25, జనవరి 2020, శనివారం

రాజు రాజే, బంటు బంటే 01


                                                   


క్షుత్షామో2పి ,జరాకృశో2పి, శిథిలం ప్రాయో2పి, కష్టా ధశా
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ

గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి జీర్ణ తృణంబు మేయునే?


తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు.  సింహం గొప్పతనం చూసాం కదా ; రేపు కుక్క నైచ్యం ఎలాంటిదో చూదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి