ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. ) అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి ) పక్షులూ జంతువుల భాష నేర్చు కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.
పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :
నేను : మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా
చెప్పవూ ?
మేక : మే
నేను : ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు మేలు చేసేవే నంటావా ?
కాకి : కావు .. కావు
నేను : పిచ్చుకా ! పిచ్చుకా ! గల గల , వలవల, గడగడ లాంటి జంట పదం మరోటి చెప్పు చూద్దాం !
పిచ్చుక : కిచ కిచ
నేను : ఓ శునక రాజమా ! భ అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది తెలుసా ?కుక్క : (ఓస్ ! ఆ పాటి తెలియదనుకున్నావా ? ... ఇది స్వగతం కానోపు ) భౌ !
నేను : ఓ సన్నగమా ! నీకు తెలిసిన ఓ మాజీ అమెరికా ప్రెసిడెంటు పేరు చెప్పు ?
పాము : బుస్ !
( బుష్ అనే దానికి ఇది వికృతి కావచ్చు ... )
నేను : ఓ పులి రాజా ! ప్రపంచ తెలుగు మహా సభలు ఎట్లు జరిగినవి ?
పులి : గాండ్రు
( పులి రాజు ఇటీవలే స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు వెళ్తూ ఉండడం చేత కొంచెం తడబడినట్టుంది. ఎక్కడ కరారావుడు పెట్టాలో తెలియ లేదు పాపం.)
నేను : ధేనువా ! పార్వతికి గల పర్యాయ పదం ఒకటి చెప్ప గలవా ?
ఆవు : అంబ !
నేను : కరిరాజా ! నెయ్యిని హిందీలో ఏమందురు ?
ఏనుగు : ఘీఁ
నేను : నెమలీ ! నెమలీ ! ఇలాంటి టపాలు రాస్తున్నాడు, ఈ కథా మంజరి గాడికి ఏమయింది ?
నెమలి : క్రాక్ !
.చివరగా ఓ విషయం. నరుడు ద్విపాద జంతువు కనుక అతనితో మాట్లాడితే అందరికీ జంతు భాష వచ్చి
నట్టే కదా !!
2 కామెంట్‌లు:
గాండ్రు గ్రాండ్ గా వుంది. పులిరాజు కరెస్ట్ గా చెప్పాడు.
హిమాలయాలకు వెళ్ళకుండానే ఈ పోస్ట్ చూసేసి ఆ విద్య నేర్చేసుకున్నామండీ :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి