అప్పుడు ముళ్ళ పూడి వెళ్ళి పోయేక, ఇప్పుడు బాపూ కూడా వెళ్ళి పోయేరు.
మనకింక మిగిలిందేమిటి ? బాపూ గీసిన బొమ్మలూ, వారు తీసిన సినిమాలూనూ ...
తెలుగునాట కథలూ, నవలలూ రాసే రచయిత లందరికీ తమ రచనలకీ, పుస్తకాలకి ముఖ చిత్రాలుగానూ శ్రీ బాపూ గారు బొమ్మలు వేస్తే బావుణ్ణు అనేది ఒక తీయని కోరిక ... కొండొకచో దురదృష్టవశాన తీరని కోరికగా కూడా ఉండిపోతూ ఉంది ...
రచన కన్నా, ఎవరూ ఏమనుకోక పోతే, వో మెట్టు ఎక్కువగా అందమయిన బొమ్మ గీసే ఒడుపు బాపు గారికే చెల్లింది !
నా వరకూ ఆ కోరిక ముచ్చటగా ముమ్మారు తీరింది. ధన్యోస్మి !
ఆ మహా గీతకారునికి అశ్రు నివాళి అర్పిస్తూ ... ఆ మూడు ముచ్చట్లూ మీతో పంచు కునీదా ?
చూడండి ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి