అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
మీ, కథా మంజరి.
ఏటెస్. ఇనాయక పూజ సెయ్యాల .. అది
సెయ్యాల. ఇది సెయ్యాల అంటూ తెగ పుర్రాకులు పడి పోతన్నావ్ ! ఏటి ? ఇనాయకుడు మనోడే
కదా ? ఆ సామి కాడ మనకి బయమేల ? మన జత గాడే
కద? మిగతా బగమంతులయితే మన ఇనాయకుడంత ఆస్సెంగా ఉండరు. మిగతా దేవుల్లందరికీ ఇనాయకుడి కున్నన్ని రకరకాల
ఏసికాల్లో బొమ్మలుండవు. మంచోడు. మనవంటే సేన పేఁవ. మనకి ఏ కప్టమూ రాకుండా సూత్తాడు.
ఆ బొజ్జ గణపయ్య ఉన్నాడంటే, మనకి కొండంత బరవాసా. కాదేటి ?అసలాతని ఆకారమే సూడూ ... బలేగుంటాది కద
? పెద్ద బొజ్జ. ఏనుగు తలకాయ. పొట్టోడే
..కానీ సేన గట్టోడు. ఆ ఆకారం సూసినాకే కదా మన సెందురుడు మాయ్య పగలబడి నవ్వీసినాడు ? తర్వాత ఏటయినదో తెలసిందే కదా ....
మిగతా దేవుల్లందరికంటె ఇనాయకుడి తోనే మనకి
సావాస మెక్కువ. చనువెక్కువ. ఇనాయకుడిని సొంత
మనిసిగానే సూత్తాం కానీ పరాయోడినాగా .. ఎక్కడో దేవ నోకంలో ఉండే వోడిగా సూడం.
ఎందుకంటే ఆ దేవుడు మనోడు. మన నేస్తం !
అందికే ఇనాయకుడంతే మనకి కొండంత బక్తి
ఉంటాది కానీ, పిసరంత బయ్యం ఉండదు. మన బగమంతుడికి మనఁవేల బయపడాల ?
అందికే మన సరదా కొద్దీ ఇనాయక సామికి రకరకాల ఏసికాలేసి
ముచ్చట పడుతుంటాం కద ?
సేతికి కత్తులూ కటార్లూ యిచ్చి, ఎదవల్ని
బెదిరిస్తాం ...
కిరికెట్టు ఆడిస్తాం ..
కంపూటరు ల్యాప్ టాప్ తో ఐటెక్కు ఇనాయకుడిని సేస్తాం
పేంటూ షర్టూ తొడిగించి, కళ్ళ జోడెట్టి, టిప్పు టాప్పుుగా సినేమా హీరో నాగా తయారు చేస్తాం ..
బలే బాగా ఏకసను సేయిస్తాం ... సోజులిప్పిత్తాం ..
ఇనాయకుడి మీద లెక్క లేనన్ని జోకులేస్తాం.. కార్టూను లేస్తాం ...దయ గల సామి ... ఎన్ని ఎకసెక్కాలాడినా ఏటనుకోడు. బక్తుల బత్తికి పడి పడి నవ్వీసి, వరాలిచ్చేత్తాడు
రాజ మవులీ మాయ్య ఈగ సినిమా తీస్సి ఎండి తెరను బద్దలకొట్టీ తలికి మనం ఈగ ఇనాయకుడిని సేసుకోనేదా ?
ఇనాయకుడి సేత కారు నడిపిస్తాం, బైకు నడిపిస్తాం ..ఇమానాలెక్కిస్తాం ..సెల్ ఫోనులో మాట్టాడిస్తాం ... ఇన్నేల ? మనోడు. మనసంగతికాడు. మనకి వరాలిచ్చే జతగాడు. ఎన్ని ఎకసెక్కాలాడినా ఏటనుకోడు.
ఇదేట్రా , ఈ కదా మంజరి బ్లాగరు గాడికి మతి కాని పోనాదేటి ? ఇనాయకుడి మీద మనోడే నంటూ ఇలగిలాగ రాస్సి నాడు. కల్లు పోతయ్యి !! అనుకుంతున్నారేటి ?
మా పంతులు గోరు సెస్సేరు, ఇదంతా అదేదో యాజ నిందట (వ్యాజ నింద) లెండి . మరేటి పికర్నేదు. మరి చెలవా ? ఇనాయక పూజ సేసు కోవాల !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి