8, జనవరి 2020, బుధవారం
వేమన ఏమని చెప్పాడూ ?
లేబుళ్లు:
మంచి పలుకు
7, జనవరి 2020, మంగళవారం
దేనికయినా ప్రాప్తం ఉండాలి
పట్టు విడువ రాదు 10
ఎట్టుగఁబాటు పడ్డ
నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి
రాక్షసుల్
గట్టు పెకల్చి
పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే
మనుభవించిరి వారమృతంబు భాస్కరా !
ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత
చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా
చేసుకుని, వాసుకిని
తాడుగా చేసుకుని, రాక్షసులు
కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి
చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?
లేబుళ్లు:
మంచి పలుకు
6, జనవరి 2020, సోమవారం
అసాధ్యం సుసాధ్యం అవుతుదా ?
లేబుళ్లు:
మంచి పలుకు
5, జనవరి 2020, ఆదివారం
పడుకున్న సింహానికి పస్తే...
పట్టు విడువ రాదు 08
ఉద్యమేనహి సిద్ధ్యంతి
కార్యాణి, నమనో
రధై:
నహి సుప్తస్య సింహస్య
ప్రవిశంతి ముఖే మృగా :
కోరిక ఉంటే చాలదు. అది
నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న
సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత
మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !
లేబుళ్లు:
మంచి పలుకు
4, జనవరి 2020, శనివారం
దైవానుగ్రహం ఉండాలి...
పట్టు విడువ రాదు 07
దైవం అనుకూలించక పోతే, మనం
ఏమీ చేయ లేం ...
కాకతాళీయవత్ ప్రాప్తం
దృష్ట్వాZపి
నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే
పురుషార్ధ మపేక్షతే
దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా
ఉన్న నిధి కూడా మన కంట పడదు.
అందు వలన దైవానుగ్రహాన్ని
అపేక్షిస్తూ, మానవ
ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.
3, జనవరి 2020, శుక్రవారం
దేవుడి సాయం
లేబుళ్లు:
మంచి పలుకు
2, జనవరి 2020, గురువారం
ప్రయత్నం చేసే వాడిదే విజయం
పట్టు విడువ రాదు 05
ఉద్యోగినం పురుష
సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా
వదంతి
దైవం నిహత్య కురు
పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న
సిద్ధ్యతి కోZత్ర
దోష: ?
ప్రయత్నం చేసే వాడికే
విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ
చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం
లభించ లేదనుకో, దాని
వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.
1, జనవరి 2020, బుధవారం
మంచి మాటలు విందాం
పట్టు విడువ రాదు 04
దైవానుగ్రహం లేనిదే మనం
ఏదీ సాధించ లేం. అలాగే,
దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.
గజేంద్రోపాఖ్యానం కథలో
కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ
ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...
నదైవమేవ సంచిత్య
త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని
తిలేభ్యో నాప్తుమర్హతి
దైవం మీద భారం వేసి. మన
ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?
లేబుళ్లు:
మంచి పలుకు
31, డిసెంబర్ 2019, మంగళవారం
మానవ ప్రయత్నం అవసరం సుమా...
పట్టు విడువ రాదు 04
దైవానుగ్రహం లేనిదే మనం
ఏదీ సాధించ లేం. అలాగే,
దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.
గజేంద్రోపాఖ్యానం కథలో
కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ
ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...
నదైవమేవ సంచిత్య
త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని
తిలేభ్యో నాప్తుమర్హతి
దైవం మీద భారం వేసి. మన
ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?
లేబుళ్లు:
మంచి పలుకు
30, డిసెంబర్ 2019, సోమవారం
పడి లేచే కడలి తరంగం
పట్టు విడువ రాదు 03
యథా కందుక పాతే
నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి
మృత్పిండ పతనం యథా
కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ
మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి
యుండుఁగృపణత్వమునన్
బంతి నేలకేసి కొడితే ఎలా
తిరిగి మీదికి లేస్తుందో,
సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి
పుంజుకుని లేస్తాడు.
తెలివి తక్కు వాడు మాత్రం
నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.
లేబుళ్లు:
మంచి పలుకు
29, డిసెంబర్ 2019, ఆదివారం
పట్టు విడువ రాదు 02
పట్టు విడువ రాదు 02
ఛిన్నోZపి
రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త:
సన్తప్యన్తే నవిప్లుతాలోకే
ఖండితంబయ్యు భూజంబు వెండి
మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు
సోముఁ
డివ్విధమున విచారించి
యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు
జనులు.
చెట్టుని చూడండి. నరికినా
తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు
క్షీణించినా, తిరిగి
శుక్ల పక్షంలో పుంజుకుని,
పూర్ణిమ నాటికి నిండు జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు
ఓటమిని , ఆపదని, గాయాలను
సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.
లేబుళ్లు:
మంచి పలుకు
28, డిసెంబర్ 2019, శనివారం
పట్టు విడువగ రాదు
మన పూర్వ కవులు మన
వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో
చెప్పారు.
సింహ: శిశురపి మదమలిన
కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న
ఖలు వయస్తేజసాం హేతు:
విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ
కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు
కారణమగునే ?
సింహం పిల్ల కూడ రెచ్చ
గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ
గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.
ఇదే అంశం మీద వివిధ కవులు
ఏమేమి చెప్పారో రోజు కొకటి చొప్పున రేపటి
నుండి చూదాం...
లేబుళ్లు:
మంచి పలుకు
27, డిసెంబర్ 2019, శుక్రవారం
కదిలేదీ కదిలించేదీ...
కదిలేదీ కదిలించేదీ
విప్రకృత: పన్నగ: ఫణం
కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి
జన:
దానితో రాజునకు ఆగ్రహం
కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....
ప్రతి మనిషిలోను
అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు
చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో
తెలిసిందే కదా? శోకమే
శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!
‘ కదిలేదీ కదలించేదీ
కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ
గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?

చితుకులు కదల్చుటను చెలగి
మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ
విప్పు
మఱియు క్షోభంబు వలననె
మానవుడును
దనదు మహిమంబు చూపును
తథ్యముగను.
లేబుళ్లు:
మంచి పలుకు
26, డిసెంబర్ 2019, గురువారం
తొందరపాటు తగదుసుమా ..
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:
ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ,
ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !
లేబుళ్లు:
మంచి పలుకు
25, డిసెంబర్ 2019, బుధవారం
అశా పావము కడున్నిడుపు.....
మా ఇంటి కొస్తే ఏం తెస్తావ్
? మీ ఇంటి కొస్తే ఏం ఇస్తావ్?
పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం
నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం
కుర్వంతి యత్నత:
మనుషులెంత గడుసరి వారో
చూడండి. పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం
మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు.
నిత్యం అనేక పాపాలు
చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప
ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! ఎంత విపరీతమో చూడండి
దీనిని గడుసుదనం అనాలో, స్వార్ధం
అనాలో మనమే నిర్ణయించుకోవాలి.
మా ఇంటి కొస్తే నాకేం
తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే
నాకేం ఇస్తావ్ ? అనడం
లాంటిదే
కదూ ఇది !
దేశం నాకేమిచ్చింది ? అనుకోడం
మాని, దేశానికి
నేనేమి ఇచ్చాను ? అని
ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని పెద్దలు ఘోషించేది ఇందుకేనండీ బాబూ ! ...
లేబుళ్లు:
మంచి పలుకు
24, డిసెంబర్ 2019, మంగళవారం
ఇవి ఉంటే అవెందుకు ?
నిన్నటి దినం ఏవి ఉంటే ఏవి శోభిస్తాయో చూపాం. ఇవాళ ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఛూదాం...
అవి ఉంటే, ఇవి అక్కర లేదు
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు.
చూడండి ...
ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
( ఆదాయాదులే మన కొంపకి
చిచ్చు పెడతారు.)
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు( వారే
మనని మంచి మార్గంలో నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు అందిస్తారు)
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పనేముంది ?
( వాళ్ళే పాముల వంటి వారు)
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు ఎందుకు ?
( విద్యా
ధనమే తరగని సంపద కదా)
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు ఎందుకు ?
( సిగ్గే
కదా చక్కని సింగారం?)
కవితా శక్తి కల వారికి వేరే రాజ్యమెందుకు ?
( రాజ్యభోగం
కన్నా కవితా శక్తి గొప్ప కీర్తిదాయకం కదా)
.
లేబుళ్లు:
మంచి పలుకు
23, డిసెంబర్ 2019, సోమవారం
దేని వన ఏది శోభిస్తంది ?
దేని వలన ఏది శోభిస్తుంది ?
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా
శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య
వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా
ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ
మిదం శీలం పరం భూషణమ్ .
ఐశ్వర్యం వల్ల ఏది
శోభిస్తుంది ?
మంచితనం. ( సంపదకు మంచి
తనమే అలంకారం. )
పరాక్రమం దేని వలన
శోభిస్తుంది ?
మాట మంచితనం ( ఎంత పరాక్రమం
ఉన్నా, మాట
కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)
ఙ్ఞానం దేని వలన
శోభిస్తుంది?
శాంతం
వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)
పాండిత్యానికి అలంకారం ఏది ?
వినయం
ధనం ఉన్నందుకు ఏది చేయడం
వల్ల శోభ కలుగుతుంది ?
పాత్రత
నెరిగిన దానం
తపస్సునకు ఏది అలంకారంగా
భాసిస్తుంది ?
సహనం. కోపం లేక పోవడం
(క్రోధిగా తపస్వికిఁజన్నే? అని
భారతం చెబుతోంది.)
సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య
లక్షణం ఏది ?
క్షమా గుణం
ధర్మమునకు శోభని కలిగించేది
ఏది ?
నిర్మోహత్వం ( దేనిమీద
ఎక్కువ మమకారం లేక పోవడం)
సమత వలన ఏమి కలుగుతుంది ?
తేజస్సు.
తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త
జనులకూ శోభని ఇస్తుంది.
ఈ విధంగా పెద్దలు శీల
వర్తనకి పెద్ద పీట వేసారు.
ఆధారం : ఆంధ్ర
మహా భారతం. కవిత్రయ రచన.
లేబుళ్లు:
మంచి పలుకు