26, జనవరి 2020, ఆదివారం

రాజు రాజే, బంటు బంటే 02


                                              


రాజు రాజే, బంటు బంటే   02

నిన్నసింహం ధీరత్వం చూసాం. మరి,  ఇవాళ కుక్క హీనత్వం  చూదాం ...

లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుక్తే

వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్ర శుం
డాలము శాలితండులగుడంబులు చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్

యజమాని పడేసే ఎంగిలి కూడు కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే కదా ?
యజమాని ఎదుట తోక ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని వికార పోకడలయినా, పోతుంది. దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.

సింహం సింహమే ! ఏనుగు ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!

                                     








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి