటిన ధరలు దిగి వస్తాయనే మాటలు నిజమవుతాయి ?
కాకులు : కావు ... కావు
నేను : మన రాజకీయాలు బాగు పడతాయనే ఆశలు నెర వేరేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : మన చదువులు మనకి మంచి నడవడికను నేర్పేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : చలామణీలో ఉన్న నోట్లన్నీ అసలైనవే నంటారా ?
కాకులు : కావు ... కావు
నేను : కార్పొరేటు ఆసు పత్రులలో చిన్న రోగాలకు సైతం చేసే టెస్టు లన్నీ నిజానికి
అవసర మైనవే నంటారా ?
కాకులు : కావు... కావు
నేను : తెలుగు సినిమా లన్నీ తెలుగు సినిమాలే నంటారా
కాకులు : కావు ... కావు
నేను : మా చిన్నప్పుడు మొదలైన తెలుగు టి.వి సీరియళ్ళు త్వరలో ముగింపు
కొచ్చేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : కథా మంజరి బ్లాగు టపా లన్నీ సీరియస్ గా రాసినవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : ఇంతకీ ఈ యాగంటి కాకుల కథలో చెప్పిన వన్నీ నిజాలేనా ?
కాకులు : కావు ... కావు
కాకులు చెప్పింది నిజమే.
ఎందుకంటే అస్సలు యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు.
దాని కొక ఐతిహ్యం చెబుతారు. అగస్త్యుడు తపస్సు చేసు కుంటూ ఉంటే, కాకా
సురుడనే వాడు లెక్క లేనన్ని కాకులతో వచ్చి
గోల చేసాడుట. దానితో మునికి తపో భంగమయిందిట. అగస్త్యుడు కోపించి ఇక నుండీ యాగంటి
పుణ్య క్షేత్రంలో ఒక్క కాకి కూడా ఉండకుండు గాక అని శపించాడుట.
అందు చేత, యాగంటి కాకుల కథ అంటూ నేను రాసిన దంతా ఏదో సరదాకి రాసినదే తప్ప
మరోటి కాదు. ఇందులో ఏవీ నిజాలు కానే కావు
... కావు ... కావు.
7 కామెంట్‌లు:
baagu...baagu.
kiran
చాలా బావుంది...
నేను కూడా ఈ మధ్యనే యాగంటి వెళ్ళాను. నిజంగా అక్కడి ప్రకృతి సౌందర్యా నికి పరవశించి పోయాను.
యాగంటి ఎంత బాగుంటుందో మీరు పరిచయం చేసిన తీరు కూడా అంతే బాగుంది.
EE YAGANTI ELA VELLAALI ? NEAREST RAILWAY STATION YENTI?
kaki javabulu bagunnaai..asalu ee yaganti ki ela vellaali? nearest railway station enti?
CHALA BAGUNDI>
కామెంట్‌ను పోస్ట్ చేయండి