21, నవంబర్ 2011, సోమవారం

వింటూ చదవండి ... లేదా చదువుతూ వినండి

మా శ్రీమతి స్వయంగా టైపు చేసిన లలితా సహస్ర నామం.

వినండి ! వింటూ చదవండి !! లేదా, వింటూ, చూస్తూ ... చదవండి !!!


ఓం శ్రీలలితాసహస్రనామ స్తోత్రమ్

ధ్యానమ్

అరుణాం కరణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్,

అణిమాదిభిరామృతాంమయయూఖై రహమిత్యేవ విభాయే భవానీమ్.

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీమ్, సర్వాలంకారయుక్తాం

సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాన్తమూర్తిం సకలసురనుతాం

సర్వసంపత్ప్రదాత్రీమ్.


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

శ్రీమాతా శ్రీమహారాఙ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ,

చిదగ్నికుండసంమ్భూతా దేవకార్యసముద్యతా. 1

ఉద్యధ్భానుసహస్రాభా చతుర్భాహుసమన్వితా,

రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా. 2

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రశాయకా,

నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా. 3

చమ్పకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచా,

కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా. 4

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా,

ముఖచంన్ద్రకళంకాభమృగనాభివిశేషకా. 5

వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా.

వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా. 6

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా,

తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా. 7

కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా,

తాటంకయుగళీభూతతపనోడుపమండలా. 8

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా. 9

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా,

కర్పూరవీటికామోదసమాకర్షిద్ధిగంతరా 10

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ,

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా. 11

అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా,

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా. 12

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా,

రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా. 13

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ,

నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయీ. 14

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా,

స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా. 15

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ,

రత్నకింకిణికారమ్యరశనాధామభూషితా. 16

కామేశఙ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా,

మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా. 17

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా,

గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా. 18

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా,

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా. 19

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా,

మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః . 20

సర్వారుణా 2నవద్యాంగీ సర్వాభరణభూషితా,

శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా. 21

సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా,

చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా. 22

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ,

సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ. 23

దేవర్షిగణసంఘాతాస్తూయమానాత్మవైభవా,

భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమనన్వితా. 24

సంపత్కరీ సమారూఢసింధురవ్రజసేవితా,

అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా. 25

చక్రరాజరధారూఢసర్వాయుధాపరిష్కృతా,

గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా. 26

కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా,

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా. 27

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా,

నిత్యా పరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా. 28

భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా,

మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా. 29

విశుక్రప్రాణహరణావారాహీవీర్యనందితా,

కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా. 30

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా,

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ. 31

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః ,

మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా. 32

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా,

బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా. 33

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః ,

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా. 34

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ,

శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ. 35

మూలమంత్రాత్మికా మూలకూటత్రయకలేబరా,

కులామృతైకరసికా కులసంకేతపాలినీ. 36

కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగినీ,

అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా. 37

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంధివిభేధినీ,

మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ. 38

ఆఙ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథివిభేధినీ,

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ. 39

తటిల్లతాసమరుచిష్షట్చక్రోపరిసంస్థితా,

మహాసక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ. 40

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా,

భద్రప్రియా భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాయినీ. 41

భక్తఫ్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా,

శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ. 42

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా,

శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా. 43

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా,

నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా. 44

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా,

నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా. 45

నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వరా,

నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ. 46

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ,

నిర్మమా మమతాహంత్రీ నిష్పాప పాపనాశినీ. 47

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ,

నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ. 48

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ,

నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా. 49

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా,

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా. 50

దుష్ఠదూరా దురాచారశమనీ దోషవర్జితా,

సర్వఙ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా. 51

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా,

సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ. 52

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ,

మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా. 53

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ

మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతిః. 54

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా,

మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరశ్వరీ. 55

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా,

మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా. 56

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ,

మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ. 57

చతుష్షష్ఠ్యుపచారాఢ్యా చతుష్షష్ఠికలామయీ,

మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా. 58

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా,

చారురూపా చారుహాసా చారుచంద్రకలాధరా. 59

చరాచర జగన్నాధా చక్రరాజనికేతనా,

పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా. 60

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ,

చిన్మయీ పరమానందా విఙ్ఙానఘనరూపిణీ. 61

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా,

విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా. 62

సుప్తా ప్రాఙ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా,

సృష్ఠికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ. 63

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,

సదాశివానుగ్రహాదా పంచకృత్యపరాయణా. 64

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ,

పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ. 65

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః ,

సహస్రశీర్షవదనా సహసస్రాక్షీసహస్రపాత్. 66

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ,

నిజాఙ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా. 67

శ్రుతిశీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా,

సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా. 68

పురుషార్ధప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ,

అంబికా2నాధినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా. 69

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా,

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా. 70

రాజరాజార్చితా రాఙ్ఞీ రమ్యా రాజీవలోచనా,

రంజనీ రమణీ రస్యా: రణత్కింకిణిమేఖలా. 71

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా,

రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా. 72

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా,

కల్యాణీ జగతీకందా కరుణారససాగరా. 73

కలావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా,

వరదా వామనయనా వారుణీమదవిహ్వలా. 74

విశ్వాధికా వేదవేద్యా వింద్యాచలనివాసనీ,

విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ. 75

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రఙ్ఞపాలినీ,

క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా. 76

విజయా విమలా వన్ద్యా వందారుజనవత్సలా,

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ. 77

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ,

సంహృతాశేషపాషాండా సదాచారప్రవర్తికా. 78

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా,

తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా. 79

చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ,

స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః . 80

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా,

మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా. 81

కామేశ్వరప్రాణనాడీ కృతఙ్ఞా కామపూజితా,

శృంగారససంపూర్ణా జయా జాలంధరస్థితా. 82

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ,

రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా. 83

సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా,

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా. 84

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ,

నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ. 85

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ,

మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ. 86

వ్యాపినీ వివిధాకారా విద్యా2విద్యా స్వరూపిణీ,

మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ. 87

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః ,

శివదూతీ శివారాధ్యా శివమూర్తిశ్శివంకరీ. 88

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా,

అప్రమేయా స్వప్రకాశా మనోవాచానగోచరా. 89

చిచ్ఛక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా,

గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృందనిషేవితా. 90

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా,

నిస్సీమమహిమా నిత్యయౌవ్వనా మదశాలినీ. 91

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః,

చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా. 92

కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ,

కులకుండాలయా కౌలమార్గతత్పరసేవితా. 93

కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః ,

శాంతిస్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ. 94

తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ,

మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ. 95

సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా,

కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. 96

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థావివర్జితా,

సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ. 97

విశుద్ధ చక్రనిలయా22రక్తవర్ణా త్రిలోచనా,

ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా. 98

పాయసాన్నప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ,

అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ. 99

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా,

దంష్ట్రోజ్జ్వలా2దిక్షమాలాదిధరా రుధిరసంస్థితా. 100

కాళరాత్య్రాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా,

మహావీరేంద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ. 101

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా,

వజ్రాధికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. 102

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా,

సమస్తభక్తసుఖదా లాకిణ్యంబాస్వరూపిణీ. 103

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా,

శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా2తిగర్వితా. 104

మేధోనిష్టా మధుప్రీతా బంధిన్యాదిసమన్వితా,

దధ్యన్నాసక్తహృదయా కాకిణీరూపధారిణీ. 105

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రా2స్థిసంస్థితా,

అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా. 106

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ,

ఆఙ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా. 107

మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా,

హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ. 108

సహస్రదళపద్మస్ధా సర్వవర్ణోపశోభితా,

సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ. 109

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ,

స్వాహా స్వధామతిర్మేధాశ్రుతిః స్మృతిరనుత్తమా. 110

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా,

పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా. 111

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః ,

సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ. 112

అగ్రగణ్యా2చింత్యరూపా కలికల్మషనాశినీ,

కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా. 113

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా,

మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. 114

నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ,

మైత్య్రాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ. 115

పరాశక్తి: పరానిష్ఠా ప్రఙ్ఞానఘనరూపిణీ,

మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ. 116

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా,

మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలినీ. 117

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా,

శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామాకోటికా. 118

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా,

శిరఃస్థితా చంద్రనిభా బాలస్థేంద్రధనుఃప్రభా 119

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా,

దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయఙ్ఞవినాశినీ. 120

దరాందోళితదీర్గాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ,

గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః 121

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ,

ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండలపూజితా. 122

కలాత్మికా కలానాధా కావ్యాలాపవినోదినీ,

సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా. 123

ఆదిశక్తిరమేయాత్మా22 పరమా పావనాకృతిః ,

అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా. 124

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ,

త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. 125

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచితా,

ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా. 126

విశ్వగర్భా స్వర్ణగర్భా2వరదా వాగధీశ్వరీ,

ధ్యానగమ్యా2పరిచ్ఛేద్యా ఙ్ఞానదా ఙ్ఞానవిగ్రహా. 127

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ,

లోపాముద్రార్చితా లీలాక్లప్తబ్రహ్మాండమండలా. 128

అదృశ్యా దృశ్యరహితా విఙ్ఞాత్రీ వేద్యవర్జితా,

యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా. 129

ఇచ్ఛాశక్తి :ఙ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ.

సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారినీ 130

అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రావిధాయినీ,

ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా. 131

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ,

బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా 132

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా,

సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః . 133

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా,

రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా. 134

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ,

సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా. 135

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ,

సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ. 136

దేశకాలాపరీచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ,

సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ. 137

సర్వోపాధివినిర్ముక్తా సదాశివ పతివ్రతా,

సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ. 138

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ,

గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా. 139

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ,

సనకాదిసమారాధ్యా శివఙ్ఞానప్రదాయినీ. 140

చిత్కలా22నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ,

నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ, 141

మిథ్యాజగదధిష్ఠానా ముక్దిదా ముక్తిరూపిణీ,

లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా. 142

భవదావసుధావృష్ఠిః పాపారణ్యదవానలా,

దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా. 143

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా,

రోగపర్వతధంభోలిర్మృత్యుదారుకుఠారికా. 144

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసనా,

అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ. 145

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ,

త్రివర్గదాత్రీ సుభగా త్య్రంబకా త్రిగుణాత్మికా. 146

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః ,

ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా. 147

దురారాధ్యా దురాదర్షా పాటలీకుసుమప్రియా,

మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా. 148

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ,

ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. 149

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః ,

త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా 150

సత్యఙ్ఞానానందరూపా సామరస్యపరాయణా,

కపర్ధినీ కలామాలా కామధుక్కామరూపిణీ. 151

కలానిధిః కావ్యకలా రసఙ్ఞా రససేవధిః ,

పుష్ఠా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా. 152

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా,

పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేధినీ. 153

మూర్తా2మూర్తా2నిత్యతృప్తామునిమానసహంసికా,

సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ. 154

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుదార్చితా,

ప్రసవిత్రీ ప్రచండా22ఙ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః . 155

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠ రూపిణీ,

విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. 156

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ,

భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. 157

చంధస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ,

ఉదారకీర్తిరుద్దామవైభవా వర్ణరూపిణీ. 158

జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ,

సర్వోపనిషదుద్ఘుష్ఠా శాంత్యతీతకలాత్మికా. 159

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా,

కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా. 160

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా,

కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ. 161

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ,

అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా. 162

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ,

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధా కృతిః. 163

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా,

యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ. 164

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ,

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ. 165

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ,

అయోనిర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ. 166

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ,

విఙ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా. 167

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ,

సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ. 168

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ,

స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా. 169

చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా,

సదోదితా సదాతుష్ఠా తరుణాదిత్యపాటలా. 170

దక్షిణాదక్షిణారాధ్యా ధరస్మేరముఖాంబుజా,

కౌలినీ కేవలా2నర్ఘ్యకైవల్యపదదాయినీ. 171

స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుతవైభవా,

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః. 172

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ,

ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ. 173

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ,

పంచయఙ్ఞప్రియా పంచప్రేతా మంచాధిశాయినీ. 174

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ,

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ. 175

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ,

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. 176

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ,

సుమంగలీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. 177

సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా,

బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా. 178

దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ,

ఙ్ఞానముద్రా ఙ్ఞానగమ్యా ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ. 179

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా,

అనఘా2ద్భుతచారిత్రా వాంఛితార్ధప్రదాయినీ. 180

అభ్యాసాతిశయఙ్ఞాతా షడధ్వాతీతరూపిణీ,

అవ్యాజకరుణామూర్తిరఙ్ఞానధ్వాంతదీపికా 181

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా,

శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ. 182

శ్రీశివా శివశక్త్యైకరూపిణీ లలితాంబికా, ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః

ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే, ఉత్తర ఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితా సహస్ర నామ

స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యయః

ఓం ఐం –హ్రీం – శ్రీం –ఐం - క్లీం –సౌః – క్లీం – ఐం

ఫలశృతి ఉత్తరపీఠికా

ఇత్త్యేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ,

రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకమ్. 1

సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్,

సర్వజ్వరార్తిశమనం ధీర్ఘాయుష్యప్రదాయకమ్ 2

అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి,

సర్వరోగప్రశమనం సర్వసంపత్ర్పవర్ధనమ్. 3

పుత్రప్రదమపుత్రాణాం పురుషార్ధప్రదాయకమ్,

ఇదం విశేషాచ్ఛ్రీదేవ్యాప్ స్తోత్రం ప్రీతివిధాయకం. 4

జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్తితత్పరః ,

ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్యచ. 5

పూజాగృహం తతో గత్వా చక్రరాజం సమర్చయేత్,

విద్యాం జపేత్సహస్ర్ర్ర్రం వా త్రిశతం శతమేవ వా. 6

రహస్యనామసాహస్ర్ర్ర్రమిదం పశ్చాత్పఠేన్నరః,

జన్మమధ్యే సకృచ్చాపి య ఏతత్పఠతే సుధీః . 7

తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ,

గంగాది సర్వతీర్ధేషు యస్స్నాయాత్కోటిజన్మసు. 8

కోటిలింగ ప్రతిష్టాం చ యః కుర్యాదవిముక్తకే,

కురుక్షేత్రే తు యో దద్యాత్కోటివారం రవిగ్రహే. 9

కోటిస్సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజన్మః

యః కోటిం హయమేధానా మాహరేద్గాంగరోధసి. 10

ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే,

దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్. 11

శ్రద్ధయా పరయా కుర్యాత్సహస్రపరివత్సరాన్,

తత్పుణ్యం కోటిగుణితం లభేత్పుణ్యమనుత్తమమ్. 12

రహస్యనామ సాహస్రే నామ్నో2ప్యేకస్య కీర్తనాత్,

రహస్యనామ సాహస్రే నామైకమపి యఃపఠేత్. 13

తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః ,

నిత్యకర్మాననుష్ఠానాన్నిషిద్ధ కరణాదపి. 14

యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువమ్,

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ. 15

అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే,

తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ. 16

యస్త్య క్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి,

స హి శీతనివృత్త్యర్దం హిమశైలం నిషేవతే. 17

భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్,

తస్మై శ్రీలలిలితాదేవీ ప్రీతాభీష్టం ప్రయచ్చతి. 18

అకీర్తయన్నిదం స్తోత్రం కధం భక్తో భవిష్యతి,

నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే. 19

సంక్రాతౌం విషువే చైవ స్వజన్మత్రితయే2యనే,

నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే. 20

కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః ,

పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం. 21

పంచోపచారైస్సంపూజ్య పఠేన్నామసహస్రకమ్,

సర్వే రోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంచ విందతి. 22

అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పచోదితః ,

జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసాహస్రకమ్. 23

తత్ క్షణాత్పృశమం యాతి శిరస్తోదో జ్వరో2పి చ,

సర్వవ్యాధినివృత్త్యర్ధం స్పృష్ట్వాభస్మ జపేదిదమ్. 24

తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్,

జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసహస్రతో మునే. 25

అభిషించేద్గ్రహగ్రస్తాన్ గ్రహా నశ్యంతి తత్క్షణాత్,

సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్. 26

యః పఠేన్నామసాహస్రం విషం తస్య తు జీర్యతి,

వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్. 27

నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్,

దేవ్యాః పాశేన సంబద్ధామాకృష్టామంకుశేన చ. 28

ధ్యాత్వాభీష్టాంస్త్రియంరాత్రౌ జపేన్నామ సహస్రకమ్,

ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతః పురం గతా. 29

రాజాకర్షణ కామశ్చేద్రాజావసథదిఙ్ముఖః ,

త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రదేవీధ్యానతత్పరః , 30

స రాజా పారవశ్యేన తురరరంగం వా మతంగజమ్,

ఆరుహ్యా యాతి నికటం దాసవత్ప్రణిపత్య చ. 31

తస్మై రాజ్యం చ కోశం చ దద్యాత్యేవ వశం గతః ,

రహస్యనామసాహస్రం యః కీర్తయతి నిత్యశః. 32

తన్ముఖాలోకమాత్రేణ ముహ్య్యేల్లోకత్రయం మునే,

యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్. 33

తస్య యే శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వరః ,

యో వాభిచారం కురుతే నామసాహస్రపాఠకే. 34

నివర్త్య తత్ర్కియాం హన్యాత్తం వై ప్రత్యంగిరా స్వయమ్,

యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్రపాఠకమ్. 35

తానంధాన్కురుతే క్షిప్రం స్వయం మార్తాండభైరవః ,

ధనం యో హరతే చోరైర్నామసాహస్రజాపినః . 36

యత్ర యత్ర స్థితం వాపి క్షేత్రపాలో నిహంతి తమ్,

విద్యాసు కురుతే వాదం యో విద్వాన్నామ జాపినా. 37

తస్య వాక్ స్తంభనం సద్యః కరోతి నకులేశ్వరీ,

యో రాజా కురుతే వైరం నామసాహస్రజాపినా 38.

చతురంగబలం తస్య దండినీ సంహరేత్స్వయమ్,

యః పఠేన్నామసాహస్రం షణ్మాసం భక్తిసంయుతః . 39

లక్ష్మీశ్చాంచల్యరహితా సదా తిష్ఠతి తద్గృహే,

మాసమేకం ప్రతిదినం త్రివారం యః పఠేన్నరః . 40

భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యశః ,

యస్త్వేకవారం పఠతి పక్షమాత్రమతంద్రితః . 41

ముహ్యంతి కామవశగా మృగాక్ష్యస్తన్య వీక్షణాత్,

యః పఠేన్నామసాహస్రం జన్మమధ్యే సకృన్నరః . 42

తద్దృష్టిగోచరాస్సర్వే ముచ్యంతే సర్వకిల్బిషై,

యోవేత్తి నామసాహస్రం తస్మై దేయం ద్విజన్మనే. 43

అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభస్తు కదాచన.

శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యస్సమర్చతి. 44

యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్భుధాః ,

తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవీప్రీయమిచ్ఛతా. 45

న కీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తి యః ,

పసుతుల్యస్సవిఙ్ఞేయస్తస్మై దత్తం నిరర్థకమ్. 46

పరీక్ష్య విద్యావిదుషస్తేభ్యో దద్యాద్విచక్షణః ,

శ్రీమంత్రరాజసదృశో యధా మంత్రో న విద్యతే. 47

దేవతా లలితాతుల్యా యథా ననాస్తి ఘటోద్భవ,

రహస్యనామసాహస్రతుల్యా నాస్తి తథా స్తుతిః . 48

లిఖిత్వా పుస్తకే యస్తు నామసాహస్రముత్తమమ్,

సమర్చయేత్సదా భక్త్యా తస్య తుష్యతి సుందరీ. 49

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ,

నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే. 50

తస్మాదుసాసకో నిత్యం కీర్తయేదిదమాదరాత్,

ఏభిర్నామసహస్త్రైస్తు శ్రీచక్రం యో2ర్చయేత్సకృత్. 51

పద్మైర్వా తులసీపుష్పైః కల్హారైర్వా కదంబకైః ,

చంపకైర్జాతికుసుమైర్మల్లికాకరవీరకైః. 52

ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేసరపాటలైః ,

అన్యైసుగంధికుసుమైః కేతకీమాధవీముఖైః 53

తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః ,

సా వేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్. 54

అన్యే కథం విజానీయుః బ్రహ్మాద్యాస్స్వల్పమేధసః ,

ప్రతిమాసం పౌర్ణమాస్యామేభిర్నామసహస్రకైః . 55

రాత్రౌ యశ్చక్రరాజస్థామర్చయేత్పరదేవతామ్,

స ఏవ లలితారూపస్తద్రూపా లలితా స్వయమ్. 56

న తయోర్విద్యతే భేదో భేదకృత్పాపకృద్భవేత్,

మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీ చక్రమధ్యగామ్. 57

అర్చయేనామసాహస్రైస్తస్య ముక్తిః కరే సస్జతితా,

యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్. 58

చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు,

సర్వాన్కామానవాప్యేహ సర్వసౌభాగ్యసంయుతః . 59

పుత్రపౌత్రాదిభిర్యు క్తో భుక్వా భోగాన్యథేప్సితాన్,

అంతే శ్రీలలితాదేవ్యాః సాయుజ్యమపిదుర్లభమ్. 60

ప్రార్ధనీయం శివాద్యైశ్చ ప్రాప్నోతేవ న సంశయః ,

యః సహస్రం బ్రాహ్మణానామేభిర్నామసహస్రకైః . 61

సమర్చ్య భోజయేధ్బక్త్యా పాయస2పూపషడ్రసైః ,

తస్మై ప్రీణాతి లలితా స్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి. 62

న తస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే,

నిష్కామః కీర్తయేద్యస్తు నామసాహస్రముత్తమమ్. 63

బ్రహ్మఙ్ఞానమవాప్నోతి యేన ముచ్యేత బంధనాత్,

ధనార్థీ ధనమాప్నోతి యశో2ర్థీ చాప్నుయాద్యశః . 64

విద్యార్థీ చాప్నననుయాద్విద్యాం నామసాహస్రకీర్తనాత్,

నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. 65

కీర్తనీయమిదం తస్మాద్భోగమోక్షార్థిభిర్న రైః,

చతురాశ్రమనిష్టైశ్చ కీర్తనీయమిదం సదా. 66

స్వధర్మసమనుష్ఠానవైకల్యపరిపూర్తయే,

కలౌ పాపైకబహులే ధర్మానుష్ఠానవర్జితే. 67

నామసంకీర్తనం ముక్త్వా నృణాం నాన్యత్పరాయణమ్,

లౌకికాద్వచనన్ముఖ్యం విష్ణునామానుకీర్తనమ్. 68

విష్ణునామసహస్ర్ర్ర్రాచ్చ శివనామైకముత్తమమ్,

శివనామసహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమమ్. 69

దేవీనామసహస్రాణి కోటిశస్సంతి కుంభజ,

తేషు ముఖ్యం దశవిధం నామసాహస్రముచ్యతే. 70

గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీసర్వతీ

రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశా

రహస్యనామసాహస్రమిదం శస్తం దశస్వపి,

తస్మాత్సంకీర్తయేన్నిత్యం కలిదోషనివృత్తయే. 71

ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః ,

విష్ణునామపరాః కేచిచ్ఛివనామపరాః పరే. 72

న కశ్చిదపి లోకేషు లలితానామతత్పరః,

యేనాన్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు. 73

తస్యైవ భవతి శ్రద్ధా శ్రీదేవీనామసంకీర్తనే,

చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్. 74

నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని,

యథైవవిరలా లోకే శ్రీవిద్యారాజవేదిన. 75

తథైవ విరలా గుహ్యనామపాఠకాః ,

మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తథా. 76

రహస్యనామపాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్,,

ఆపఠన్నామసాహస్రం ప్రీణయేద్యో మహేశ్వరీమ్. 77

స చక్షుషా వినా రూపం పశ్యేదేవ విమూఢధీః ,

రహస్యనామసాహస్రం త్య క్త్వా యః సిద్ధికాముకః . 78

స భోజనం వినా నూనం క్షున్నివృత్తిమభీప్సతి,

యో భక్తో లలితాదేవ్యాః స నిత్యం కీర్తయేదిదమ్, 79

నాన్యధా ప్రీతయే దేవీ కల్పకోటిశతైరపి,

తస్మాద్రహస్యనామాని శ్రీమాతుః ప్రియతః పఠేత్. 80

ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభసంభవ,

నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన. 81

యథైవ గోప్యా శ్రీవిద్యా తథా గోప్యమిదం మునే,

పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమమ్. 82

యో దదాతి విమూఢాత్మా శ్రీవిద్యారహితాయ చ,

తస్మై కుప్యంతి యోగిన్యః సో2నర్ధః సుమహాన్ స్మృతః , 83

రహస్యనామసాహస్రం తస్మాత్సంగోపయేదిదమ్.

స్వాతంత్ర్యేణ మయా నోక్తం తవాపి కలశోద్భవ,

లలితాప్రేరణేనైవ మయోకక్తం స్తోత్రముత్తమమ్. 84

కీర్తనీయమిదం భక్త్వా కు:భయోనే నిరంతరమ్,

తేన తుష్టామహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి. 85

ఇత్యు క్త్వా శ్రీహయగ్రీవో ధాత్వా శ్రీలలితాంబికామ్.

ఆనందమగ్న హృదయ—స్సద్యః పులకితో2భవత్. 86

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖంఢే

శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్రఫల నిరూపణం నామ

తృతీయో2ధ్యాయః: శ్రీ లలితా రహస్యనామ సాహస్ర ఉత్తర పీఠికా సమాప్తః

,




,

20, నవంబర్ 2011, ఆదివారం

గురుదేవుల శతజయంత్యుత్సవ సంచిక


పెద్దలూ, సమవయస్కులూ భాష్యం అనీ, అంతేవాసులు ఎస్వీయన్ గారు అనీ ఎంతో ఇష్టంగా పిలుచుకునే వారు వారిని.
వారే శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యుల వారు.

వారి శతజయంతి వేడుకలు విజయ నగరం శంకరమఠంలో తే 16 -9-2010 ది అద్వితీయంగా జరిగాయి.
మాష్టారి బంధువులూ, మిత్రులూ, శిష్యులూ, విజయ నగరం సౌరులూ చాలా మంది విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయ వంతం చేసారు.

ఆనాటి కర్యక్రమం వివరాలతో, ఫొటోలతో, ప్రముఖుల వ్యాసాలతో రూపొందించిన ఎస్.వీ.ఎన్ గారి శతజయంత్యుత్సవ సంచిక వెలువడింది.
నాటి కార్యక్రమంలో ఆచార్య శలాక రఘునాథ శర్మ, బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్య స్వామి, వారి శిష్యులు డాక్టర్ ఎ. గోపాలరావు, డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహంగారూ, విజయ నగరం సంస్కృత కలాశాల నాటి అథ్యక్షులు శ్రీ మానాప్రగడ శేషసాయి గారూ, జోస్యుల దక్షిణా మూర్తి గారూమొదలయిన వారు చక్కని ప్రసంగాలు చేసారు.

గురువు గారి కుమారులు శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, రంగాచార్యులు గారలు ఈ శతజయంతి సంచికను ప్రచురించారు.

ఇందులోమహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శ్రీమాన్ న.చ.రఘునాథాచార్య స్వామి, శ్రీమతి కిదాంబి గోదా దేవి, కిదాంబి రఘుపతి, ఆచార్య సార్వ భౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శా స్త్రి, ప్రాచార్య శలాక రఘనాథ శర్మ, డా. యు.ఎ.నరసింహమూర్తి,శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్యులు, డా. అయలసోమయాజుల గోపాలరావు,
జోస్యుల దక్షిణామూర్తి, శ్రీభాష్యం తిరుమల రామానుజాచార్యులు, ప్రభృతులు వ్రాసిన చక్కని రచనలు ఉన్నాయి.

వీటితో పాటు విష్ణధర్మాంతర్గత మాంగళ్య వివృద్ధి స్తోత్రమ్ నకు మా గురుదేవులు ఎస్.వీ.ఎన్ గారు రచించిన ఆంధ్రతాత్పర్య సహిత వ్యాఖ్యానాన్ని కూడ ప్రచురించారు.

మా గురుదేవులు శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యులు (ఎస్.వి.ఎన్) గారు విజయగరం సంస్కృత కలాశాలలో విద్యాప్రవీణ, భాషా ప్రవీణలు చదివారు.


జ్యోతిష, న్యాయ, వేదాంత శాస్త్రాలలో నిష్ణాతులు. 1947 నుండి 1973 వరకూ అదే కలాశాలలో పండిత పదవిని అలంకరించారు. తెలుగు శాఖకి అధిపతి గా బాధ్యతలు నిర్వహించారు.

1969 - 1972 వరకూ అదే కలాశాలలో భాషాప్రవీణ చదివిన నేను వారి శిష్యులలో ఒకడినై కనులారా వారిని తిలకిస్తూ, చెవులారా వారి పాఠ్య బోధనామృతాన్ని గ్రోలే అదృష్టానికి నోచు కున్నాను.

గురుదేవులు మాకు అనంతుని ఛందస్సు, ప్రౌఢవ్యాకరణం, అహోబల పండితీయం, అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, రాఘవపాండవీయం మొదలయినవి బోధించారు. 16వ శతాబ్ది నాయకరాజుల యుగం ప్రత్యేకాంశంగా మాకు బోధించారు.

శ్రీ ఎస్.వీ.ఎన్ గారు ప్రౌఢ వ్యాకరణానికి చక్కని వ్యాఖ్య వెలయించారు. అలాగే అనంతుని ఛందోదర్పణానికి తత్త్వబోధినీ వ్యాఖ్య రచించారు. అప్పటి వరకూ ఈ గ్రంథాలకు సర్వ సమగ్రమయిన వ్యాఖ్యాన గ్రంథాలు లేవు.

ఛందోదర్పణానికయితే అసలు వ్యాఖ్యలే లేవు. ఆ ఘనత మా గురుదేవులకే దక్కింది !

గురువులు నాచన సోమన ఉత్తరహరివంశానికీ, చేమకూర వేంకట కవి విజయ విలాసానికీ కూడా చక్కని వ్యాఖ్యలు రచించారు. ( ఇవి రెండూ అముద్రితాలు, దురదృష్టవశాత్తు నేడు అలభ్యాలు కూడా.)

శ్రీనివాస స్తుతి పేరుతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై శతకాన్ని రచించారు.

శ్రీకూర్మనాథ సుప్రభాతం రచించారు.

నాట్య శాస్త్ర రచనలో పోణంగిపల్లి అప్పారావు గారు, తూమాటి దొణప్ప గారు మొదలయిన ఎందరో సాహితీ వేత్తలకు. పరిశోధకులకూ వీరు అందించిన సహకారం అనన్యసామాన్యమైనది.

చెరగని చిరు నవ్వు , అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించే చూపులూ, మృదు మధురమైన మాట తీరూ, నిరాడంబరమైన జీవన శైలీ మా గురు దేవులకే స్వంతం.

మాకు ప్రౌఢ వ్యాకరణమో, ఛందో దర్పణమో పాఠ్యాంశంగా బోధించడానికి , తాము స్వయంగా చక్కని వ్యాఖ్యానాలు ఆ పుస్తకాలకి రచించి కూడా తరగతి గది లోకి రావడానికి ముందుగా ప్రతి రోజూ ఆ పుస్తకాలను శ్రద్ధగా తిరగెయ్యడం చూస్తే
అంత గొప్ప గురువల వద్ద చదువు కొనే మా భాగదేయం మాకే దక్కింది కదా అని గర్వించే వాళ్ళం.

ఈ శతజయంతి సంచిక గురించి మరిన్ని వివరాలు కావాలనుకునే వారికి :

శ్రీభాష్యం శ్రీనివాసాచార్యలు, 101, లక్ష్మీ నిలయం, తిరుమల నగర్, మీర్ పేట, మౌలాలి, హైదరాబాద్40,
ఫోను నంబరు: 27241942 మరియు 9866474202 చిరునామాకి సంప్రదించ వచ్చును.

గురుభ్యో నమ:

ఇతి శివమ్.





4, నవంబర్ 2011, శుక్రవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!

వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.

అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.

సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.

సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.

మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.

అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.

మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.

మీ తెలిసినదే కదా.

వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో

మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.

అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -

సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.

ఇక,

మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.

ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !

ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.

పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.

అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.

నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,

సారీ, గురూ !


3, నవంబర్ 2011, గురువారం

ఈ గేయం ఏ కవి రచించారో చెప్పండి చూదాం !

ఒకరి కొకరు

నువ్వూ నేనూ కలిసి
పువ్వులో తావిలా
తావిలో మధువులా !

నువ్వూ నేనూ కలిసి
కోకిలా గొంతులా
గొంతులో పాటలా !

నువ్వూ నేనూ కలిసి
వెన్నెలా వెలుగులా
వెలుగులో వాంఛలా !

నువ్వూ నేనూ కలిసి
గగన నీలానిలా
నీలాన శాంతిలా !

ఈ చిన్ని గేయ రచయిత ఎవరో చెప్పగలరూ ?

క్లూ ఏదేనా ఇమ్మంటారా ?

అతను గొప్ప కవి అని చిత్రకారులు అనేవారుట ! అతను గొప్ప చిత్రకారుడు అని కవులు పొగిడే వారుట.

ఇతని ఊహా ప్రేయసి చంద్ర సంబంధి.

పోనీ, మరో క్లూ ఇమ్మంటారేమిటి ?

ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఒకసారి ఒక నవలల పోటీ లో మరొక ప్రముఖునితో పాటు, ఇతనికి బహుమతి పంచి ఇచ్చారు.

ఆ ప్రముఖుని ప్రముఖ పాటల పుస్తకంలో ( గేయ సంపుటి ) బొమ్మలు ఇతనే గీసారు.

ఈ క్లూలు చాలవూ !

పోనీ, వారి ఫొటో కూడా పెట్టేస్తున్నాను. చెప్పెద్దురూ ! అయితే, మరో అనుబంధ ప్రశ్న కూడా ఉందండోయ్ !

క్లూలలో చెప్పిన బహుమతి పొందిన నవల పేరూ, వారి ఊహా ప్రేయసి పేరూ, వారు బొమ్మలు వేసిన గేయ సంపుటి పేరూ కూడా చెప్పాలి. మరి.