తెలుగు పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జనవరి 2012, గురువారం

31, డిసెంబర్ 2011, శనివారం

సత్య వాక్కు మహిమనవ్య వార పత్రిక తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 5-10-2011 దీ సంచికలో ప్రచురితం.
30, డిసెంబర్ 2011, శుక్రవారం

29, డిసెంబర్ 2011, గురువారం

గోవర్ధన గిరిధారీ ... !


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన నవ్య వార పత్రికలో తే 16.11.2011 దీ సంచికలో ప్రచురణ.


25, డిసెంబర్ 2011, ఆదివారం

హాలాహల భక్షణమ్నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన వచ్చిన కొన్ని పద్యాలను కథా మంజరిలో లోగడ ప్రచురించాను. ఇప్పుడు దీనిని చూడండి.

తే 07-12-20110 దీ నవ్య వార పత్రికలో ప్రచురణ.


7, డిసెంబర్ 2011, బుధవారం

చెప్పుకోండి చూద్దాం !
ఇక్కడ ఉంచిన చిత్రాల ఆధారంగా ఆలోచిస్తే ఒక చక్కని పద్యం స్ఫురించే వీలు ఉంది. కనుక్కోండి చూదాం !

చిత్రాలకు ముందు వెనుకల కొన్ని అక్షరాలో, పదాలో, పదబంధాలో చేర్చు కోవాలి.

వీటి ఆధారంగా స్ఫురించే పద్యం, దానిని రచించిన కవి పేరూ, గ్రంథం పేరూ కూడా చెప్పాలి.


ఏ చిత్రాన్నయినా, అవసర మయితే ఒకటి కంటె ఎక్కువ సార్లు ఉపయోగించు కోవచ్చును.

చిత్రాలన్నీ పద్యాన్ని అనుసరించి ఒక క్రమంలో మాత్రం ఉండవు. పద్యం లోనిఆయా పదాలను గుర్తుకు తేవడంలో ఏవేనా చిత్రాలు అంతగా సరిపోకపోతే మీరే సర్దుకు పోవాలిమరి.

ఇంతకీ ఇదంతా కేవలం సరదా కోసమే సుమండీ !
ఈ చిక్కు ముడి విడాలంటే ఏదేనా క్లూ ఇమ్మని బ్లాగు మిత్రులు కోరుతున్నారు.

సరే, ఈ పద్య కవికీ కోకట గ్రామానికీ సంబంధం ఉంది ! ఇంత కంటె తేలికయిన క్లూ మరొకటి ఉండదేమో కదూ !

22, సెప్టెంబర్ 2011, గురువారం

ప్రతి పద్య చమత్కారం . చేమకూర వేంకటకవి


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన ఇది తే 19. 9 . 2011 దీ నవ్య వార పత్రికలో ప్రచురితం.

ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం చూపించిన చేమకూర వేంకటకవి విజయ విలాసం లోని పద్యం ఇది. తాపీధర్మారావు గారి హృదయోల్లాస వ్యాఖ్య విజయవిలాసం అందాలను మరింత అందంగా ఆవిష్కరించింది.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు పద్యం వెలుగు జిలుగులు


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వరుసగా తే 10.8.2011 దీ , తే 24.8.2011దీ
తే 31.8 .2011 దీ సంచికలో ప్రచురితమైన పద్యాలను ఇక్కడ ఉంచుతున్నాను. ఈ లేబిల్ క్రింద వీటితో కలిపి మొత్తం ఇప్పటికి 7 పద్యాలు చూడ వచ్చును.

తక్కినవి తీరిక చేసుకొని తరువాత ...


29, ఆగస్టు 2011, సోమవారం

పోతన పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద తే 3-8-2011 దీ సంచికలో ప్రచురితం.

ఇది బమ్మెఱ పోతన భాగవతం లోని వామన చరిత్ర ఘట్టం లోని పద్యం. ఈ లేబిల్ క్రింద ఇది నాలుగో టపా.

28, ఆగస్టు 2011, ఆదివారం

అల్లసాని పెద్దన పద్యంఈ పద్యం నవ్య వార ప్రతికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 17-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది

ఇది పెద్దన గారి మను చరిత్ర ప్రబంధం లోనిది. తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది మూడవది.

27, ఆగస్టు 2011, శనివారం

తిక్కన పద్యం


నవ్య వార పత్రిక తే 27-7-2011 దీ సంచికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన వెలువడిన పద్యం . ఇది తిక్కన
గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోనిది.

తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది రెండవది.
రేపు మరో కవి కావ్యం నుండి మరో మనోహరమైన పద్యం ...

26, ఆగస్టు 2011, శుక్రవారం

నన్నయ పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వారం వారం ఒక తెలుగు పద్యం గురించి వ్రాస్తున్నాను.
ఆ శీర్షికలో ప్రచురితమైన వాటని ఇక్కడ బ్లాగు మిత్రుల కోసం ఉంచుతున్నాను.

ఇది నన్నయ గారి అవతారిక లోని పద్యం. నవ్యలో తే 20 - 7 - 2011 దీ సంచికలో ప్రచురితం. నవ్యలో వచ్చాక వీలుని బట్టి వాటిని ఈ బ్లాగులో ఉంచుతాను. తెలుగు పద్యం లేబిల్ క్రింద వాటిని మీరు చూడ వచ్చును.27, మార్చి 2011, ఆదివారం

పంతుల సీతాపతి రావు గారి పద్యాలు


శ్రీ పంతుల సీతాపతి రావు పద్య రచనలో విశేష కృషి చేస్తున్నారు. గణిత శాస్ర్త ఉపాధ్యాయునిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు నందిన వీరు తెలుగు పద్యం మీద అపార మైన మక్కువతో తరచుగా పద్య రచన చేస్తూ ఉంటారు. సుందర కాండ మొత్తం వీరు ఇటీవల పద్య రచనగా పూర్తి చేసారు. స్పందించిన ప్రతి అంశాన్ని ఛందో బద్ధం చేయడం వీరి అలవాటు. ఉద్యోగ విరమణానంతరం వీరు ప్రస్తుతం విశాఖ లో ఉంటున్నారు. వారి పుష్పావేదన మన కథా మంజరి బ్లాగర్ల కోసం. చూడండి:
:
పుష్పా వేదన


వేకువందునే మేల్గాంచి వివస మొంది,
దైవ పూజకు పూలను తేవ నెంచి,
పూల తోటకు నేగితి పూలు కోయ, 1

జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
ఎచట నుండియో వినిపించె అచట నాకు
మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
వట్టి చేతుల ఇంటికి పయన మైతి 2

పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
"వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
నేల పడియున్న పూలను నెత్తి జూపి
దీన మలరగ వినిపించె వింత కధను 3

వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
పూజ కొరకునే పూవులు పూయు ననుచు
భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు 4


రంగు రంగుల పూవుల రాసి పోసి,
ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి
స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు. 5

మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా
చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా
రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే
మెంతగ పొంగి పోయితిమొ ? ఏ తరి చేసిన పుణ్య మంచు చున్ 6

నూట ఎనిమిది పూవులు పూజ చేసి
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి,
స్వామి పాదాల చెంతన జార విడువ
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ 7

పూజ చేసిన వాడిన పూల నన్ని
భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
జలము నర్పణ చేసియు జార విడరె ! 8

గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
మొక్కలను నాటి ప్రతి రోజు మొద మలర,
నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము ! 9

పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
మల్లె జాజులు జడలోన మాల తురిమి
బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె ! 10

సభల యందున సత్కవుల్ సత్క రించ
పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
వారి గౌరవ మంతయు మాదె అనుచు
గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము 11

హరికధను చెప్పు హరిదాసు హార మందు,
పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ 12

సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు ! 13


ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల? 14

అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ? 15

అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి ! 16